Saturday, 10 Oct, 2026

బెస్ట్ నవల గా ఇన్సైడ్ ఎడ్జ్

స్క్రీన్ రైటింగ్ సాహిత్యం క్రీడలు అన్నింటిలోనూ తనదైన ముద్ర వేసి ఇన్సైడ్ ఎడ్జ్ సిరీస్ రచయిత్రి గా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న నిధి శర్మ పుస్తకం ఇంటర్నేషనల్ ఎమ్మి అవార్డుకు నామినేట్ అయింది.ఇన్సైడ్ ఎడ్జ్ ఒక స్పోర్ట్స్ డ్రామా.ఇంగ్లీష్ లిటరేచర్ లో ఆనర్స్ చదివిన నిధి న్యూయార్క్ యూనివర్సిటీ, న్యూయార్క్ ఫిలిం అకాడమీల్లో చిత్ర నిర్మాణం స్క్రీన్ రైటింగ్ కోర్సులు చదివారు సాహిత్యం మీద ఇష్టంతో మొదటి నవల డాన్సింగ్ విత్ డెమన్స్ రాశారు బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఫిక్షన్ రామా ఇది. ఇది సినిమా గా రాబోతోంది రెండో నవల ఇన్విక్షన్స్ ది జంగిల్ దట్ మేడ్ మీ. ఇది 2021లో రాశారు బాల్యంలో జరిగిన ఒక నిజమైన సంఘటన స్ఫూర్తిగా ఈ నవల రాశారు ఆమె అమెజాన్ అవుట్డోర్ సర్వైవల్ చార్ట్ లో బెస్ట్ సెల్లర్ గా ఈ పుస్తకం నిలిచింది విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.నాయకత్వ లక్షణం ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా ఉంటుందని, ధైర్యం ఎప్పుడూ పోగొట్టుకోకూడదని జీవన్మరణ పరిస్థితులు ఎదురైనప్పుడు ఆత్మ నిబ్బరం తో ఉండాలని అని చెప్పి సాహస గాధ ఇది. తవాంగ్ లోని సైనిక స్థావరంలో పనిచేసే ఒక సైనికుడి కూతురు గా నిధి దేశంలోని చాలా ప్రాంతాలు తిరిగింది .ఈ కొత్త ప్రదేశాలు చూడటం, సాయుధ దళాల మధ్య పెరగడం ఆమెకు పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవటానికి సహాయపడింది. వీటన్నిటి అనుభవాలతో ఆమె ఈమధ్య డాడీ పేరుతో ఒక రాప్ గీతాన్ని విడుదల చేసింది.దీనికి అద్భుతమైన ఆదరణ లభించింది .ఈ పాట సైనిక శిబిరాల్లో గడిపిన నా బాల్యాన్ని గుర్తు చేస్తుంది సైనిక కుటుంబాల దృక్పథాన్ని, దృఢత్వాన్ని వారి జీవితంలో ఘట్టాలని సంగీత రూపంలోకి మార్చిన ఉత్సాహభరితమైన ట్రాక్ ఇది అంటుంది నిధి. అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ ఇన్సైడ్ ఎడ్జ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారమైన ప్రముఖ వెబ్ సిరీస్ ‘ఇన్సైడ్ ఎడ్జ్’ (Inside Edge) సీజన్ 3 కి క్రియేటర్‌గా పనిచేశారు.

Leave a Reply