సమస్య కో పరిష్కారం

సమస్య కో పరిష్కారం

సమస్య కో పరిష్కారం

15 సంవత్సరాల క్రితం అర్చన కపూర్ ప్రారంభించిన స్మార్ట్ కమ్యూనిటీ రేడియో నెహ్  జిల్లాలోని 168 గ్రామాలకు చెందిన ఆరున్నర లక్షల మంది గ్రామీణులకు ఎన్నో సమస్యలకు  పరిష్కారాలు చెప్పుతోంది. రోజుకు 14 గంటల ప్రసారాలతో జనం కోసం జనమే నిర్వహించే రేడియో నెట్‌వర్క్ ఇది. 2010 లో మేవాట్ లో ఈ రేడియో ప్రారంభించారు అర్చన. సామాజికంగా అక్షరాస్యత పరంగా అన్ని విధాల వెనుకబడిన ప్రాంతం ఇది. మూఢనమ్మకాలు ఎక్కువ. ఈ కమ్యూనిటీ రేడియో ద్వారా ఎన్నో సమస్యలు అధికారుల దగ్గరకు తీసుకువెళ్లగలగారు. గృహహింస, బాలింతల ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, పిల్లల పెంపకం గురించి వచ్చే సమస్యలను వయోధికులు తమ అనుభవాల ద్వారా తీరుస్తారు అజిత్ ప్రేమ్ జీ ఫౌండేషన్ గేట్స్ ఫౌండేషన్ కూడా ఈ రేడియో లో పనిచేస్తున్నాయి.