Thursday, 12 Nov, 2026

నొప్పి తగ్గించే సంగీతం

నొప్పి నివారణకు సంగీతం మంచి మందు అనే పరిశోధనలు తేల్చి చెప్తున్నాయి. పార్కిన్సన్స్ , పక్షవాతం గుండెపోటుకు సంగీతం తో చికిత్స అందిస్తున్నారు. కెనడాలోని మెక్ గిల్ యూనివర్సిటీ పరిశోధకులు శరీర తత్వాన్ని బట్టి మందులను కష్టమైజ్ చేసినట్లే సంగీతాన్ని కూడా చేయవచ్చు అని తేల్చారు గుండె కొట్టుకునే వేగం లో లయలో కొన్ని మైక్రో సెకన్ల తేడా ఉంటుందట. ఎవరికి వారికే ఉండే ప్రత్యేకమైన కు దగ్గరగా ఉండే టెంపో వేగం తో ఉండే సంగీతాన్ని […]

సమయం దాచుకోండి

ఓపిక ఉన్నప్పుడు కాస్త డబ్బులు సంపాదించుకొని దాచుకున్నట్లు ఓ నాలుగు గంటలు సమయాన్ని కూడా భవిష్యత్తు కోసం దాచుకోవచ్చు అంటుంది టైమ్ ని కూడా భవిష్యత్తు కోసం దాచుకోవచ్చు అంటుంది బ్యాంక్ ఆఫ్ ఇండియా (TBI) రకరకాల కారణాల వల్ల ఒంటరిగా ఉండే వృద్ధులు తమకు కాస్త పనులు చేసే వాళ్ళ కోసం చూస్తుంటారు. ఆస్పత్రికి తీసుకుపోయే వాళ్లు, ఇతర సాయం చేసేవాళ్లు చాలా అవసరం అలాంటి ఆప్తులను వెతికి తెస్తుంది రాజస్థాన్ లోని టి బి […]

అందాల బగ్రు ప్రింట్లు

కాటన్ దుస్తుల్లో బగ్రు ప్రింట్ కు ప్రపంచవ్యాప్త ఆదరణ ఉంది రాజస్థాన్ లోని బగ్రు ప్రాంతానికి చెందిన ఈ ప్రింట్లు బ్లకులతో డిజైన్లు చేసి ముద్రిస్తారు. ఈ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ కాటన్ వస్త్రాల పైనే ముద్రిస్తారు. మొక్కలు, మట్టి సేంద్రియ పదార్థాల నుంచి సేకరించిన రంగులతో భిన్నమైన ప్రింట్లు తో ఈ బగ్రు కుర్తీలు చాలా అందంగా ఉంటాయి. ఎక్కువగా ముదురు రంగులే ఉపయోగించే ఈ బగ్రు దుస్తులు టెరికోట ఆర్ట్ డైజెడ్ జ్యువెలరీ లతో […]

అపురూప విజయం

24 సంవత్సరాల ప్రియాంక ఇంగ్లే మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ గెలిచిన జట్టు సారధి గా దేశంలో గుర్తింపు పొందింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన ప్రియాంక ఐదో తరగతి లోనే ఖోఖో ఆడటం మొదలు పెట్టింది.ఖోఖో నే తన ప్రపంచంలో సాగిపోతున్న ప్రియాంక ఎన్నో అపురూప విజయాలు సాధించింది రెండేళ్ల కిందట మహారాష్ట్ర ప్రభుత్వం రాణి లక్ష్మీబాయి అవార్డుతో పాటు శివ చత్రపతి స్టేట్ స్పోర్ట్స్ అవార్డ్ ఇచ్చి సత్కరించింది. అంతకుముందు సచ్ జూనియర్ జాతీయ […]

స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్

దీర్ఘకాలం స్మార్ట్ ఫోన్ నాతోనే సమయం గడుపుతుండే వారిలో స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్ తలెత్తుతోంది. కళ్ళను దెబ్బతీసే ఈ సమస్య అరికట్టాలి అంటే ఎక్కువ సమయం ఫోన్ చూడటం తగ్గించాలి స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల 60 శాతం మేరకు కళ్ళు ఆర్పటం తగ్గుతుంది. కనుకనే కళ్ళు మంటలు, పొడిబారే సమస్య వస్తుంది. కంటి దగ్గర గా ఫోన్ ఉంచడం వల్ల కంటి కండరాల పైన ఒత్తిడి పెరుగుతుంది కళ్లపైన ఒత్తిడి పెరిగి తలనొప్పి, అలసట, […]

కంప్లైంట్ ఇవ్వండి

మన దేశంలో 75 కోట్ల మందికి పైకాశామాజిక మధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నారని ఒక సర్వే. అయితే ఎక్కువగా ట్రోలింగ్ కు గురవుతుంది మాత్రం మహిళలే ఆడవారి శరీరాలపై జరిగే ట్రోలింగ్ తో వారు నిరాశ, ఆందోళన ఆత్మ న్యూనత తో కృంగిపోతున్నారట ఇలాంటి వ్యతిరేక ప్రచారాలు జరుగుతూ ఉంటే వెంటనే సైబర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వమంటున్నారు ఎక్సపర్ట్స్. ఆంధ్ర తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్ విభాగాలతో పాటు జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.in లో […]

లవ్ బ్రేస్ లెట్

లవ్ బ్రేస్ లెట్ ని కార్డియాక్ అనే ఆభరణాలు తయారీ ఈ గోల్డ్ ప్లేటెడ్ బ్రేస్ లెట్ సాలిడ్ సాలిడ్ గోల్డ్ 18 క్యారెట్ లలో ప్లాటినమ్ తో కూడా తయారు అవుతోంది.బ్రేస్ లెట్ చోటా వజ్రాన్ని పోలిన రోడియం ఫినిషింగ్ అసలైన జాతి వజ్రాలు ఇతర విలువైన రాళ్లు పొదుగుతారు. హాలీవుడ్ నటులు ఎలిజబెత్ టేలర్  రిచర్డ్ బర్టన్, స్టీవ్ మెక్విన్ లు ధరించడంతో ఇది కాస్త పాపులర్ అయ్యింది న్యూయార్క్ లో డిజైన్ చేసిన […]

ఐ వాంట్ టు టాక్

ఇన్ఫ్లుయెన్సర్ అర్జున్ సెన్ రచించిన నిజ జీవిత కథ ‘రైజింగ్ ఏ ఫాదర్’ ఆధారంగా తీసిన ఐ వాంట్ టు టాక్ అనే సినిమాను దర్శకుడు సర్కార్ తీశారు అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసిన ఈ సినిమా లో అభిషేక్ బచ్చన్ నటించాడు. క్యాన్సర్ వచ్చి 100 రోజుల్లో చనిపోతావని డాక్టర్లు చెప్పేశాక అర్జున్ సేన్ అంతులేని ఆత్మశక్తితో 20 ఆపరేషన్లు చేయించుకుని బతికి బయటపడటం సినిమా కధ ది గ్లామర్ పాత్రలో తన నటనతో […]

తొలి గౌరవం ఆమెకే

శాస్త్ర సాంకేతిక ఆదర్శప్రాయాలుగా  చెప్పుకునే మహిళల జాబితాకు అంతులేదు. అమెరికాలో వైద్య పట్టా సంపాదించిన మొదటి మహిళా ఎలిజబెత్ బ్లాక్‌వెల్ డాక్టర్ గా వైద్యరంగంలో ఎంతో కృషి చేశారు. ఒక ప్రమాదంలో ఆమె కంటి చూపు కోల్పోయి,సర్జన్  కావాలనే కల   వదులుకోవలసి వచ్చింది. కానీ ఆమె కాలంలో వైద్యం వైద్య కళాశాల ప్రారంభించి ఎంతో మంది బాలికలు వైద్యులుగా మారెందుకు సహాయం చేసింది.

యంగ్ లుక్ చాలా ఆరోగ్యం    

మహిళలు తమ వయసు కంటే చిన్నవారిగా కనిపించేందుకు ప్రయత్నించడం, అలా కనిపించడం మంచిదే అంటున్నాయి అధ్యయనాలు. జర్నల్ ఆఫ్ జెరంటాలజీ అనే వైద్య జర్నల్ లో నమోదైన పరిశోధనలు ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి తన వయసు కంటే తక్కువ వయసు వారిలా కనిపించే వారు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారని వారిలో హై బీపీ,పక్షవాతం, గుండె జబ్బులు వంటి అనారోగ్యాలు రావడం చాలా తక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి.

మొదటి మహిళా వ్యోమగామి

అంతరిక్షం లోకి ప్రయాణం చేసిన తొలి అమెరికన్ మహిళగా చరిత్ర సృష్టించారు సాలీ రైడ్. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం లో సైన్స్ బోధించారు. ఎందరో బాలికలను సైన్స్ దిశగా ప్రోత్సాహించారామె. ఆమె బోధించిన ఉపగ్రహాల సిద్ధాంతాలను ఆ తర్వాత కాలంలో చేపట్టిన అంతరిక్ష పరిశోధనల్లో ఉపయోగించారు. సాలీ రైడ్ బాలికలకు అంతరిక్ష శాస్త్రాన్ని అధ్యయనం చేసేందుకు దోహదపడే కార్యక్రమాలు రూపొందించారు.

డ్రెస్ కోడ్ మారింది

బ్రిటిష్ నేవి తొలిసారిగా మహిళ ఆఫీసర్ లా డ్రెస్ కోడ్ ను అప్‌డేట్ చేసింది. అధికారిక కార్యక్రమాలలో, మహిళా ఆఫీసర్ లు చీరలు, సల్వార్, కమీజ్, లెహంగా వంటి డ్రెస్ లు వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. కాకపోతే ఈ డ్రెస్ ల పై వారు యూనిఫామ్ షర్ట్, బ్లాక్, బో ధరించాల్సి ఉంటుంది. బ్రిటిష్ పాకిస్తాన్ నేవీ ఆఫీసర్ దుర్దానా అన్సారీ ఫోటో జత చేస్తూ రాయల్ నేవీ ఒక ఫోటో విడుదల చేశారు. ఈ ఫోటోలో […]

పేద పిల్లలకు ఉపాధి శిక్షణ

ది ఇన్నోవేషన్ స్టోరీ టి ఐ ఎస్ నెలకొల్పి వెనుకబడిన వర్గాల పిల్లలకు సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ బోధిస్తున్నారు 53 ఏళ్ల మీనాల్ మజుందార్ బ్యాంక్ ఆఫీసర్ గా పనిచేస్తున్న మీనాల్ మజుందార్ పేదరికం లో ఉన్న పిల్లలకు సాంకేతిక విద్య బోధన అందించాలనే కోరికతో ఉద్యోగం మానేసి 2021 లో టి ఐ ఎస్ స్థాపించింది. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల పిల్లలకు ఏఐ రోబోటిక్స్ వెబ్ డెవలప్మెంట్ వంటివి ఉచితంగా నేర్పుతోంది. ఇప్పటివరకు పదివేల మంది […]

విమెన్ సేఫ్టీ రబ్బర్ బ్యాండ్

స్త్రీల రక్షణ భద్రత కోసం విమెన్ సేఫ్టీ హెయిర్ రబ్బర్ బ్యాండ్ తయారు చేసింది తెలంగాణ లోని కరీంనగర్ జిల్లా లో మానకొండూరు గ్రామానికి చెందిన ఎస్ పూజ. జడకు మామూలుగా పెట్టుకునే రబ్బర్ బ్యాండ్ లాగే ఉంటుంది ఇది ఒకసారి నొక్కితే పోలీస్ హార్న్ సౌండ్ వస్తుంది. ఇంకోసారి నొక్కితే ఆ రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్న మహిళ ఉన్న ప్రదేశానికి దగ్గర లో ఉన్న షీ టీం ఆఫీస్ కు మెసేజ్ వెళ్ళిపోతుంది. అలాగే అక్కడి […]

కమలమ్మకు వందనం

ప్లాస్టిక్ తో పర్యావరణానికి కలుగుతున్న హాని చూసి భరించలేక, ఆ ప్లాస్టిక్ ను ఏరుకొని వచ్చి శుభ్రం చేసి గృహాలంకరణ  వస్తువులు చేయడం ప్రారంభించింది కమలా మహారాణా.ఈమెది ఒడిశా లోని ఖైరాబాద్ ఈ పని కి రాణి ప్లాస్టిక్ తో అందమైన బుట్టలు, పెన్ స్టాండ్ లు మొబైల్ స్టాండ్ లు పూల కూజాలు తయారు చేసేది కమల. ఈమె స్థానిక మార్కెట్ లో వాటిని అమ్మి ఆదాయం పొందడం చూశాక చాలామంది ఆమె దగ్గర ఈ […]

కుముదిని కి పద్మ విభూషణ్

1987 లో పద్మశ్రీ 2010 లో పద్మభూషణ్ అందుకున్న కథక్ నాట్య కళాకారిణి కుముదిని, రజినీకాంత్ లఖియా కు ఈ ఏడాది పద్మ విభూషణ్ ప్రకటించింది కేంద్రం. 94 సంవత్సరాల కుముదిని 1930 లో ముంబై లో జన్మించారు ఆమె తల్లి లీల శాస్త్రీయ గాయని. సమకాలీన కథక్ నృత్యానికి మార్గదర్శిగా ఖ్యాతి చెందిన కుముదిని తాను చేసిన నృత్య ప్రయోగా లలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. పురాణ కథలను విడిచిపెట్టి సాంఘిక సమస్యలు ఎంచుకున్నారు […]

రాధా బెహన్ కు పద్మశ్రీ

రాధా బెహన్ బట్ కు ఈ సంవత్సరం పద్మశ్రీ పురస్కారం లభించింది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అల్మోరా జిల్లాలో దురాక గ్రామంలో జన్మించిన రాధా బెహన్ లక్ష్మి అక్రమ్ లో టీచర్ గా పని చేశారు. సూర్యోదయ బోరాన్ ఉద్యమంలో 1957 నుంచి 1961 వరకు పాల్గొన్నారు. మారుమూల పర్వత ప్రాంతాల్లో బాల మందిర్ లు ఏర్పాటు చేసి పిల్లలకు విద్య నేర్పారు గుజరాత్ లోని సేవ్ గ్రామ్ లో నివసిస్తున్న రాధా బెహన్ తనకు పద్మశ్రీ రావటం […]

ఎనభై ఏళ్ల కృషికి గౌరవం

ఉత్తర కర్ణాటక లోని మోరనలా గ్రామంలో జన్మించిన భీమవ్వ దొడ్డబలప్ప సిలేక్యాతార తోలుబొమ్మలాట ప్రదర్శకురాలు కుటుంబ వారసత్వంగా నేర్చుకున్న ఈ తోలుబొమ్మలాట లో సామాజిక పర్యావరణ అంశాలతో మహాభారతాన్ని ప్రదర్శించగలరు. దేశ విదేశాల్లో ప్రదర్శనలు భీమవ్వ జానపదశ్రీ, సంగీత నాటక అకాడమీ కర్ణాటక రజోత్సవ అవార్డ్ లతో పాటు ఎన్నో పురస్కారాలు అందుకొన్నారు. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది 80 సంవత్సరాలుగా ఆమె ఈ కళారూపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.

సముచిత గౌరవం

కె. ఓమన కుట్టి అమ్మకు సంగీతమే సర్వస్వం బాల్యం నుంచే సంగీతం అభ్యసించిన ఓమన కుట్టి తిరువనంతపురం మహారాజా కాలేజ్ లో మ్యూజిక్ లెక్చరర్ గా కేరళ విశ్వవిద్యాలయంలో సంగీత విభాగాధిపతిగా ఉన్నారు. స్వాతి విభాగాధిపతిగా ఉన్నారు తిరునాళ్ కీర్తనలకు ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేశారు మ్యూజిక్ థెరపీ లో పరిశోధనలు చేశారు ఈ ఏడాది ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది.

డాక్టర్ నీరజ కు పద్మశ్రీ

సర్వైకల్ క్యాన్సర్ నిమ్మలన కోసం అవిశ్రాంతిగా పాటుపడుతున్న డాక్టర్ నీరజ భట్లా కు కేంద్రం పద్మశ్రీ ప్రకటించింది. ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో గైనకాలజీ విభాగంలో ఆమె ప్రొఫెసర్ గా ఉన్నారు భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకమైన ఉమెన్ అచీవర్స్ డే అవార్డ్ ఆరోగ్య సంరక్షణ విభాగంలో అందుకున్న తొలి మహిళగా ఆమె చరిత్రలో నిలిచారు.ప్రపంచ ఆరోగ్య సంస్థకు అనుబంధమైన ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ATRC) నుంచి 2023లో ఆమె […]