Monday, 30 Nov, 2026

మెరిసే పెదవులు

లిప్ స్టిక్ రంగులు , కాంబినేషన్లు అమ్మాయిలకు కొత్తకాదు. ఏ లిప్ స్టిక్ అయినా లిప్ గ్లాస్ కాస్త బయట తిరిగే సరికి ఎండిపోయి పెదవులు డల్ గా అవుతాయి. సెమీ లిక్వీడ్ లిప్ స్టిక్ వేసుకొన్న కాసేపటికీ అది అలాగే పెదవులపైన ఆరిపోయి ఆ మెరుపు కాస్త పోతుంది. అయితే ఇలా ఎండిపోయి ఆరిపోయి పెదవులు పొడిబారి పోకుండా మాయిశ్చరైజింగ్ షేర్ లిప్ గ్లాస్ మార్కెట్లోకి వచ్చింది. ఇవి వేసుకోవటం కూడా సులభమే. పెదవులు మెరిసిపోతూ […]

ఇవ్వాల్టి ఫ్యాషన్

ఏదో ఒక కొత్తదనం కావాలి . నిన్న భలే అనిపించింది రేపటికి ఓల్డ్ ప్యాషన్ అయిపోతుంది. ఫ్యాషన్ డిజైనర్స్ అలిసి పోకుండా కొత్త డిజైన్స్ సృష్టిస్తూనే ఉంటారు. అందమైన ఫ్యాన్సీ పట్టు .జరీ చీరెల మ్యాచింగ్ గా కోల్డ్ షోల్డర్ డిజైనర్ బ్లవుజ్ లు ఫ్యాషన్ గా మార్కెట్లోకి వచ్చాయి. హై నెక్కులు , ఫోల్డర్ హ్యాండ్స్ , కాలర్ నెక్ తో కాలం చెల్లిపోయి ఈ కోల్డ్ షోల్డర్ ఫ్యాషన్ వచ్చింది. వందలాది డిజైన్స్ ఇమేజెస్ […]

ఫ్యాషన్ నెంబర్ వన్

ఇది త్రీడి యుగం . సినిమాలు, పెయింటింగ్స్,టాటూలు. ఇంట్లో టైల్స్ ,వాల్ డెకరేషన్స్ అన్నీ త్రీడి మయం. ఇప్పుడు ఈ త్రీడి వర్క్ ఎంబ్రాయిడరీ పైకి ఎగిరోచ్చింది. ఆ ప్లిక్ వర్క్ చేసిన త్రీడి ఎంబ్రాయిడరీ ఇటు ఫ్యాషన్ డ్రెస్ లు, చీరెలు ,లంగాలు,గౌన్లు, టేబుల్ క్లాత్ లు, దుప్పట్లు అన్నింటిలోనూ ప్రత్యేకత చూపెడుతుంది. అందమైన పూవులు కుట్టిన లేస్ త్రీడి ఎంబ్రామిడరీ అయితే అమ్మాయిలు మనసు పారేసుకుంటున్నారు. పూసలు,రంగురాళ్ళు తో కుట్టిన ఈత్రీడి ఎంబ్రాయిడరీ ఇమేజస్ […]

చర్మానికి పోషకాలు

కేవలం ఖరీదైన క్రీములు, సౌందర్య చికిత్సల వల్లనే చర్మం తాజాగా మెరుస్తుందనుకుంటే పొరపాటే. పోషకాలతో కూడిన మంచి ఆహారం చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. బాధం పప్పులో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ అతినీల లోహిత కిరణాల నుంచి చర్మకణాలకు రక్షణ ఇస్తాయి. ప్రతి రోజు గుప్పెడు పప్పులు తినాలి. అలాగే కేరట్ లోని పోషకాలు చర్మపు పై పొరలో అవసరానికి మించి కణాలు పెరగకుండా నియంత్రిస్తాయి. గ్రీన్ టీ ఆకులు మరిగే సమయంలో విడుదలయ్యే యాంటీ ఆక్సిడెంట్స్ […]

మంచి స్క్రబ్బర్‌ ఇది

ముఖంపైన జిడ్డు పోయేందుకు స్క్రబ్బింగ్ చేస్తారు. కానీ ఈ కాలంలో బయట దొరికే స్క్రబ్బర్స్ వద్దు . చెమటతో తడిసి మాటిమాటికీ తుడిచి పొడిగా అయిన చర్మం కోసం ఇంట్లోనే మంచి స్క్రబ్బర్‌ తయారు చేయవచ్చు. అరటి పండు గుజ్జు ,ఓట్స్ తేనె కలిపి మొహానికి రాసుకుంటే ఎండవేడికి కమిలిన ముఖం కాస్తా తేటగా అయిపోతుంది. పాలు,తేనె కొబ్బరి నూనె వంటి తేలికైన సహాజమైన మాయిశ్చరైజర్లు ,రసాయనాలతో కూడిన మాయిశ్చరైజర్ ల కంటే ఇవి 90 శాతం […]

ప్రోటీన్లు పుష్కలం

మాంసాహారం లోనే ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయనుకొంటారు. కానీ శాఖహారంలోనూ ,మాంసంతో సమానంగా ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఏ శాఖహారంలో ఏ ఏ ప్రోటీన్లు ఎంత నిష్పత్తిలో ఉంటాయో చార్టు వేసుకుంటే ప్రతి రోజు ప్రోటీన్ల కొరత రాకుండా ఏం తినాలో తెలుస్తుంది. న్యూ ట్రీషనిస్టుల కొలతల ప్రకారం నట్, బటర్స్ లో 8 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. ఓట్ మీల్ ఒక కప్పులో ఆరు గ్రాములు, బ్రోకాలీ ఒక సర్పింగ్ లో ఐదు గ్రాములు, కాలీఫ్లవర్ ఒక […]

మంచి సినిమా The shape of water

స్టార్ డైరెక్టర్ గులెర్మో డెల్ టోరో ఎంతో ఇష్టంగా తీసిన ‘ది షేప్ ఆఫ్ వాటర్’ ఈ ఏడాది ఆస్కార్ లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి వంటి 13 విభాగాల్లో నామినేషన్లు దక్కించుకుంది. మూగ పిల్ల ఎలీసా జసైన్స్ పరిశోధన కేంద్రంలో క్లీనింగ్ గర్ల్ గా పని చేస్తూ నదిలో దొరికిన ఒక వింతజీవిని చూస్తూంది. నీళ్ళల్లోనూ,నేలపైన జీవించగలిగే ఈ వింతజీవికి ఈ కేంద్రలో బంధించారు శాస్త్రజ్ఞులు. ఎలీసాకు ఈ వింతజీవికి స్నేహం […]

ఆయువు పెంచే వెల్లుల్లి

వెల్లుల్లి పాయను 60-70 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య 60 నుంచి 90 రోజుల వరకు ఉంచి దానితో నల్ల వెల్లుల్లి తయారు చేస్తారు కొరియన్ లు.  ఈ రసాయన చర్యతో వాటిల్లోని ఎంజైమ్స్ చర్య పొంది రంగుతో తియ్యదనానన్ని సంతరించుకొంటాయి. దాదాపు నాలుగు వేల సంవత్సరాలుగా దీన్ని అక్కడ వాడుతున్నారు.  థాయ్ లాండ్ లో వీటిని ఆయువు పెరిగేందుకు తింటారు.  అన్నీ వంటల్లోనూ అక్కడ ఈ నల్ల వెల్లుల్లి కనిపిస్తుంది.  దీనితో చాక్లెట్స్ కూడా తయారు చేస్తారు.  […]

ఎన్నో ప్రయోజనాలు

జొన్నలు ప్రోటీన్లకు నిలయం . కండరాల పెరుగుదలకు ప్రోటీన్లు ఎంతో ఉపయోగం.  వీటీలో శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ .  అనేక వ్యాధుల నుంచి కాపాడుతాయి.   రోగనిరోధక శక్తి ఎక్కువే.   జొన్నల్లో ఉండే కాల్షియమ్ పాళ్ళు ఎక్కువ   అవి కాల్షియంను  ఎక్కువగా శరీరం గ్రహించేల చేసి ఎముకల ధృఢత్వాన్ని పెంచుతాయి.   పిండి పదార్థాలతో పాటు పీచు కూడా ఎక్కువే.   డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తాయి.  స్థూలకాయంతో పాటు గుండె జబ్బులు, పక్షవాతం వంటి ప్రమాదకరమైన […]

కాటన్ లే ఎంచుకోండి

ఎన్నో కొత్త ఫ్యాషన్స్ వస్తున్నా అమ్మాయిల ఇష్టం లెహంగాలు, క్రాప్ టాప్ ల మీది నుంచి మరలి పోలేదు. అయితే లెహంగ  విషయంలో కొన్ని జాగ్రత్తలు కావాలి.   కొనుగోలు చేసే ముందర సులభంగా నడిచేందుకు ,కూర్చునేందుకు వీలుగా ఉందా,లేదా చూసుకోవాలి. ప్రస్తుత వాతావరణానికి కాటన్లు, ఇతర వస్త్రశ్రేణి అయితే బాగుంటాయి. లెహాంగ సరిగా ఎత్తుకు సరిపోయేల వుందా? ఎత్తు చెప్పులు వేసుకొన్న సౌకర్యంగా వుందా? చూసుకోవాలి. డిజైనర్ లెహంగా  కొనేటప్పుడు అది బరువు వుందా? శరీరానికి సౌకర్యంగా ఉందా చూసుకోవాలి. […]

పెరుగు, తేనె మాస్క్

ఎండ వేడికి చర్మం కమిలినట్లు అయిపోతుంది.  దాన్ని తిరిగి ఆరోగ్యంగా ,పూర్వపు స్థితికి తెచ్చెందుకు పెరుగు,పాలు,ఆలీవ్ నూనె, తేనె వంటివి చక్కుగా ఉయోగపడతాయి.  పెరుగు,తేనె కలిసి ముఖానికి మాస్క్ లో వేసుకొని , ఆరిన తర్వాత  వేడి నీళ్ళతో కడిగేస్తే బాగుంటుంది.   అదే మిశ్రమంతో ముఖానికి మర్ధన చేస్తే చర్మం తేమగా , మృదువుగా ఉంటుంది.   రాత్రి వేళ ఆలివ్ నూనెతో చర్మానికి మర్ధన చేస్తే ప్రయోజనం ఉంటుంది.    తేనె సహాజమైన మాయిశ్చరైజర్. స్నానానికి ముందు […]

అది సహజమే

కాన్పు తర్వాత ఆడవాళ్లకి కొన్ని  నెలల పాటు జుట్టు ఊడిపోతూ ఉంటుంది.    దీనికి కారణం గర్భధారణ సమయంలో శరీరంలో పెరిగిన ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్  వంటి హార్మోన్ల స్థాయిలతో పాటు రక్తం పరిమాణం తగ్గిపోతుంది .   గర్భిణిగా ఉన్న సమాయంలో హార్మోన్ల ప్రభావం వల్ల వెంట్రుకలు చాలా కాలం ఎదిగే దశలో కొనసాగుతాయి.    పైగా రక్తప్రసరణ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టుకు పోషకాలు దండిగా లభిస్తాయి.    కాన్పు తర్వాత హార్మోన్ల స్థాయి తగ్గి వెంట్రుకులు ఊడిన పెద్దగా […]

మాయ చేస్తాయి

త్రీడీ వాల్ పేపర్లు వచ్చినట్లే త్రీడీ టాటూ స్టిక్కర్లు వచ్చాయి.   ఈ ఎఫెక్ట్ తో ఇవి శరీరంపైన ఉన్నట్లే ఉంటాయి.   అచ్చం పువ్వు,పండు, సీతాకోకచిలుక వచ్చి వాలినట్లూ, అంతెనా సాలీడు కూడ భుజంపైన ఉన్నట్లే ఉంటుంది.   గాయాల స్టిక్కర్లు కూడా ఉన్నాయి.   ఈ టాటూ అంటించుకుంటే భయంకరమైన గాయం ,లేదా డ్రాక్యులా వంటి మొహంతో చూపరులను భయ భ్రాంతులను చేయవచ్చు.  ఒక వేళ వెంటనే పోగొట్టలన్న కోల్డ్ క్రీమ్ తో   రుద్దేస్తే పోతాయి.

పెర్ల్ ఎస్.బక్

పెర్ల్ సెడెన్‌స్ట్రికర్ బక్ నోబెల్ బహుమతి పొందిన తొలి అమెరికన్ రచయిత్రి.   1931 లో వెలుగుచూసిన   ‘గుడ్ ఎర్త్’ తో ఆమె అమెరికన్ సాహిత్యంలో అగ్ర శ్రేణి రచయిత్రిగా స్థానం సంపాదించుకుంది.   ఈ నవలను ఎం.జి.ఎం స్టూడియో వాళ్ళు సినిమా తీశారు.   ఈమె రచనలనన్నింటిలో ఎక్కువగా చైనీస్ జీవితము ముఖ్యంగా గ్రామీణ జీవితాన్నే ప్రతిబింబిస్తుంది. పెర్ల్ తన తల్లి దండ్రుల గురించి రాసిన   ‘ది ఎక్స్పైల్’ , ‘ది పైటింగ్ ఏంజిల్’ చైనా గ్రామీణ జీవితాన్నీ దర్శింపజేస్తాయి. […]

అందమైన బాస్

అందమైన డ్రెస్ స్టయిల్ తో బాస్ పాత్రలో ప్రేక్షకుల మందుకు రాబోతుంది లక్ష్మీమంచు.  బాలీవుడ్‌లో సూపర్ హిట్ సాధించిన  ‘తుమ్హారీ సులు’ తమిళంలో రీమేక్ అవుతోంది.  విద్యాబాలన్ బాస్ గా, నేహాధూపియా పోషించిన పాత్రను తమిళ రీమేక్ లో మంచు లక్ష్మీ పోషిస్తుంది.   తన క్యారెక్టర్‌ గురించి చెపుతూ ఇటీవల నేను నటించిన అన్నీ డీ గ్లామర్ రోల్సే .   రేడియో ఛానల్ హెడ్ రోల్ లో చాలా గ్లామర్ గా కనిసిస్తాను.   ఈ స్టైలిష్‌ బాస్ […]

మంచి సినిమా

‘యువర్ నేం ఈజ్ జస్టిన్’. జర్మన్ ఇంగ్లీష్ భాషల్లో నిర్మించిన ఈ సినిమా డైరెక్టర్ ఫ్రాంకోకి డాపెన్ .   లైంగిక బానిసత్వం ఇతివృత్తంగా ఇంత గొప్ప సినిమా తీసినందుకు యావత్తు స్త్రీ జాతి ఈ డైరెక్టర్ కు రుణపడి ఉండాలి.  “మారియోలా” పోలాండ్ లోని లక్సెంబర్గ్ అమ్మమ్మతో పాటు నివసించే యువతి. జీవితం పట్ల ఆమెకున్న ఆశలు అంతులేనివి.   ఆమె ప్రేమించిన “ఆర్ధర్” ఆమెను మోసగించి పాస్ పోర్ట్ తీసుకోని అమ్మెస్తాడు.  ఎంతో మంచి ఆమెను దారుణంగా […]

వ్యర్థాలతో నగలు

‘సిల్వర్‌ నట్‌ ట్రీ’ ఇమేజెస్ చూస్తుంటే అవన్నీ ప్లాస్టిక్ బాటిళ్ళు , మూతలు, పాత వస్తువులు, వ్యర్థాల నుంచి తయారు చేసిన వస్తువులా అనిపించవు.   బెంగళూరుకు చెందిన రితూ పర్ణా దాస్‌, ఏంజెలీనా బాబు అనే ఇద్దరు మహిళా వ్యాపారవేత్తలు పనికిరాని వస్తువులతో నగలు, గృహలంకరణ వస్తువులు తయారు చేస్తున్నారు.    గాజుబాటిళ్లు, రేకుమూతలు, టైర్లు, ట్యూబ్‌లు, వాషర్లు, బోల్టులు, ప్లాస్టిక్‌ సీడీలు లాంటి రకరకాల పాత వస్తువులతో నెక్లెస్, లాకెట్‌లు, చెవిరింగులు, మురుగులు, ఉంగరాల లాంటి […]

వేసవి ఫ్యాషన్స్

ఎంత ఎండలు విసిగించినా కొత్త కొత్త వెరైటీ టాప్ లతో వేసవిలో ష్యాషన్ సరదాలు తీర్చుకోవచ్చు. ఫ్యాషన్ పోకడలో భాగంగా అందమైన స్కర్ట్ లు ఈ సీజన్ కు చాలసేఫ్. ఇవి సూర్యకిరణాల నుంచి రక్షిస్తాయి. స్టైయిల్ గా కనిపిస్థాయి కుడా . అలగే చక్కని శాంపిల్స్ తో ప్రయోగాలు చేయవచ్చు. స్టయిల్ గా ఉండే ఫ్లిప్ ఫ్లాప్స్, రంగుల కాన్వాస్ షూస్, బ్రైట్ స్లిప్ ఆన్స్ ఏవైనా ఎంచుకోవచ్చు. అందమైన సన్ గ్లాసులు చక్కని యాక్ససరీ. […]

అన్నింటా పర్ ఫెక్ట్

డైట్ ,లైఫ్ స్టైయిల్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో కీలకపాత్ర వహిస్తాయి. దాదాపు 80 శాతం బరువు ఈ రెండిటి పైనే ఆధారపడు ఉంటుంది. బాగా వ్యాయామం చేస్తున్నాఅహారం, జీవన విధానం సరిగా లేకపోతే సరైన ఫలితాలు రావు. వేళ ప్రకారం భోజనం చేయాలి. లంచ్ మానేసి చిరు తిండ్లు ఏమిటీ? అలగా డిన్నర్ ఆలస్యంగా ఎక్కువ కార్భోహైడ్రేట్స్ తో ఉన్నా కుడా వెయిట్ లాస్ ప్రోగ్రాం దేబ్బ తినేస్తుంది. అలగా పోషకాహారాన్నితప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా చాలినంత […]

ఫ్లెక్సిబిలిటి పెరుగుతుంది

నలభైలు ధాటిన జాయింట్ల మధ్య ఫ్లెక్సిబిలిటిని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. జాయింట్లు ముఖ్యంగా వెన్నుముక వెంట స్టిఫ్ నెస్ తగ్గి ఫ్లెక్సిబిలిటి తేడా వస్తుంది. అందువల్లనే బ్యాక్ పెయిన్ వస్తుంది. వాకింగ్ ,స్విమ్మింగ్ లేదా ఇతర ఏ క్రీడ అయినా పర్లేదు అయితే వార్మప్ లు , స్ట్రెలింగ్ చాలా ఉపయోగాలుంటాయి. యోగా ఫిట్ నెస్ ఫ్లెక్సిబిలిటి పెంచుకునే మంచి మార్గం. ప్రతి రోజు ముప్పై నిమిషాల వ్యాయామం వెన్నుముక బ్యాలెన్స్ మెరుగుపరుస్తుంది.