Tuesday, 24 Nov, 2026

ఆమె పాటకు గ్రామీ నామినేషన్

చెన్నై కి చెందిన సుభిక్ష రంగరాజన్ గ్రామీ అవార్డ్స్ లో నామినేషన్ పొందిన తమిళ కృష్ణ గీతం వరువాయ్ పాడిన గాయని.వీరిది సంగీత కుటుంబం.ప్రఖ్యాత సెమ్మంగుడి కర్ణాటక సంగీత పరంపరకు చెందిన యువతి .తల్లి లక్ష్మీ రంగరాజన్ తొలి గురువు.13 ఏళ్ల వయసులోనే కచేరీలు మొదలు పెట్టిన సుభిక్ష ఆల్ ఇండియా రేడియో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్. కెనడాలోని టొరెంట్ యూనివర్సిటీ లో మ్యూజికల్ మాస్టర్స్ పట్టా తీసుకుంది.ఇళయరాజా ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజాలతో కలిసి పని చేసింది.గాయని గానే కాకుండా,సంగీత దర్శకురాలిగా పెయింటర్ గా యానిమేటర్ గా ఆమె బహుముఖ ప్రజ్ఞ చాటుకున్నది.ఈ మధ్యనే ప్రపంచ దేశాల కళాకారులతో కలిసి లవ్ లాంగ్వేజ్ అనే ఆల్బమ్ కూడా తీసుకొచ్చింది సుభిక్ష.

Leave a Reply