ధైర్యానికి ప్రతిరూపం ఈ కెప్టెన్
నేపాల్ తొలి మహిళ హెలికాప్టర్ కెప్టెన్ ప్రియా అధికారి .47 సంవత్సరాల ప్రియా అధికారి ప్రయాణం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో ఆమె పట్టా తీసుకున్నారు. మొదట్లో ఎయిర్ హోస్టెస్ గా కెరియర్ ప్రారంభించారు, కానీ విమానయానం మీద ఆమెకు ఎంతో ఆసక్తి .దానితో ఫిలిప్పీన్స్ వెళ్లి పైలెట్ శిక్షణలో చేరారు.2017 నాటికి ఆమె కెప్టెన్ గా మారారు .ఆ తర్వాత హిమాలయాల్లో ని ఎత్తైన ప్రాంతాల్లో సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్ లో శిక్షణ పొందారు. ఎవరెస్టు పర్వతం పై దాదాపు 62 మీటర్ల ఎత్తు వరకు వెళ్లి ఎంతోమంది గాయపడిన పర్వతారోహకులను రక్షించారు.. 2015లో నేపాల్ లో భూకంపం వచ్చింది.వరదల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ విపత్తులో రసువా జిల్లాలోని తిమురే అన్న గ్రామం పూర్తిగా దెబ్బ తిన్నది. ప్రియా అధికారి ఎంతో చొరవతో కేవలం ఆరు రోజుల వ్యవధిలో వంద రెస్క్యూ మిషన్లు పూర్తి చేసి వందలాదిమంది బాధితులను సురక్షితమైన ప్రాంతాలకు తరలించి ఎంతో మందికి ఆమె స్ఫూర్తి గా నిలిచారు. జల విద్యుత్ ప్రాజెక్టులు, ఇళ్ళు రోడ్లు సమస్తం కొట్టుకుపోయిన ఆ సందర్భంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆమె చూపిన ధైర్యం తెగువ, ప్రపంచవ్యాప్తంగా ఆమెకు ప్రశంసలు లభించాయి.
