Monday, 05 Oct, 2026

అన్నింటినీ జయించింది 

కోవిడ్ తో ప్రపంచం వణుకుతూ ఉంటే హాంప్షైర్ కు చెందిన మిల్డ్రెడ్, జెర్రీ షాప్పల్స్ అనే 102 ముసలావిడ కోవిడ్ బారిన పడి కోలుకొని కోవిడ్ పోరాటానికి కొత్త ఉత్సాహం ఇచ్చింది. ఈ బామ్మకు 1918 లో వచ్చిన స్పానిష్ ఫ్లూ ను కూడా జయించిన రికార్డ్ ఉంది. ఈ ఫ్లూ సోకినప్పుడు జెర్రీ 10 నెలల పసిపాప. అప్పట్లో అమెరికాలో ఈ జ్వరం నుంచి బయటపడింది. కాలేజ్ చదువు పూర్తి చేసుకొని,పెళ్ళాడి ఇద్దరు పిల్లలకు తల్లి […]

మానవ సంబంధాలు ముఖ్యం

మెదడు లోని ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ భాగం వ్యక్తి ఆలోచనలను ప్రతిబింబిస్తుందట ఒంటరిగా ఉంటూ ఉంటే ఆ ప్రభావం మెదడు పనితీరు పైన కనిపిస్తూ ఉంటుంది అంటారు పరిశోధకులు చుట్టూ సన్నిహితులు , స్నేహితులు ఉన్నప్పుడు వాళ్లతో స్నేహ బంధాల తో ఉన్నప్పుడు మెదడు ఎంతో పాజిటివ్ గా ఆలోచిస్తోందట. స్నేహపూర్వకమైన మాటలు, పలకరింపులు, ఆనందం, మెదడు ను చైతన్యవంతంగా ఉంచుతాయి.ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉంటే ఆ ప్రభావం మెదడు పైన ఎంతో ఎక్కువ.మెదడు చాలా తక్కువ […]

మహిళలకే శ్రద్ధ ఎక్కువ

వంటింటి ఉపకరణాల తయారీ రంగంలో ఉన్నారు నేహా గాంధీ.బెంగళూరు శివారులో ఉన్న హారో హల్లి కి దగ్గర్లో ఉన్న స్టవ్ క్రాఫ్ట్ పరిశ్రమకు డైరెక్టర్.ఇక్కడ పనిచేసేకి ఎక్కువగా మహిళలే భారీ యంత్రాలతో పనిచేస్తూ విడిభాగాలు జోడిస్తూ మిక్సీలు, గ్రైండర్లు, ప్రెషర్ కుక్కర్ లు, నాన్ స్టిక్ కుక్ వేర్ లు తయారు చేస్తారు.తండ్రి రాజేంద్ర గాంధీ చేస్తున్న వ్యాపారంలోకి అడుగు పెట్టింది స్నేహ గాంధీ.మార్కెటింగ్ హెడ్ గా బాధ్యతలు తీసుకొని మహిళలకు మార్కెటింగ్ అవకాశాలు ఇచ్చింది. రీజనల్ […]

బరువు తగ్గానోచ్ 

లాక్ డౌన్ లో చేసిన వర్క్ వుట్స్ తో 16 కేజీల బరువు తగ్గాను.అయితే ఇది కేవలం రెండు నెలల శ్రమ కాదు. ఏడాది నుంచి బరువు తగ్గించుకోవాలని కష్టపడుతూ ఉన్న నా శరీర బరువుకు కారణం పిసిఓఎస్ సమస్య మొదట్లో ఆహారంలో మార్పులు తర్వాత యోగ మొదలుపెట్టాను ఐదారు కిలోలు తగ్గాక బ్యాలెన్స్డ్   డైట్ లోకి మారాను.84 కిలోలు ఉన్న నేను ఇప్పుడు 68 కిలోలున్న అంటోంది విద్యుల్లేఖ రామ‌న్. తమిళ యాస లో […]

ఆర్డర్ పై డీజిల్

రెపోస్ ఎనర్జీ వ్యవస్థాపకులు అదితి భోసలే వలుంజ్ ఆమె భర్త చేతన్ వలుంజ్,మొబైల్ పెట్రోలు పంపులు తయారీ ఏర్పాటు ప్రారంభించారు.ఈ స్టార్టప్ కు రతన్ టాటా మార్గదర్శ గా ఉన్నారు. ఇందులో పెట్టుబడి కూడా పెట్టారు దేశప్రగతికి ఉపయోగపడే అంకుర్ సంస్థ కోసం ఈ ఇద్దరు ఎన్నో ప్రాజెక్టుల గురించి ఆలోచించారు.మొబైల్ పెట్రోల్ పంపుల తో కోరిన చోటికి అడిగిన సమయానికి డీజిల్ ను పంపే సంస్థ  స్థాపించారు.రతన్ టాటా సలహా మేరకు,ఇంధన పంపిణీలో నాణ్యత పెట్రోల్ […]

ఇలా చేస్తే రంగొస్తుంది

గోరింటాకు ఎర్రగా పండాలంటే ఆకుని రుబ్బేటప్పుడు కాస్త చక్కెర రెండు లవంగాలు అందులో వేయాలి బాగా మెత్తగా అయ్యాక ఆ మిశ్రమానికి నాలుగైదు చుక్కలు యూకలిప్టస్ ఎసెన్షియల్ ఆయిల్ ని కలిపి ఓ అరగంట అలాగే ఉంచి అప్పుడు ఆ గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది.చేతులకు పెట్టిన గోరింటాకు ఎండిపోయాక చక్కెర నిమ్మరసం కలిపి సిరప్ లో దూదిని ముంచి ఆ ఎండిన దానిపైన అద్దాలి. పెనం పైన ఇంగువ వేడి చేసి ఆ పొగ చేతులకు […]

తేలికగా యోగ

యోగాతో ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండవచ్చు అంటారు.ధ్యానం చేస్తూ, ఆసనాలు వేస్తూ స్వాంతన పొందుతారు. కానీ చాలామంది మోకాళ్ళ నొప్పులతో అంతగా నేలపైన కూర్చొని వేయలేకపోతారు. అధిక బరువుతో మోకాళ్ల నొప్పులతో నేలపైన వజ్రాసనం కానీ పద్మాసనం తో కానీ కూర్చోవటం కష్టం అలాంటి సమస్యలు ఉన్న వారి కోసం Knee Ankles Back Joints panic feat ఎంతో ఉపయోగ పడుతోంది దీని సాయంతో సులువుగా ఆసనాలు వేయవచ్చు యోగాసనాలు వేసేందుకు అనువుగా ఉండే కుర్చీ […]

ఆరోగ్యాన్నిచ్చే నృత్యం

లాక్ డౌన్ సమయంలో జిమ్ కు వెళ్ళటం ఇంట్లోనే అన్ని రకాల వర్క్ వుట్స్ చెయ్యటం కష్టం అలాంటప్పుడు సరదాగా డాన్స్ ప్రాక్టీస్ చేయండి పాటలకు అనుగుణంగా నాలుగు స్టెప్స్ వేయండి అంటున్నారు ఎక్స్పర్ట్స్. డాన్స్ శరీరాన్ని తేలిక చేస్తుంది కండరాలను సౌకర్యంగా మారుస్తుంది. డాన్స్ లోని వివిధ భంగిమలను ఒకటికి పది సార్లు చేయడం వల్ల కండరాలకు మర్దన ఫలితం అందుతోంది.మెదడు శరీరం మధ్య సమన్వయం కుదురుతోంది ఏకాగ్రత పెరుగుతోంది. శరీరానికి తగినంత శ్రమ అందుతోంది […]

మొక్కలకు ఎరువుగా కాఫీ

కాఫీ రుచి అసామాన్యం .కాఫీ తోనే ఉదయం కళ్ళు తెరిచే వారే ఎక్కువ శాతం.ఇంత అద్భుతమైన రుచి గల కాఫీపొడి మొక్కలకు ఎంతో మంచి ఎరువు,క్రిమి నాశిని కూడా అంటున్నారు అధ్యయనకారులు. కాఫీ గింజల్లో నైట్రోజన్ ఎక్కువ బాల్కనీ లో ఆకుకూరలు పెంచే వారు ఎక్కువగా కాఫీ వ్యర్థాన్ని వాడుకోవచ్చు.మొక్క చుట్టూ  పొడిబారకుండా ఉండాలంటే మట్టి పై భాగంలో కాస్త కాఫీ పొడి చల్లాలి.కప్పు కాఫీ పొడిని లీటర్ నీళ్లలో కలిపి ఐదారు గంటలు అలా వదిలేసి […]

మెరుపు నిచ్చే టమాటో 

టమోటో తో స్క్రబ్బింగ్ క్లీనింగ్ ఫేస్ ప్యాక్ లు చేసుకోవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్. టమోటో తో ఉండే విటమిన్-ఎ ,యాంటీ ఆక్సిడెంట్ల తో పాటు విటమిన్ సి కూడా ఉండటం తో ముఖంపై మొటిమలు రావు. క్లీనింగ్ కోసం టమాటో ప్యూరీ పెరుగు, పసుపు, శెనగపిండి, గంధం పొడి కలిపి పేస్టులా చేసి రాసుకుని పది నిమిషాలు అలా ఉంచి కడిగేసుకోవచ్చు. ఈ మిశ్రమం టాన్  పోగొడుతోంది. స్క్రబ్బింగ్ కోసం బియ్యంపిండి టమోటో ప్యూరీ, పచ్చిపాలు, చిటికెడు […]

నేను కరోనా ని గెలిచాను 

కరోనా సోకిందని తెలిసినప్పుడు నేనేమి భయపడలేదు ఎప్పటిలాగే వ్యాయామాలు చేశాను పౌష్టికహారం తీసుకున్నాను. కుటుంబ సభ్యులం మాస్క్, గ్లౌజులు, సాక్స్ ధరించి భౌతిక దూరం పాటించాలి పదిహేను రోజులపాటు హోమ్ క్వారంటైన్ చేశాం. నేను సాధన చేసే యోగ ప్రక్రియల్లో శాంభవీ మహా ముద్రను ఏడేళ్లుగా చేస్తున్నాను ఆ క్రియల ప్రభావం నా శరీరం మనసు పైన ఉంది అలాగే కరోనా నుంచి బయట పడ్డాను అంటోంది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ హైదరాబాద్ కు చెందిన శిల్పా […]

లేత రంగులే ఫ్యాషన్

కాఫ్ లాంగ్ కుర్తీలు క్యాజువల్ కాటన్ పాంట్స్ జత చేస్తే ఎప్పుడు అందంగానే ఉంటాయి. చక్కని లేత నీలం, బూడిద రంగు, గులాబీ, పసుపు వంటి తేలికైన రంగులతో ఇవి చాలా అందంగా ఉంటాయి డైలీ వేర్ గా,డిజిటల్ ప్రింటెడ్ కుర్తీలు హ్యాండ్ వర్క్ చేసినవి ప్యూర్ కాటన్ వీ హెవీ దుపట్టాతో చక్కని లుక్ ఇస్తాయి వీటిలో కుర్తీ  ల్యూనిక్ లు ఎక్కువగా స్లీవ్లెస్ లే ఉంటాయి. ఇంకో వెస్ట్రన్ లుక్ తో ఇవి అధునాతమైన […]

 నీళ్ళిచ్చే చెట్లు

సాధారణంగా అన్ని చెట్లు,పూలు,పండ్లు కలప వంటివి ఇస్తాయి ‘టెర్మినాలియా ఎలిప్టికా’ అన్న చెట్టు మటుకు వీటితో పాటు నీళ్లు కూడా ఇస్తుంది.మొసలి బెరడు చెట్టు అని పిలిచే ఈ చెట్టు బెరడు కాస్త తొలిగిస్తే చాలు ఫోర్స్ గా బలమైన ధరతో నీళ్లు వస్తాయి. వర్షపు నీటినీ,భూమిలోని నీటినీ వీటి కాండల్లో నిల్వ వుంచుకొనే ఈ చెట్టు భారతదేశం తో పాటు నేపాల్,బాంగ్లాదేశ్,మయన్మార్,థాయిలాండ్,కంబోడియాల్లో ఉంటాయి. దక్షణ భారత దేశంలో పొడి,తేమ, ఆకురాలే అడవల్లో ఎక్కువగా ఉంటాయి. కొన్ని […]

ఫాన్స్ ఎక్కడైనా ఒకటే 

ప్రశాంతంగా కొన్నాళ్లు గడప వచ్చు కదా అని లండన్ వచ్చి లాక్ డౌన్  లో ఇక్కడే చిక్కుకు పోయాను నేను, నా భర్త ఇక్కడ నన్ను ఎవ్వరూ గుర్తు పట్టారు అనుకున్నాను కానీ వెబ్ సిరీస్ తో ఆ ఏకాంతము కరువైపోయింది. లండన్ వాసులు నన్ను గుర్తు పట్టేశారు అంటోంది రాధిక ఆప్టే నెట్ ఫ్లిక్స్ స్ట్రీమ్ అయినా సేక్రెడ్ గేమ్స్ లో రాధిక ఆప్టే అంజలి మాధుర్ గా అందరికీ తెలిసిపోయింది. మనుషులు  ఎక్కడైనా ఒక్కటే […]

పాడింది నేనేనా ? 

ఒక ఏడాదిలోనే వంద జానపద గీతాలు పాడింది శిరీష.అత్త కొడుక ముద్దుల మరెల్లయ్య జానపద గీతం తో యూట్యూబ్ లో మొదటి సారి గొంతును వినిపించింది శిరీష. ఈ పాటకు రెండుకోట్ల వ్యూస్ వచ్చాయి. అలాగే ఏమే పిల్ల అన్నప్పుడల్లా పాడి 6.8 కోట్ల వ్యూస్ దక్కించుకుంది. పొడి పొడి వానలు పాటతో ఆమె అందరికీ నచ్చేసింది.  ఆమెది సిరిసిల్ల చేనేత కుటుంబం తండ్రి ఆర్.ఎం.పి గా పని చేస్తాడు ఈ పాటలన్నీ వింటుంటే నేనేనా పాడాను […]

మహిళా బౌన్సర్ లకు శిక్షణ

పూణే కు చెందిన రణ్ రాగిని బౌన్సర్  గ్రూప్ లో అందరూ అమ్మాయిలే ఉంటారు. ఈ సంస్థ వ్యవస్థాపకులు దీపా పరాబ్. సినిమాల్లో మేకప్ ఆర్టిస్ట్ గా పోలీస్ పాత్రల్లో నటించింది సినిమా నటుల పక్కన బౌన్సర్లు ఉండటం గమనించిన దీపా కొన్నాళ్ళు బౌన్సర్ గా సెలబ్రిటీల దగ్గర పని చేసింది. ఈ రంగంలో అమ్మాయిలకు డిమాండ్ ఉందని తెలిశాక  రణ్ రాగిని బౌన్సర్లు గ్రూప్ ని ఏర్పాటు చేసింది దీపా. ఎంతో మందికి శిక్షణ ఇస్తోంది. […]

పొరపాటై  పోయింది 

షాదీ డాట్ కామ్ ఇండియా లో  పేరున్న పెళ్లి సంబంధాలు చూసే వేదిక. ఈ సైట్ లో ఒక స్కిన్ కలర్ ఫిల్టరే ఉంటుంది. ఫెయిర్,వీటిష్,డార్క్ ఈ మూడు రంగుల్లో వంటి ఛాయను చెప్పేస్తారు. ఈ మ్యాట్రిమోనియల్ సైట్ లో ఫాలో వివరాలు ఇచ్చేవారు,రంగులు చెప్పేందుకు తప్పని సరిగా ఈ ఫిల్టర్ ఉపయోగించి చెప్పాలి.ఈ రంగు చెప్పే పద్ధతిని మేఘన్ నాగ్ పాల్ అమ్మాయి అసలు అంగీకరించ లేకపోయింది.సైట్ లో ఆ కలర్ ఫిల్టర్ ని తొలగించమని […]

సరైన ఆహారం అవసరం 

కోవిడ్ కారణంగా కుటుంబం మొత్తం ఇంట్లోనే ఉండవలసి వస్తోంది.ముఖ్యంగా పిల్లలు ఆన్ లైన్ తరగతులకు హాజరు కావటం టీవీల ముందు కూర్చోవటం ఎక్కువయింది. సమయానికి స్కూల్ లకు వెళ్ళినట్లుగా క్రమశిక్షణగా తినటం లేదు.ఇది వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీస్తోంది. అల్పాహారంగా అటుకులతో చేసిన పోహ, ఇడ్లీ, దోశ వంటివి ఇవ్వాలి ఇందులో సీజనల్ పండ్లు చేర్చాలి అలాగే తాజా పండ్ల తో మిల్క్ షేక్ లు ఇవ్వచ్చు. మధ్యాహ్నపు భోజనంలో తాజా కూరగాయలు పప్పు, చిక్కుడు, బీన్స్, […]

ఎన్నో ప్రత్యామ్నుయాలు

చాలా మందికి తియ్యని పదార్ధాలు ఇష్టం. ఎక్కువగా తీపి తినటంవల్ల శరీరం బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.పంచదార బెల్లంతో తయారైన స్వీట్లకి ప్రత్యామ్నుయం వెతికితే సరిపోతుంది. ఈ రోజుల్లో రెస్టారెంట్ డిజర్ట్ లు కూడా దాదాపుగా ఆరోగ్యవంతమైన పండ్లతో నిండి ఉంటున్నాయి. తేలిక పాటి గుజ్జులేని కస్టర్డ్ లేదా చీజ్ కేక్ వంటి వాటికీ బదులుగా  టార్ట్ లు తీసుకోవటం మంచిదే. క్రీమ్ పాలు చేర్చిన టార్ట్ లు గుడ్డుతో చేసినవి. తాజా పండ్లు నింపినవి ఎన్నోరకాల […]

పెంపుడు జంతువులతో ఆరోగ్యం 

పెంపుడు ఉన్నఇళ్ళల్లో పిల్లలకు ఎక్కువ రోగనిరోధక శక్తి . ఆస్తమా,ఊబకాయం వంటి సమస్యలు ఉండవు అంటున్నారు అధ్యయనకారులు. పెంపుడు జంతువులు ఉన్న ఇళ్ళలోని పిల్లల్లో RUMINO COCCUN,OSEILLOSPERA అనే రెండు రకాల సూక్ష్మజీవుల్ని అధ్యయనకారులు గుర్తించారు. ఇవి చాలా ఉపయోగకరమైన సూక్ష్మజీవులని,ఇవి పిల్లల్లో అలర్జీలను ఊబకాయాన్ని నిరోధించేందుకు ఉపయోగపడుతాయట. పూర్వపు రోజుల్లో పిల్లలు మట్టితోనూ,పెంపుడు జంతువులతోను ఆడుకొనేవారు. అందుకే వారిలో రోగనిరోధక శక్తి ఎంతో అధికంగా ఉండేదని ఇప్పుడు తల్లులు పిల్లలను నాలుగు గోడలకే పరిమితం చేయటం […]