ఇదొక అపూర్వ అధ్యాయం
భారత రక్షణ దళంలో నాన్ మెడికల్ విభాగం నుంచి ఎయిర్ వైస్ మార్షల్ హోదా సాధించిన తొలి మహిళ అధికారి శక్తి శర్మ.సెప్టెంబర్ ఒకటవ తేదీన అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ గా బాధ్యతలు తీసుకున్నారామె. ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ చరిత్ర లోనే ఒక ప్రసిద్ధ సైనిక్ స్కూల్ కు కమాండింగ్ ఆఫీసర్ గా బాధ్యత తీసుకున్న మొదటి మహిళా అధికారి శక్తి శర్మ. ఐఐటీ కాన్పూర్ పూణే యూనివర్సిటీ లో ఐఏఎఫ్ చైర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు.రక్షణ రంగానికి అవసరమైన వ్యూహాత్మక పరిశోధనలు సాంకేతిక అధ్యయనాలు ఈ ఏర్పాటు వల్ల సులువయ్యాయి. వైమానిక దళంలో మెడికల్ విభాగం బయట గ్రూప్ కెప్టెన్ హోదా సాధించిన తొలి మహిళగా ఆమె నిలిచింది..ప్రస్తుతం ఎయిర్ హెడ్ క్వార్టర్స్ లో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ బాధ్యత తీసుకుంది వైమానిక దళాన్ని విద్య పరిశోధన రంగాల్లో మరింత బలోపేతం చేయడం నా ముందున్న తక్షణ కర్తవ్యం అంటుంది శక్తి శర్మ .ఏ రంగంలో అయినా ప్రతిభకు శ్రమకు లింగ భేదం అడ్డు కాదని ఆమె ప్రయాణం నిరూపించింది. భారత సాయుధ దళాల్లో మహిళలు 2 స్టార్ లేదా అంతకంటే ఎక్కువ ర్యాంకు చేరుకోవడం గతంలో కూడా ఉంది కానీ వారంతా వైద్య విభాగానికి చెందిన వారు, కానీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అన్నింటిని కలిపి నాన్ మెడికల్ విభాగం నుంచి ఒక మహిళా అధికారి ఇంత స్థాయికి ఎదగడం భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి.
