Monday, 30 Nov, 2026

మేలు చేస్తాయి

పిల్లల ఆరోగ్యం కోసం వారి ఆహారంలో పీచులతో కూడిన పదార్థాలు ఇమ్మంటున్నారు ఎక్స్ పర్ట్స్. అవి వాళ్ళకి నచ్చేలా ఉండాలి . గోధుమ పిండి గానీ ఓట్స్ గానీ ఉపయోగించి కుకీస్ తయారు చేసి ఇవ్వచ్చు . ఎప్పటికప్పుడు తాజాగా తరిగిన పండ్ల ముక్కలు సిద్ధం చేసుకొని వాటిని ఏదో రూపంలో అయినా పిల్లలు తినేలా చేయవచ్చు . వీలైతే పెరుగుతో,పాలతో ఇవ్వచ్చు. వెన్న లేకుండా పాప్ కార్న్ తయారు చేయవచ్చు. మొక్క జొన్న విత్తులు కుక్కర్ […]

మారండి బాబు

కొత్తగా కొన్న వాహనాలకు నిమ్మకాయలు ,మిరపకాయలు కట్టడం ,ఇంటికి దిష్టి తగులుతోందని గుమ్మడికాయలు ,రాక్షసుల బొమ్మలు తగిలించడటం చూస్తూవుంటాం.  మూఢ నమ్మకాలే ఇవి. లాజిక్ కు అందని విషయాలు. ఇలాంటి నమ్మకాలు మనుష్యులను ప్రమాదంలోకి నెడతాయి. ఒక ఇంటర్యూకి, పరీక్షకు ఫలాన రంగు పెన్ తీసుకుపోవాలనొ, అచ్చోచ్చిన పెన్ అని తీసుకుపోతారు. ఒకవేళ ప్రమాదవశాత్తు అది పోతే మానసిక ధైర్యం పోయి వెళ్ళిన పని విజయవంతంగా నెరవేర్చలేకపోతారు. ఎవరైన ఎదురొస్తే, ఫలాన రంగు దుస్తులు వేసుకొంటే , […]

ఏదైనా మితంగా

పంచాదార ,తీపి పదార్థాలు తినడం మానేస్తే డయాబెటిస్ అదుపులో ఉంటుంది అనుకొంటారు కానీ అదోక్కటే సరికాదు కేవలం చక్కెర మాత్రమే కారణం కానేకాదు. బ్లడ్ షుగర్ స్థాయిల్ని క్రమంలో ఉంచటంలో శరీరంలో ఉత్పత్తి చేయగల ఇన్సులిన్ పని చేస్తుంది. శరీరంలో ఇన్సులిన్ తగ్గడం లేదా పూర్తిగా లేకుండా పోవటం వ్యాధికి కారణం. అలాగే జీవన శైలి కూడా కారణం . కాకపోతే తియ్యని పదార్ధాలు అతిగా తీసుకోవటం ,కొవ్వు పేరుకొని స్థూలకాయం రావడం వంటివి ఆరోగ్యాన్ని పాడు […]

శ్రద్ధ పెట్టాలి

ఎండలొస్తున్నాయి అంటే చమటలు పట్టిస్తాయి. కాసేపు బయటి వాతావరణంలో గడిపినా స్వేదం ,చర్మంపై మురికి కలిసి దుర్వాసన వస్తాయి. స్థనాలు, చేతుల కింద, వ్యక్తిగత ప్రదేశాలు ఎక్కువ చమటలు పట్టే ప్రాంతాలు. స్వేద గ్రంథులు ఇక్కడ బాగా పనిచేస్తాయి. ఈ స్వేదంలో బ్యాక్టిరియా కలిసి వాసన వస్తుంది. ప్రతి రోజు రెండు పూటల స్నానం తప్పని సరి . యాంటి బాక్టీరియా సబ్బులు ఉపయోగించి తీరాలి. చేతుల క్రింద డియోడ్రెంట్ లు యాంటి పరిసిస్టెంట్  వాడితే వాసన రాకుండా […]

ఎంతో ముచ్చట

ఎంతో ఆధునికంగా కనిపిస్తున్నా ప్రత్యేక సందర్భాల్లో అమ్మాయిలు పాత కాలపు నగలు ,పట్టు లంగాలే కోరుకొంటారు. రాత్రి వేళ జరిగే ఫంక్షన్స్ లో కళ్ళకు ఆకట్టుకునేది రాళ్ళతో కూడిన సంప్రదాయ నగలే . ముఖ్యంగా అమ్మాయిలకు బుట్ట చేతులతో జాకెట్లు, పరికిణీలకు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేది వంకీలు . కుడిమోచేతికిపైగా ఈ రాళ్ళ వంకీలు ప్రత్యేకంగా అందంగా ఉంటాయి. ఈ వంకీల్లో వజ్రాలు మెరిసే రాళ్ళు ఉంటే ఇంకా ఆ రాత్రి వేళ మరింత ఆకర్షణీయంగా […]

నెమ్మదిగా తినండి

నెమ్మదిగా హాడావుడి లేకుండ తినండి అనే చెపుతారు పెద్ద వాళ్ళు . కానీ హడావుడి పరుగుల జీవితంలో నెమ్మది అన్న పదం అదృశ్యమైపోతుంది. తాగుతూ వంటచేయడం,తింటూ ఫోన్ మాట్లాడటం, ఆఫీస్ వర్క్ చేస్తూ స్నాక్స్ తినడం ఇప్పటి అలవాట్లు. 66వేల మందిపై అధ్యయనం చేసి ఒక రిపోర్టు ఇచ్చారు పరిశోధకులు. ఆధ్యయనం ప్రారంభానికి ముందర ‘బిఎంఐ’ని పరిగణనలోకి తీసుకున్నారు.  40శాతం మంది గబగబా ఆహారం తినేవాళ్ళు అధ్యయనం ముగిసేసరికి వీళ్ళ ‘బిఎంఐ’రిపోర్టు ఎక్కువైందట.  అధిక బరువు సమస్య […]

పట్టు కట్టు కోరా పట్టు

పట్టుచీరె ఎప్పుడు సెలబ్రేషన్ . అందులో పట్టులోనే ఎన్నో వెరైటీలు , సింపుల్ డిజైన్లతో బరువు లేకుండా సహాజమైన వర్ణాలతో కనువిందు చేస్తున్నాయి. ఏ ఫంక్షన్ లకైనా అనువుగా అమరేవి ఇటు బెనారస్ కోరా సిల్క్ లు, అటు కంచి ఆరణి పట్టు చీరెలు. ముచ్చటైన మంచి రంగుల కలపోతలతో ,చీరె నిండుగా డిజైన్ తో ఆరణి పట్టు ధగధగలాడే పూల డిజైన్ లతో పసిడి తీగల అల్లీకలు ,బెనరస్ కోరా సిల్క్ అందమే అందం. వీటినీ […]

మరింత అందం

నెక్లెస్ , చెవి దిద్దులు ముఖాకృతికి నప్పేలా ఉండాలి.  ఆప్పుడు మొహం ఓవెల్ షేప్ లో ఉంటే అన్నీరకాల స్టయిల్ నెక్లెస్ లు బావుంటాయి. ఇయర్ రింగ్స్ , హూప్స్ షాండ్లియర్స్ బావుంటాయి. హార్ట్ షేప్ ముఖాకృతి గనక అయితే షార్ట్ నెక్లెస్ లు కర్వ్ లతో ఉన్నవి బావుంటాయి. కాలర్, ఇయర్ రింగ్స్, హూప్స్ టియర్ డ్రాప్స్ ,  ట్రయాంగిల్స్ చక్కగా నప్పుతాయి. ఇక డైమాండ్ షేప్ ముఖాకృతికి నెక్ లైన్ జ్యూయలరీ స్టైల్ నప్పుతుంది. […]

కార్టూన్స్ చూడనివ్వండి

పిల్లల తెలివి తేటలు పెంచే కార్యక్రమాలు ఎంపిక చేస్తే వాళ్ళు కార్టూన్ ఛానెల్స్ చూడటం వల్ల పెద్ద నష్టం లేదంటున్నారు . కార్టూన్లు చూపిస్తూ వాళ్ళకు నెమ్మదిగా కామిక్ పుస్తకాలు అలవాటు చేయవచ్చు . చూసే కార్టూన్ లు పిల్లల్లో చదివే అలవాటును కళాత్మకంగా ఆలోచన శక్తిని పెంచుతాయి. వాళ్ళలో భాషానైపుణ్యాలు మెరుగు పడతాయి. పదాలు ఎలా పలకాలో సులభంగా నేర్చుకొగలుగుతారు. మంచి ఇంగ్లీష్ నేర్చుకొగలుగుతారు. అయితే దేనికైన మితం ఉంటుంది. వాళ్ళకు ఎంత వరకు ఉపయోగమో […]

ఒత్తిడికి వైద్యం

ఒక లక్ష్యం నిర్ణయించుకుని దాని కోసం పరుగు తీయడం అవసరమే కానీ దాని వల్ల కలిగే ఒత్తిడి మాటేమిటి ?  ఇందుకు గానూ ఒత్తిడిని తగ్గించే ఆహారం గురించి ఆలోచించమంటున్నారు ఎక్స్ పర్ట్స్.  అమ్మాయిల్లో సాధారణంగా కనిపించే పోషకాహార లోపంలో కాల్షియం ముఖ్యం . అందుకే పాలు తప్పని సరిగా తాగాలి.  పాలల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ,విటమిన్లు ,బయోయాక్సిన్ ప్రోటీన్లు ఒత్తిడిని నిరోధించటంలో కీలకంగా పని చేస్తాయి.  అలాగే భాధంలో ఉండే పోషకాలు కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి. […]

ఇవి మంచి కానుకలు

ఎన్నో పార్టీలకు , పుట్టిన రోజు ఫంక్షన్స్ కు హాజరవుతాము. ఒక్కొసారి వాళ్ళకు ఇచ్చేందుకు మంచి కానుక ఏదో ఎంత ఆలోచించిన తట్టదు. సందర్భం ఏదైనా సరే చక్కని మొక్కని బహుకరించటం మంచి పద్ధతి. కాస్త చోటు ఉన్న అమర్చు కోగలిగే, స్టెప్స్ ఉన్న పూల కుండీల్లో మనీ ప్లాంట్స్,జేడ్ , మాండ్ విల్లా మొదలైన మొక్కలు పెట్టి ఇవ్వొచ్చు. టీనేజ్ అబ్బాయి, అమ్మాయిలు ఎవరైనా సరే వ్యాయామ పరికరాలు ఇస్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. చిన్న […]

ఓవర్ ఎక్స్ పోజింగ్ వద్దు

మొదటి సినిమా ‘అబ్బాయితో అమ్మాయి’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయింది పాలక్ లల్వాని.  మరెన్నో హిందీ సీరియల్స్ కు పని చేశారు. ఈ రంగం గురించి ఆయనకు బాగా తెలుసు.  సినిమాలకు కొత్త కనుక ఎలాంటి కథలు సూటవుతాయో ఆయన సలహా తీసుకుంటున్నా. సైకాలజీ అండ్ ఫిలాసఫీలో గ్రాడ్యూయేషన్ పూర్తైంది.  సినిమాల్లోకి చాలా ఇష్టంతో వచ్చాను .కాస్ట్యూమ్స్ విషయంలో చాలా పర్టిక్యూలర్ గా అడిగి తెలుసుకొంటున్నాను.  అలా అయితేనే సినిమాలో నన్ను ఎలా చూపించబోతున్నారో నాకు అర్థం […]

నేను లక్కీ

పదిహేనేళ్ళ సినీ కెరీర్ లో ఎన్నో అప్ ఎండ్ డౌన్స్ రుచి చూసింది శ్రియ శరణ్. వరుస బెట్టి సినిమాలు చేస్తున్న నాకెప్పుడు బోర్ అనిపించలేదు. కానీ నన్ను ఇంకా నటిస్తారా అంటే మాత్రం విసుగ్గా ఉంటుంది అంటుంది శ్రియ. హాలీవుడ్ లో 60 ఏళ్ళు వచ్చే వరకు నటిస్తారు , ఇక్కడేమో 30 ఏళ్ళు వచ్చేస్తే రిటైరైపోమంటారు. కానీ నా విషయంలో నేను ప్లాప్ హీరోయిన్ ముద్ర ఎప్పుడూ వేయించుకోలేదు. అందుకే ఇన్నేళ్ళు నా కెరీర్ […]

ఒకే ఒక్క షాట్ తో

త్రిస్సూర్ లో విమలా కాలేజీలో బికాం మొదటి సంవత్సరం చదువుతోంది ప్రియ ప్రకాష్ వారియర్‌. ‘ఒరు ఆదార్‌ లవ్‌’ లో ఒకే ఒక్క షాట్ తో సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకొంది ప్రియ ప్రకాష్ . ఇంత పేరు వస్తుందని ఊహించలేదు . నా ఎక్సయిట్ మెంట్ మాటల్లో ఎలా వివరించాలో తెలియడంలేదు.  మా కాలేజీలో నేనో చిన్న పాటి సెలబ్రెటీ అయిపోయాను. ఇప్పుడు కాలేజీలో అంతా నన్ను గుర్తుపడుతున్నారు. ఒక వైపు భయం, ఒక […]

వజ్రాలు,ముత్యాల కేక్

లండన్ కు చెందిన డెబ్బీ వింగ్ హామ్ ఎంతో మంది ప్రముఖులకు డిజైనర్ గా పని చేస్తొంది. దుబాయ్ లో జరిగిన ఒక వెడ్డింగ్ షో కోసం ఆమె నిలువెత్తు పెళ్ళి కూతురి కేక్ తయారు చేయించింది. ఇందులో ఐదు వజ్రాలు ,వెయ్యి వరకు ముత్యాలు పొదిగాయి. ఈ కేక్ తయారు చేసేందుకు పది రోజులు పట్టింది. ఈ లైఫ్ సైజ్ పెళ్ళి కూతురినీ తయారు చేయించేందుకు 7లక్షల యూరోలు ఖర్చు పెట్టారు .పార్టీలకు తగ్గట్లు థీమ్స్,ఫ్లేవర్స్,రకరకాల […]

కరక్ట్ ఫిట్ ఎంచుకోవాలి

ఆడ పిల్లలు ఎదిగే కొద్దీ శరీరాకృతిలో తేడాలొస్తాయి. శరీరం పై భాగానికి లోదుస్తుల అవసరం వస్తుంది. తొలి బ్రాను ఎంచుకొనేప్పుడు ఫిట్ స్టైయిల్ ఎలా ఉండాలి అనే విషయంలో సందేహాలు వస్తాయి. బ్రాస్ట్రాప్ భుజాలపై ఓరుసుకు పోతున్నట్లు అనిపిస్తే కాస్ సైజ్ చిన్నగా ఉందని అర్థం చేసుకోవాలి. అండర్ వేర్ బ్రా బిగుతూగా ఉన్న పెద్దకప్ సైజ్ ఎంపిక చేసుకోవాలి. సరైనా సైజ్ చూసి తీసుకోవాలి వెనుక వైపు కండరాలు ఉబ్బి కనబడుతు ఉంటే బ్రా బ్యాండ్ […]

వీటికే ఆదరణ

సర్వీస్ పార్ట్ మెంట్స్ కు ఆదరణ పెరుగుతుంది. దేశ విదేశీ ఆహార పదార్ధాలు వండే చెఫ్ లు సర్వెంట్లు, లాండ్రీ సౌకర్యం, స్విమ్మింగ్ ఫూల్ సహా సకల సదుపాయాలు ఉండే ఫర్నీస్డ్ అపార్టుమెంట్లు సెలబ్రిటీల దగ్గర నుంచి అందరిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఇల్లు కాని ఇళ్లలో నెలలకొద్ది నివసించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్ లో ఈ బిజినెస్ ఊపందుకుంది. టాప్ స్టార్స్ కుడా ఈ ఆపార్ట్ మెంట్లలో కంఫర్ట్ ,భద్రతా రక్షణ ఉంటుందనే ఉద్దేశ్యంతో నెల్లల తరబడి […]

ప్రాణ నాకు స్పెషల్

నా రాబోయే సినిమా ప్రాణ ఒక వినూత్నప్రయత్నం. ఒకే సారి నాలుగు భాషాల్లో తీశారు. డబ్బంగ్ లేకుండా డైలాగ్, చుట్టు పక్కల యాంబియన్స్ కుడా అన్నీ నేను నటిస్తోన్నప్పుడే షూట్ చేశారు. సరౌండ్ సింక్ పద్దతి. ఒక్క షాట్ ఒక్క భాషాలో నాలుగు సార్లు ఏనాడు లేకుండా షూట్ చేశారు. చాలా కష్టపడ్డాను అంటోంది నిత్యామీనన్ . నేనెప్పుడు నాకు పాత్ర నచ్చితేనే సినిమా చేస్తా. నా కెరీర్ మొదటి నుంచి ఇంత పేరున్న దర్శకులు ,పెద్ద […]

ప్లేట్లు మార్చేయండి

ఇంట్లో భోజనం చేసే ప్లేట్లు ,పెద్ద కప్పులు వెంటనే మార్చేయండి, ఇవి ఊబకాయానికి దారి తీసేవి అంటున్నారు పరిశోధకులు. పెద్ద పళ్ళాల్లో తినడం వల్ల ఎంత తింటున్నామో ఆర్ధం కాదనీ అలాగే పెద్ద కప్పుల్లో టీ, ఇతర చక్కెర పానీయాలు తాగడం వలన అదనంగా క్యాలరీలు శరీరంలో వచ్చి చేరుతాయని ఇవే ఊబకాయం రావటానికి దోహాదం చేస్తోందనీ అధ్యయనాలు తేల్చాయి. ఈ పదార్థాలు ఎక్కువ మొత్తంలో తింటూ ఎంత వ్యాయామం చేసిన పెద్దగా ఫలితం లేదని స్పష్టం […]

మిస్ బిహేవ్ చేశారు

ఫిదాలో నటించిన గాయత్రీ గుప్తా తనను సినీపరిశ్రమలో కొందరు వేధిస్తున్నారని గొంతు విప్పింది. నేను షార్ట్ ఫిలిమ్స్, ఫీచర్ ఫిల్మ్ లో నటించాను, పాటలు పాడతాను, కథలు రాస్తాను. ఒక చిత్రంలో ఒప్పుకున్న సమయం నన్నేంతో ఇబ్బంది పెట్టింది. పరిశ్రమలో అన్నీ జరిగిపోతాయి .బయటికి పొక్కవు.  పోలీసు స్టేషన్ కు వెళ్ళాలంటే ఆధారాలు కావాలి ఇలాంటివి వింటే సినీ పరిశ్రమలో అమ్మాయిలు రావటానికి భయపడతారు.  నన్ను చాలా మంది వలలో వేసుకొనే ప్రయత్నం చేశారు. తిండి కంటే […]