Thursday, 20 Aug, 2026
మనం తీసుకొనే ఆహారం ఎప్పుడూ మనం చేసే పనిపైనే బాలన్స్ అవుతూవుంటుంది. స్త్రీల జీవన సరళిలో ఇంటి పని, చేస్తే ఉద్యోగం, పిల్లల్ని కనడం, ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవడం వంటి అనేక పనులు కలిసి వుంటాయి. అలా తీరిక లేని పనులు చేసే స్త్రీలు వాళ్ళు తీసుకునే ఆహారం, చేయాల్సిన వ్యాయామం పట్ల దృష్టి పెట్టరు. సమయం పాటించని ఆహారపు అలవాట్లు, శరీరానికి తగినంత పోషణ, వ్యాయామం ఇవేవీ వుండని కారణంతోనే వాళ్ళు ఫిట్ నెస్ తో వుండరు. పెళ్ళయి పిల్లలున్న చాలామంది ఆడవాళ్ళు బరువు పెరిగే కనిపిస్తుంటారు. అందుకే డైట్ లో ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. వయసు కనిపించకుండా ఉండాలంటే నిత్యం వ్యాయామాలు కూడా చేయాలి. ఆఫీస్ లో పని మధ్యలో కాసేపు నడవడం, మెట్లు ఎక్కి దిగటం, స్ట్రెచింగ్ ఎక్సర్సైజులు చేయడం చాలా అవసరం. తరచూ స్పా కు వెళ్ళటం, క్రమం తప్పని హెల్త్ చెకప్స్, మంచి పుస్తకం చదువుకోవడం, పచ్చని ప్రకృతిలో కాసేపు నడవటం ఇవన్నీ చేస్తేనే ఫిట్ గా వుంటారు.

కాలరీలు కరుగుతాయి 

ఎంత పనిలో ఉన్న ఎంత మంది వర్క్ అవుట్స్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. ఉదయపు నడక,జిమ్,తప్పని సరిగా రుతువుల తో సంబంధం లేకుండా కొనసాగిస్తుంటారు. ఈ లాక్ డౌన్ సమయం అన్నింటినీ పక్కన పెట్టమంది.కాలు బయట పెట్టేస్థితి లేదు. పైగా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా. మరి క్యాలరీలు కరిగించుకొనే దారెక్కడ? అలాటప్పుడు చక్కని ఉత్త్సహవంతమైన పాటకు వచ్చినట్లు డాన్స్ శరీరాన్ని యాక్టివ్ గా ఉంచుతోంది. పైగా శరీరమంతా కదిలేలా మూమెంట్స్ ఉంటాయి.కనుక కాలరీలు కరిగించుకొనే దారి ఇదే అంటున్నారు. డాన్స్ పర్ ఫెక్ట్ గా రానక్కర్లేదు. అందులో ఉత్సాహంగా ఉండే కదలికలు చాలు అంటారు అందుకే ఈ లాక్ డౌన్ సమయంలో ఓ అరగంట డాన్స్ ప్రాక్టీస్ చేస్తే కాలరీలు కరిగిపోతాయి.

Leave a Reply