Thursday, 06 Aug, 2026
దానిమ్మ గింజలు బావుంటాయి. కానీ దానిమ్మ గింజల రసంలో ఇంకెన్నో పోషకాలు ఉంటాయంటారు న్యుట్రీషనిస్టులు. ప్రతి వంద గ్రాముల దానిమ్మ గింజల్లో 78 శాతం నీరు 1.7 శాతం మంశాకృతులు, 0.1 శాతం కొవ్వు, 14.5 శాతం పిండి పదార్ధాలు, 0.01 శాతం కాల్షియం. 0.07 శాతం ఫాస్పరస్, ఇనుము, విటమిన్ బి-2, విటమిన్-c వుంటాయి. దానిమ్మలో సుక్రోజు మాత్రం వుంటుంది. దానిమ్మ మూడు రకాలు. తియ్యనివి, పులుపు తీపి తో కలిసి, తిపితో కూడిన వగరు. తీపి దానిమ్మ ఎంతో అదుపులో ఉంచేందుకు దానిమ్మ శరీరానికిఎంతో ఉపయోగ పడుతుంది. రక్త స్రావాన్ని అరికడుతుంది. శరీరానికి శక్తి ఇచ్చి ఆకలిని పోగొడుతుంది. కడుపులో మంట తగ్గించడంలో, దాహం తీర్చడంలో, జ్వరం తగ్గించడం లో, గుండె, నోరు, గొంతు ఇబ్బందులు దూరం చేయడం లో ఉపయోగ పడుతుంది. వేసవి లో వీరివిరిగా దొరికే దానిమ్మ వంటి పండ్లు, కూరగాయలు ఔషదాల్లాంటివి. ముందు లాగా కనిఇంచవు. డాక్టర్ల ప్రిస్ క్రిప్షన్ లో కనిపించవి గానీ చాలా మేలు చేస్తాయి.

ఇది సరికొత్త లాభం.

దానిమ్మ ఇంజలు ఇష్టపడని వారుండరు. ఎంచక్కని ఎరువుతో ఈ గింజలు ఎన్నో ఆహార పదార్ధాలని అలంకరణ కోసంగా కుడా వాడతారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న దానిమ్మలో శృంగారాన్ని ప్రేరేపించే గుణం వుందని ఎడినల్ బడ్స్ లోని క్వీన్ మార్గరేట్ యునివర్సిటీ వారు వెల్లడించారు. ప్రతి రోజు గ్లాసు దానిమ్మ రసం తీసుకోవడం తో సెక్స్ హార్మోన్ టెస్టోస్టిరాన్ స్ధాయి పెంచుతుందని వీరి పరిశోధనలో తేలింది. ఈ పరిశోధన లో పాల్గొన్న యువతలో, యువకుల్లో ఈ హార్మోన్ స్దాయి పెంచడం తో పాటు, మూడ్ మెరుగు పడటం, వత్తిడి తగ్గడం పరిశోధకుల దృష్టికి వచ్చింది. శృంగార వాంఛలు పెరిగే విషయంలో ఇంకా పరిశోధనా కొనసాగుతూ ఉన్నా, దానిమ్మ రసం మాత్రం రోజు తీసుకోండి దీని వల్ల లాభమేనని దానిమ్మలో శృంగారాన్ని ప్రేరేపించే గుణం వుందని పరిశోధకులు చెప్పారు.

Leave a Reply