Saturday, 10 Oct, 2026

రూపం మారిన వివాహ వేడుక

అర్పిత మెహతా భారతీయ ఫ్యాషన్ డిజైనర్.ఆమె ఉద్దేశ్యంలో పాతకాలపు పెళ్లి వేడుకలు కనుమరుగై నేటి రోజుల్లో విందులు వినోదాలతో కూడిన ఒక పెద్ద ఈవెంట్ గా మారింది నేటి వివాహ వేడుక .ఈ వేడుకకు తగిన విధంగా కొత్త స్టైల్ తో భారతీయ వస్త్రధారణ ను రూపొందించాలని అర్పిత ఉద్దేశం. బ్రైడల్ ఫ్యాషన్ వ్యక్తిగతంగా మారుతోంది. ప్రతిదీ సంప్రదాయ రూపంలోనే ఉండాలని నేటి వధువులు అనుకోవడం లేదు. తమ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే దుస్తుల్ని ఎంచుకుంటున్నారు. వీటిలో చేత్తో చేసిన వస్త్రాలు వారసత్వంగా వచ్చిన ఆభరణాలు ఆసక్తికరమైన ఊహించని రంగులు ప్రధానంగా ఉంటున్నాయి. పాత దాన్ని కొత్త దానితో కలపాలి అన్న ఆలోచన నాకు చాలా ఇష్టం అంటుంది అర్పిత  సాంప్రదాయ చీరతో అధునాతన ఆభరణాలు మిక్స్ చేయటం, పూర్తిగా వ్యక్తిగతంగా అనిపించేలా స్టైల్ చేయడం ఈ డిజైనర్ స్పెషాలిటీ. వివాహాన్ని బాగా ఆస్వాదించాలంటే హ్యాండ్లూమ్స్ వాటిలో భాగంగా ఉండాలి అవి అందం కోసమే కాదు వాటిలో జీవం ఉంటుంది అవసరానికి అనుగుణంగా తరతరాలకు వాటిని అందించడం నా ఉద్దేశం ఉంటుంది అంటుంది అర్పిత. వేడుకల్లో ధరించే దుస్తులు తయారు చేయడం అర్పిత ప్రత్యేకత.

Leave a Reply