Saturday, 05 Sep, 2026

స్ఫూర్తిమంతమైన ప్రయాణం

మురారి జ్యోతి వెల్ఫేర్ ఫౌండేషన్ సంస్థను స్థాపించిన తేజస్విని ఈ సంవత్సరం గూంజ్ గ్రాస్ రూట్స్ అవార్డును అందుకుంది .ఆమె స్థాపించిన  ఈ సంస్థ ద్వారా వేల మంది మహిళల అభ్యున్నతి కోసం, పిల్లల ఆరోగ్యం కోసం విద్య కోసం ఉపాధి కల్పన కోసం కృషి చేస్తున్నందుకు గాను ఆమెకు ఈ గౌరవం దక్కింది.తేజస్విని  బ్రిటన్ లో ఎంఎస్సీ సైకాలజీ చదువుకున్నది. కొన్ని ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేశాక ఇండియాలో ప్రత్యేకించి బీహార్ ప్రాంతంలో మహిళల కోసం పిల్లల కోసం ఏదైనా చేయాలని నిశ్చయించుకున్నది .మహిళల నెలసరి ఇబ్బందులను తీర్చడం తో ఆరంభమైన ఈ సంస్థ కార్యకలాపాలు ఈ మూడేళ్లలో  బహుముఖంగా విస్తరించాయి. ప్రభుత్వాసుపత్రులు ,స్వచ్ఛంద సంస్థల సహకారంతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ తో సహా వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నారు.సర్వికల్ క్యాన్సర్ ,మధుమేహం, రక్తపోటు, పోషకాహార లోపం ఇలాంటి సమస్యలు ఉన్నవారికి ఉచిత వైద్యం ఆర్థిక సహాయం అందేలా చూస్తుంది ఈ సంస్థ. ప్రస్తుతం ఖగారియా, భాగల్పూర్ జిల్లా లో పూర్తిస్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ చేస్తున్న  కృషికి గానూ ఆ గ్రామాల్లో పిల్లల్లో అనారోగ్యాలు  90 శాతానికి  పైగా తగ్గాయి.

Leave a Reply