74 సంవత్సరాల దక్షా కనావియా 50 కె పింక్ మారథాన్ కు మస్కట్ గా వ్యవహరించారు. ఆ వయసులో ఎందరికో స్ఫూర్తి నిచ్చే వ్యక్తి అని నిరూపించుకున్నారు. 5కె రన్ తో పరుగు మొదలుపెట్టిన దక్షా 10 కె 24 గంటల రేస్ 100 కిలోమీటర్ల ఛాలెంజ్ వరకు సాగింది. మధుమేహం, ఆస్ట్రియో పొరాసిస్ తో ఇబ్బంది పడే దక్షా ఫిట్ నెస్ కోసం రన్నింగ్ మొదలుపెట్టారు. మహారాష్ట్ర క్రీడా పోటీలు, జాతీయ క్రీడా పోటీల్లో స్వర్ణ పథకాలు అందుకున్నారు రెండు గిన్నిస్ రికార్డ్ లు, మూడు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ లు ఏడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదు చేశారు.














