80 వ పుట్టిన రోజు జరుపుకున్న డాక్టర్ శ్రద్ధా చౌహాన్ స్కై డ్రైవింగ్ చేయాలని ముచ్చట పడింది. స్కై డ్రైవర్ అయినా ఆమె కొడుకు సౌరబ్ సింగ్ షేకావత్ స్కై హై ఇండియా చీఫ్ ఇన్స్ట్రక్టర్ వెంటనే తల్లి కోరిక తీరుస్తానన్నాడు. సర్వికల్ స్పాండిలైటిస్ వంటి సమస్యలున్నప్పటికీ పదివేల అడుగుల ఎత్తు నుంచి కుమారుడితో కలిసి జంప్ చేసింది శ్రద్ధ. ఇది ఆమె చిన్నప్పటి నుంచి కంటున్న కల మదర్ ఎమైల్ స్టోన్ క్యాప్షన్ తో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ జంప్ చేస్తున్న వీడియో వైరల్ అయింది. శ్రద్ధా చేసిన సాహసం ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తుందనటంలో ఆశ్చర్యం ఏమీ లేదు.














