Wednesday, 25 Nov, 2026

హస్త కళలకు ప్రోత్సాహం

భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, గ్రామీణ హస్త కళలను ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్లేందుకు రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చైర్ పర్సన్ నీతా అంబానీ స్వదేశ్ పేరుతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇది చేనేత వస్త్రాలు చేతితో చెక్కిన ఫర్నిచర్లు, తివాసీలు పెయింటింగ్ వంటి గృహ అలంకరణ సామాగ్రి సంప్రదాయ ఆభరణాలు,లైఫ్ స్టైల్ ఉత్పత్తులతో ఈ బ్రాండ్ లక్షలాదిమంది గ్రామీణ కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. అంతరించిపోతున్న హస్తకళలను కాపాడటం స్వదేశ్ ఉద్దేశం.2023 నవంబర్ లో హైదరాబాద్ లో నీతా అంబానీ ప్రారంభించిన తొలి స్టోర్ లో షాపింగ్ చేసేందుకు స్వదేశ్ ఆన్‌లైన్‌ స్టోర్ అధికారిక వెబ్‌సైట్ ఉంది.పింగాణి ఇత్తడి విలువైన రాళ్లు పొదిగిన ఆభరణాలు వెండి వస్తువులు అందమైన హస్తకళల ప్రతిరూపాలు ఇక్కడ లభిస్తాయి.భారతీయ కళాకారులను ముఖ్యంగా మహిళలను ప్రోత్సహించటం స్వదేశ్ ఉద్దేశం అంటుంది నీతా అంబానీ.

Leave a Reply