మునగ తో వ్యాపారం

మునగ తో వ్యాపారం

మునగ తో వ్యాపారం

మునగాకుతో సౌందర్య ఉత్పత్తులు తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తోంది పొన్నారసి. పదో తరగతి లో కూడా పాస్ అవలేదు. కానీ వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరగడం వల్ల తీసుకున్న 10 ఎకరాల పొలంలో మునగ చెట్లు నాటారు. తమిళనాడు లోని దిండిగల్ కు చెందిన పొన్నారసి ఆధునిక పద్ధతుల్లో ఈ వ్యవసాయ పంటను సాగు చేసి మునగను ప్రాసెస్ చేసి గింజల నుంచి నూనె,పొడి తయారు చేయడం నేర్చుకున్నారు. వీటి గింజల్లో నూనె ఎక్కువగా వస్తుంది.దిండిగల్ లోని వ్యవసాయ విస్తరణాధికారులు సాయంతో మునగాకులు,కాయలు, గింజలతో నూనె, సబ్బులు, షాంపూలు లిప్ బామ్స్ చేసే ప్రాసెస్ నేర్చుకున్నారు మలేషియా, సింగపూర్, అమెరికా, ఫ్యాన్స్ లకు ఈ ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి.