వర్క్ వుట్స్ చేస్తున్నారా ?
వర్క్ వుట్స్ చేయడానికి అరగంట ముందు కొద్ది మొత్తం లో పోషకాహారం తీసుకోవాలి. ఇలా తీసుకునే ఆహారంలో ప్రోటన్లు, కార్బోహైడ్రేట్స్ ఉండేలా జాగ్రత్త పడాలి.రెండు ఉడికించిన కోడి గుడ్లు వ్యాయామానికి ముందు తింటే నిస్సత్తువ అనిపించదు.బరువు పెరిగే ప్రమాదం కూడా ఉండదు అలాగే రెండు అరటి పండ్లు తిన్న ఉత్సాహంగా వర్క్ వుట్స్ చేయవచ్చు.ఫైబర్ శాతం అధికంగా ఉండే ఓట్స్ మీల్ తింటే వర్క్ వుట్స్ చేసేప్పుడు ఎనర్జీ లెవెల్స్ సిద్ధంగా ఉంటాయి. అలాగే చక్కెర కలపని […]
దోమలు పరార్
చల్లని వాతావరణం తో దోమలు, ఈగలు వచ్చేస్తాయి.సాయంత్రం వేళ ఇంట్లో కర్పూరం వెలిగించి తలుపులు మూసేస్తే ఆ వాసన ఇల్లంతా ఉంటుంది.పదినిమిషాల తర్వాత తలుపులు తెరిస్తే దోమలు రావు.అలాగే వెల్లుల్లి వాసనకు దోమలు రావు.నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు దంచి పావు కప్పు నీళ్లలో మరిగించాలి ఆ నీటిని చల్లితే దోమలు రావు.ఒక కాళీ సీసాలో నీళ్లు పోసి అందులో నారింజ తొక్కలు వేసి ఆ నీటిలో యూకలిప్టస్,నిమ్మ నూనె రెండు చుక్కలు వేయాలి.ఆ నీటిలో తేలే లాగా […]
ఇది స్వదేశీ స్టైల్
ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఇటీవల ఖద్దరు చెప్పులను విడుదల చేసింది.ఆగ్రాలోని అతిపెద్ద షూ తయారీ కంపెనీ దవార్ ప్రస్తుతం. 26 రకాల డిజైన్లతో ఇలాంటి పాదరక్షకులు ఉత్పత్తి చేస్తోంది.త్రిశూల్ గ్రూప్ అధినేత శృతి కౌల్ వీటిని డిజైన్ చేశారు. చెప్పులు ట్రెండ్ సెట్టర్స్ పెళ్లిళ్ల డ్రెస్ లకు ఖద్దరు బూట్లు సరిగ్గా సరిపోతాయి అంటున్నారూ శృతి కౌల్.చేతి తోనే నేసే ఖద్దరు కు విదేశాలలో కూడా ఎంతో ఆదరణ ఉంది.ఇంతకుముందే ఖాదీ ఇండియా నుంచి […]
పోషకాల బొప్పాయి
మనం రోజూ తీసుకునే మెనూ లో బొప్పాయి పండు ఉంటే అది వైరస్ ల నుంచే కాదు మరెన్నో రోగాల నుంచి మనల్ని కాపాడుతోందని చెబుతున్నారు వైద్యులు.బొప్పాయిని చాలా ఔషధాల్లో ఉపయోగిస్తారు ఇందులో అనేక పోషకాలు, ఫైబర్ తో పాటు ఫోలేట్ బి6 కాల్షియం మెగ్నీషియం విటమిన్-సి బి1,బి3,ఇ- కె,పొటాషియం ఉన్నాయి.బొప్పాయిలోని యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటాయి.ఇందులోని సి ఇ విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరి తిత్తులు ముక్కు రంధ్రాల్లో శ్వాస […]
ఆమెకు ఆకలే కనిపించింది
ద్యుతిచంద్ స్టార్ స్ప్రింటర్ 2018 లోజకార్తా లో జరిగిన ఏషియన్ గేమ్స్ రెండు రజిత పతకాలు సాధించినందుకు ఒడిస్సా ప్రభుత్వం ధృతి కి రెండు కోట్ల రూపాయలు నజరానా ఇచ్చింది. పేద చేనేత కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ద్యుతి తను సంపాదించుకున్న డబ్బుతో ఈసారి ఒలింపిక్స్ వెళ్లేందుకు శిక్షణ తీసుకోవచ్చు కానీ ఆకలి మంటల బాధ, తెలిసిన యువతి. తన ఫ్యూచర్ సంగతి పక్కన పెట్టి లాక్ డౌన్ లో పస్తులున్న తమ గ్రామస్తుల కడుపు […]
ఛేంజ్ మేకర్ గర్విత గులాటి
‘ ది డయానా అవార్డ్ ‘ గెల్చుకుని ఛేంజ్ మేకర్ గా నిలబడింది గర్విత గులాటి. వై వేస్ట్ అనే ఫౌండేషన్ స్థాపించి నీళ్లు ఎలా వృద్ధి అవుతున్నాయో ప్రచారం చేసింది.ఆ వృధా అరికట్టే దిశగా అడుగులు వేసింది.ఆమె స్లోగన్ ‘ గ్లాస్ హాఫ్ ఫుల్ ‘ హోటళ్లలో రెస్టారెంట్స్ పూర్తి గ్లాసు నీళ్ళు టేబుల్ పై పెట్టకుండా సగం గ్లాసు నీళ్ళు ఇస్తే ఎంత వృధా అరికట్టవచ్చో ప్రచారం చేసింది.దేశ వ్యాప్తంగా ఐదు లక్షల రెస్టారెంట్స్ […]
బహుళ ప్రయోజనాలు
చెట్లు పూలు ఔషదాలు వెళ్ళు బెరళ్ళు నుంచి వెలికి తీసే అరోమా ఆయిల్ మంచి మూడుకు దోహదం చేస్తాయి.ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, ఆత్రుతలను తగ్గిస్తాయి.ఈ నూనెలు చర్మం ఊపిరి తలంపై పూతగా వాడిన ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి.ఎసెన్షియల్ ఆయిల్స్ లో కొన్నింటిని స్నానం చేసే నీళ్లలో కలుపుకోవచ్చు కొన్నింటిని ఆవిరి పట్టచ్చు.కొన్నింటిని పై పూతగా వాడుకోవచ్చు మెదడు పై ఇవి అనుకూల సంఘటనలు ఇవ్వటం ద్వారా ఉపకరిస్తాయి లావెండర్ ఆయిల్ థైమ్ క్లారినెజ్ క్యారెట్ సీడ్ వంటి వాటిల్లో […]
అందరికీ అక్కర్లేదు
కోవిడ్ కేసులు సంఖ్య పెరగటంతో చాలామంది లక్షణాలు కనిపించక పోయినా అనుమానంతో పరీక్షలకోసం వరుసల్లో నిలబడుతున్నారు.ఆఫీస్ లో లేదా అపార్ట్ మెంట్ లో ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే మిగతా అందరూ పరీక్షలు చేయించుకోవాలను కుంటున్నారు.నిజానికి జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉన్న వారికే తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న వాళ్లు అలాంటి లక్షణాలు ఉంటేనో.అధిక రక్తపోటు మధుమేహం, గుండె, మూత్రపిండాల జబ్బు తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులు కరోనా […]
గ్రీన్ టీ అద్భుతాలు
గ్రీన్ టీ తో చర్మ, శిరోజాల సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్.మొటిమలు, మచ్చల సమస్యలు ఉంటే టీ బ్యాగ్ ని వేడి నీళ్లలో వేసి ఆ నీటిని చల్లార్చి ఆ నీళ్లతో ముఖాన్ని క్లీన్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది నీళ్లతో కడిగాక ముఖం పడుచు కోకుండా ముఖం పై ఆరి పోనివ్వాలి.షాంపూ తర్వాత హెయిర్ కండీషనర్ గా గ్రీన్ టీ నీళ్లను వాడుకోవాలి. ఇది శిరోజాల కుదుళ్ళకు మంచి స్టిమ్యులేటర్ గా పనిచేస్తుంది. జుట్టుకు […]
వంటింటికి అందం గోల్డ్ కలర్ స్టీల్
వంటింట్లో వాడే స్పూన్ ల దగ్గర నుంచి ప్లేట్స్, గ్లాసులు, గిన్నెలు ఇతర అన్ని రకాల వంట సామాన్లు పైన బంగారు రంగులో అద్దేస్తున్నారు. ఈ గోల్డ్ కలర్ స్టీల్ సామాను చూస్తేనే కళ్ళు చెదిరేలా ఉంటున్నాయి.స్టీల్ ఫిజికల్ వేపర్ డిపాజిషన్ కోటింగ్ పద్ధతిలో బంగారు రంగు అద్దుతారు. ధర కాస్త ఎక్కువైనా అచ్చం బంగారు పాత్ర లాగే ఉన్నాయి.క్యారెట్ తురిమే గ్రేలర్ పిండి జల్లెడతో సహా అన్ని పుత్తడి రంగుతో కళ్ళు మెరుస్తున్నాయి. స్టీలు పాత్రల […]
ఆరోగ్యాన్నిచ్చే స్వీట్ కార్న్
చల్లగా ఉన్న వాతావరణంలో స్వీట్ కార్న్ లేదా మామూలు మొక్కజొన్న కండెలు వేడి వేడిగా తింటే బాగుంటుంది.వేడి స్వీట్ కార్న్ పైన ఉప్పు,కారం,మిరియాల పొడి చల్లి తింటే మరింత రుచి వీటిలో క్యాలరీలు తక్కువ.వంద గ్రాముల స్వీట్ కార్న్ లో కేవలం 86 కేలరీలు ఉంటాయి.ఈ గింజల్లో డైటరీ ఫైబర్ విటమిన్లు ,యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.వీటిలో ఉండే ఫెరులిక్ ఆమ్లం వార్ధక్యపు ఛాయలు రానివ్వదు.అలాగే జియాక్సాంథిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటిచూపును మెరుగుపరుస్తుంది. స్వీట్ కార్న్ […]
మాస్క్ లు ఇస్తున్న దేవత
తమిళనాడులో కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాస్కులు వేసుకోవటం తప్పనిసరి అన్న అవగాహన ప్రజల్లో కల్పించటం కోసం తమిళుల ఆరాధ్య దైవం మరియమ్మన్ అమ్మ అవతారం ధరించింది.ఈ సామాజిక కార్యకర్త తలపై కిరీటం కాళ్ళకు గజ్జెలు ధరించి వీధుల్లో నడుస్తూ ప్రజల దగ్గరకు వెళ్లి మాస్కులు వేసుకోమని చెప్పి వాటిని ఇస్తోందామే.వెనకే ఇద్దరు మహిళలు మాస్క్ లు పట్టుకోని ఆమెను అనుసరిస్తున్నారు.రహదారుల్లో ప్రజలను ఆపి కరోనా ప్రమాదాన్ని వివరిస్తోంది.గ్రామీణ ప్రాంతాల ప్రజల దేవత పేరు […]
ముఖం పై నలుపా ?
ఒత్తిడి వల్లనో హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ వల్లనో మొహం పైన నలుపు పేరుకు పోతుంది. ఈ టాన్ పోగొట్టుకోవాలంటే ఇంట్లోనే చేసుకోగలిగే ఫేస్ ప్యాక్ వాడుకోవచ్చు.రెండు స్పూన్ల బార్లీ పొడిని ఉడకబెట్టి అందులో కాస్త నిమ్మరసం కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ఈ పేస్ట్ తో ఫేస్ ప్యాక్ వేసుకుని పావుగంట తర్వాత కడిగేస్తే నలుపుదనం క్రమంగా క్రమంగా తగ్గుతోంది పెసరపిండి, ఉలవ పిండి లో కీరదోస రసం కలిపి ప్యాక్ వేసుకోవచ్చు. ఎండు ద్రాక్ష ఎండు […]
చక్కని ఆకృతి కోసం
తీరైన ఆకృతి కోసం లో దుస్తులు ఎంచుకోవడంలో శ్రద్ధ పెట్టాలి అంటారు ఎక్స్పర్ట్స్.ఎదిగే వయసుని బట్టి శారీరకంగా వచ్చే మార్పులకు అనుగుణంగా వీటిని ఎంచుకోవాలి. వేసుకునే దుస్తులు ఆకృతి ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకోవాలి.ఛాతి పెద్దగా ఉండే వారు పూర్తిగా కప్పి ఉండే రకం బ్రాలను ఎంచుకోవాలి.అదే తక్కువగా ఉంటే కప్ రకాలు ఎంచుకుంటే చక్కని ఆకృతిలో కనిపించటమే కానీ ఇవి ఛాతి అడుగు నుంచి సపోర్ట్ గా ఉంటాయి.అలాగే చీర కు సంబంధించి అదే రంగులో […]
గోళ్ళకు పోషణ
గోళ్ళ పైన వేసుకునే నెయిల్ ఆర్ట్ బావుంటుంది. అలా ఆర్ట్ వేసుకోవాలంటే గోళ్లు బలంగా ఉండాలి.బయోటిన్ ఆహారంలో పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి.ఉడికించిన గుడ్లు, చిరుధాన్యాలు, సోయాబీన్స్, అరటి పండు తినాలి.శానిటైజర్ వాడకం వల్ల గోళ్లు పొడిబారిపోతూ ఉంటాయి గోళ్లకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి.నెయిల్ పాలిష్ వాడకుండా గోళ్ళకు పోషణ ఇస్తే అప్పుడు బలం గా ఎదిగిన గోళ్ళ పైన నెయిల్ ఆర్ట్ చక్కగా వస్తోంది.అలాగే గోళ్ళ పైన రంగును పోగొట్టుకోవాలి అంటే ఎసిటోన్ లేని నెయిల్ రిమూవర్లు వాడాలి.
వర్షంలో జాగ్రత్త
వర్షంలో తడవటం లేదా ఎక్కువ సమయం నీళ్లలో ఉండవలసి వస్తే పాదాల పైన తేమ అధికమై ఇన్ఫెక్షన్ లు వస్తాయి.ఈ సీజన్ లో మరీ ఎక్కువ వర్షంలో బయటికి వెళ్ళవలసి వస్తే ఓపెన్ ప్లాస్టిక్ చెప్పులు లేదా రబ్బరు చెప్పులు వేసుకోవాలి. స్నానం చేసినప్పుడు కాళ్లు కడుకున్నప్పుడు పాదాలు తడి లేకుండా తుడుచుకోవాలి.పాదాలపైన యాంటీ ఫంగల్ డస్టింగ్ పౌడర్ టాల్కమ్ పౌడర్ చల్లుకోవాలి మాయిశ్చరైజర్ వాడకం తగ్గించాలి. ఉతికిన దుస్తులు వేడి నీళ్లలో ముంచి తీసి ఆరబెట్టుకోవాలి […]
కిండిల్ లో ‘ నో నెట్ ‘
సోనాలీ దాబడే రాసిన ‘ నో నెట్ ‘ అనే 9 కథల సంపుటి.అమెజాన్ కిండిల్ లో పబ్లిష్ అయ్యింది. ఆ అనే సినిమాకు స్క్రిప్ట్ రాసిన సోనాలి సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి రచన రంగం లోకి వచ్చింది నైట్స్ అండ్ లిల్లీస్ ఆమె మొదటి నవల. తరువాత ఫైవ్ ఆఫ్ హార్ట్స్ రాసింది.ఈ మూడవ కథల పుస్తకం నో నెట్ లో ఒక్క కథలో ఒక్క భావోద్వేగం ఉంటుంది. ఈ పుస్తకం చదవాలనుకుంటే అమెజాన్ […]
మంచి నీళ్లకు రుచి
మంచి నీళ్ళతో కూడా ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్.నారింజ, నిమ్మకాయ పైనాపిల్ ముక్కలు, కీర ముక్కలు, అల్లం ముక్కలు, పుదీనా ఆకులు మొత్తం సన్నగా కట్ చేసుకోవాలి. పాత్రలో నీళ్లలో ఈ ముక్కలన్నీ వేసి ఒక గంట పాటు అవతల పెట్టి ఆ తరువాత ఆ పదార్థాలు తీసేసి ఆ నీళ్లను ఫ్రిజ్ లో పెట్టుకోని తాగవచ్చు. ఈ ముక్కలన్నీ కలిపిన నీళ్లు మంచి రుచి తో సువాసన తో ఉంటాయి.మంచి నీళ్ళు ఎక్కువగా తీసుకుంటే మంచిదనే […]
వజ్రాల మాస్క్
ఈ వజ్రాల ఫేస్ మాస్క్ ధర అక్షరాలా లక్షా నలభై వేల రూపాయలు సూరత్ లో ఉండే వజ్రాల వ్యాపారి కుశాల్ భాయ్ తయారు చేశాడు. తను చేయించుకున్న మాస్క్ కు ది కుశాల్ బాయ్ అన్న ఇంగ్లీష్ అక్షరాలను వజ్రాలతో అమర్చుకొని ఫోటోలు షేర్ చేశాడు. కరోనా సమయంలో ఎలానో మాస్క్ లు తప్పవు పెళ్లి వేడుకల్లో మంచి దుస్తులు ఆభరణాలు ధరించి మామూలు మాస్క్ లు సర్జికల్ మాస్క్ లు ఏం బావుంటాయి. అప్పుడీ […]
గౌరీ మహాదిక్ కు శుభాకాంక్షలు
ఇంతటి ధైర్యం తెగువ అంకితభావం భారతీయ మహిళల లోనే ఉంటాయి. అసలైన భారతీయ మహిళకు ప్రతీక గౌరీ మహాదిక్ అన్నారు స్మృతి ఇరానీ. తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో అమర సైనిక వీరులను తలచుకునే నేపథ్యంలో ఆమె గౌరీ మహాదిక్ లక్ష్యాన్ని ప్రశంశించారు. 2017 భారత చైనా సరిహద్దుల్లో మేజర్ ప్రసాద్ మహాదిక్ గాయపడి ప్రాణాలు వదిలారు. మేజర్ అమరుడైన 10 రోజులకు ఆయన భార్య గౌరీ ఒక నిర్ణయం తీసుకుంది. వృత్తి రీత్యా ఆమె లాయర్ […]
