Wednesday, 05 Aug, 2026
అసలు ఎండ తగలేకపోవటం సరైన పోషకాహారం లేకపోవటం వల్ల దక్షిణాది మహిళల్లో డి విటమిన్ స్థాయిలు గణనీయంగా తగ్గిపోతున్నాయని ఒక అధ్యయనం సారాంశం. రోజు కొద్దిసేపు ఎండలో నిలబడగలిగితే శరీరానికి కావలిసిన డి విటమిన్ అందుతుంది, ఆ విటమిన్ లోపం శరీరం లోని కీలక అంగాలు వ్యవస్థల పైన ప్రభావం చూపెడుతుంది, ముందుగా పనితీరు మందగిస్తుంది. డిమేనేషియా ఆల్ఫామార్త్ రెండింటిలోనూ డి విటమిన్ పాత్ర ఉంది. గుండె కండరాలు బలహీనమవుతాయి. శ్వాసంగాలకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశం పెరుగుతుంది. ఎముకలు బలహీన పడతాయి. డి విటమిన్ లోపం ఉంటే 50శాతం ఎలాంటి బాహ్య లక్షణాలు కనిపించవు . కండరాలు వాపు వెన్ను నొప్పి సమస్య ఉంటే డి విటమిన్ లోపమని అర్ధం చేసుకోవచ్చు. ఖరీదైన పాఠశాలల్లో చదివే పిల్లలో 90 శాతం మందికి డి విటమిన్ లోపం కనిపిస్తుంది. పూర్తిగా శాఖా హరం తీసుకున్న డి విటమిన్ లోపం ఎక్కువవుతుంది. తీవ్రమైన భావోద్వేగాలు నిద్రలేకపోయినా ఎక్కువ చెమటలు పడుతున్నా వైద్యులను సంప్రదించి సరైన పోషకాహారం డి విటమిన్ తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడచ్చు.

ఎండ కావాలి.

ఆఫీసుకొ, బయటకో వెళ్ళేటప్పుడు దుమ్ము  ధూళి భయం తో శరీరం మొత్తం కవర్ చేసి  టూ వీలర్  పైనో  కార్ లోనో వెళుతూ  ఉంటాం. ఆఫీసులో ఇంట్లో  పూర్తి ఏ సి  ఇక శరీరానికి  ముఖ్యమైన  డి  విటమిన్  సంగతేమిటి? సహజమైన సూర్య కాంతి  తోనే డి విటమిన్ శరీరానికి  అందాలి. వారం లో మూడు సార్లు  అయినా  మొత్తం  శరీరం అంతటికీ  సూర్య కాంతి  తగిలేలా ఓ పావు   గంట అయినా  ఎండలో కూర్చోవాలి. డైట్ నుంచి విటమిన్  డి అందటం చాలా కష్టం. ఉదయ  ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు వరకు  ఏ బాల్కనీ  లో  ఎండ     పడితే ఆ   ప్రదేశంలో గడిపితే  డి విటమిన్ లభిస్తుంది. దృఢంగా  ఉంచేది ఇదే.

Leave a Reply