Friday, 02 Oct, 2026

విశ్వసుందరి ఆండ్రియా 

మిస్ యూనివర్స్ కిరీటం అందుకున్నది మెక్సికోకు చెందిన ఆండ్రియా మోజీ. 26 సంవత్సరాల ఆండ్రియా ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఉద్యోగం చేస్తూ మాడలింగ్ లోనూ తన ప్రతిభను చూపెడుతోంది 73 దేశాలకు చెందిన  సుందరీమణులు పాల్గొన్న 69 వ విశ్వసుందరి పోటీల్లో మిస్ యూనివర్స్ కిరీటం సొంతం చేసుకున్న ఆండ్రియా మోజీ మెక్సికో హక్కుల అంబాసిడర్ గా పని చేస్తోంది. మన ఆలోచన విధానం  వ్యవహార శైలి లోనే […]

కరోనా వారియర్ 

కరోనాతో మరణించిన జోత్స్న పై పాథలాజికల్ అటాప్సీ (వ్యాధి అధ్యయనం కోసం చేసే శవ పరీక్ష) జరగటం లో దేశంలోనే తొలిసారిగా కరోనా పరిశోధన  కోసం ఉపయోగపడిన తొలి మహిళగా గుర్తింపు పొందారు జోత్స్నా. కోల్ కత్తా లోని బేలెఘాట్  లో ఉంటారు తను చనిపోతే అవయవ దానం చేయాలని  అనుమతి పత్రం పైన  పదేళ్ల క్రితం సంతకం పెట్టారామే. మే 20వ తేదీ కోల్ కత్తా లోని ఆర్. జి. కర్ మెడికల్ కాలేజ్ లో […]

ఇది కాశ్మీరి సూఫీ పాట 

కాశ్మీర్ లోయలో ఐదారు మంది ఆడపిల్లలు కలిసి సూఫీ గర్ల్స్ పేరుతో చక్కని భక్తి గీతాలు పాడుతున్నారు. కాశ్మీర్ లో సూఫీ సంగీతం పాడే బృందాలు లేవు మగవాళ్లే పాడుతున్నారు. కాశ్మీర్ లోని బండిపోర జిల్లా లో గవస్థాన్ అనే చిన్న పల్లెలో ఇర్ఫానా యాసఫ్ అనే కాలేజీ అమ్మాయి మొదట్లో ఈ భక్తి సంగీతం నేర్చుకుంది.  ఆమె వెనకాల ఇంకొందరు ముందుకొచ్చారు అమ్మాయిలు తల్లిదండ్రుల అంగీకారంతో ఈ కాశ్మీర్ సూఫియానా సంగీతాన్ని పాడటం మొదలుపెట్టారు తమ […]

వ్యాక్సిన్ డైట్ 

వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కొంతమందికి స్వల్పంగా జ్వరం ఒళ్ళు నొప్పులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో మసాలా పదార్థాలను మానేసి తేలికగా అరిగే ఆహారం తినాలి.తగినన్ని నీళ్లు తాగాలి సూప్స్ నీళ్లు ఎక్కువగా ఉండే పండ్లు హెర్బల్ టీ లు కొబ్బరి నీళ్లు మజ్జిగ మొదలైనవన్నీ తీసుకోవచ్చు యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే పుచ్చ, బొప్పాయ, జామ వంటి పండ్లు ప్రోటీన్ కోసం తేలికగా ఉండే పప్పు గింజలు ముడి ధాన్యాలతో చేసిన రొట్టెలు తీసుకుంటే […]

ఇమ్యూనిటీ బూస్టర్ 

భారత ప్రభుత్వం కోవిడ్ పేషెంట్లు సహజసిద్ధమైన పద్ధతిలో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు కొన్ని సూచనలు చేసింది. రోజుకు ఐదు సార్లు రంగుల కూరగాయలు, పండ్లు తీసుకోవాలి వీటివల్ల శరీరానికి అవసరమైన ఖనిజాలు విటమిన్లు అందుతాయి .70 శాతం కోకోవా ఉన్న డార్క్ చాక్లెట్ ని కొద్ది మొత్తంలో తీసుకోవటం వల్ల మనసులో ఒత్తిడి తగ్గుతుంది .గ్లాసు పాలలో చిటికెడు పసుపు కలుపుకొని ప్రతిరోజు తాగాలి భోజన విరామ సమయంలో స్మూతీ లు  పెరుగు, చీజ్ ఉడికించిన […]

కోర్ట్నీ  లలోత్ర 

కోర్ట్నీ  లలోత్ర (కోర్టునే Lalothra) మన్  హట్టిన్ లో ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చదువుతున్న సమయంలో ఫ్యాబ్రిక్ రీసెర్చ్ ప్రాజెక్ట్ లో భాగంగా ఇండియా వచ్చింది. ఈశాన్య ఢిల్లీలో మురికివాడల్లో ఉన్న పిల్లలను చూసి చలించిపోయింది. అమెరికాలో తనకున్న ఆస్తులన్నీ అమ్మి 15 వేల డాలర్లతో ఇండియా వచ్చి ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. 2014లో యోగేష్ అన్న వ్యక్తిని ప్రేమించి పెళ్లాడాక వారికి పుట్టిన ‘ఎడి’ అన్న అబ్బాయి తో […]

మను బాకర్ 

టోక్యో ఒలంపిక్స్ కి ఎంపికయింది మను బాకర్. ఈ 19 ఏళ్ల క్రీడాకారిణి ఒకేసారి షూటింగ్ లో మూడు విభాగాల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. యూనివర్సల్ స్కూల్ నడిపే తల్లి సుమేధ ఆధ్వర్యంలోనే ఆ స్కూల్లోనే షూటింగ్ లో శిక్షణ పొందింది మను బాకర్.తిరువనంతపురం జాతీయ పోటీల్లో ఒకేసారి 15 పతకాలు గెల్చుకుంది .ప్రస్తుతం ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్ లో బి ఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్న మను జూలై లో జరిగే ఒలంపిక్స్ […]

కప్పు టీ తో నిద్ర 

ఒక కప్పు టీ తాగితే కమ్మని నిద్ర వస్తుంది అంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదూ. కప్పు నీళ్లలో కాసిని పుదీనా ఆకులు వేసి వడకట్టి తేనె కలిపి తాగితే మెదడు ప్రశాంతంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు స్వాంతన  కలిగించి హాయిగా నిద్ర పట్టేలాచేస్తుంది. అలాగే గులాబీ టీ కూడా ఒత్తిడి ఆందోళనలు తగ్గించి మెదడుకు ప్రశాంతతను చేకూరుస్తాయి .తాజావి లేదా ఎండినవి గులాబీ రేకులను నీటిలో మరిగించి గ్లాసు లోకి  వడకట్టుకోవాలి.కాస్తంత తేనె కలిపి తాగితే చక్కగా […]

పాలు విరిగి పోతున్నాయా ?

వేసవిలో పాలు త్వరగా విరిగి పోతూ ఉంటాయి అలా విరిగిపోకుండా ఉండాలి అంటే పాలను బాగా కాచాలి.వాటిని బాగా చల్లారాక ఫ్రిజ్ లో పెట్టుకోవాలి కాచిన పాలను ఎండ తగిలే చోట పెట్టద్దు ఇలా చేస్తే పోషకాలు పోతాయి. కాచిన గిన్నెలోనే పాలను ఉంచాలి.గిన్నెలు మార్చరాదు. కావలసిన పాలను వేరే గిన్నెలోకి తీసుకుని వాడుకోవాలి కానీ పదే పదే మొత్తం పాలు వేడి చేయవద్దు.పాలను అడుగు మందంగా ఉన్న గిన్నెలో సన్నని మంటపై వేడి చేయాలి పాల […]

బరువు తగ్గించే బెల్లం 

ప్రతిరోజు చిన్న ముక్క బెల్లం తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు. మహిళలకు ఇది మరీ మంచిది బరువు తగ్గాలని నిజానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రతి రోజు బెల్లం తింటే చక్కగా బరువు తగ్గుతారు .ఎందుకంటే ఇది కొవ్వును కరిగిస్తుంది ముఖ్యంగా మహిళల్లో రుతుక్రమం సమస్యలు తగ్గిపోతాయి. కీళ్లనొప్పులు ఉంటే ప్రతిరోజు బెల్లంలో అల్లం ముక్క కలిపి తింటే నొప్పులు మాయం అవుతాయి.బెల్లం లో ఐరన్ శాతం ఎక్కువ కాబట్టి రక్తహీనతతో బాధపడే మహిళలు తప్పనిసరిగా […]

ఈ వేదిక మహిళల కోసం 

లైమ్ రోడ్.కామ్ మహిళల కోసం ప్రారంభించిన ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ దీనికి పది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ కామర్స్ లైఫ్ స్టయిల్ అండ్ యాక్సెసరీస్ వెబ్ స్టయిల్ ను ఫ్యాషన్ మ్యాగజైన్ విధానం తో రూపొందించాను. 50 మంది తో ప్రారంభమైన ఈ సంస్థలో ఇప్పుడు నాలుగు వందల మంది వరకు ఉన్నారు అంటున్నారు సూచి ముఖర్జీ .లైమ్ రోడ్ ఆన్ లైన్ బిజినెస్ దిగ్గజం ఆమె గృహిణి గా సి.ఈ.ఓ గా […]

ఒరు దేశీ డ్రైవ్ 

‘ఒరు దేశీ డ్రైవ్’ పేరుతో 100 రోజుల పాటు దేశమంతా తిరిగి రావాలని ప్లాన్ చేసింది కొచ్చి కి చెందిన ఆయుర్వేద వైద్యురాలు మిత్ర సతీష్ .మారుతీ ఎస్ క్రాస్ మోడల్ కారులో 11ఏళ్ల కొడుకు తో మార్చి లో బయలుదేరి మే 6వ తేది వరకు సాహసోపేతమైన దారుల్లో ప్రయాణం చేసి తిరిగి వచ్చి చేరుకున్నారు. భారత టూరిజం శాఖ ఇందుకు కొంత స్పాన్సర్ గా నిలిచింది.ఫ్రెండ్స్ ఫేస్ బుక్ ఫాలోయర్స్ తోడుగా నిలిచారు. ఈ […]

నాజూకైన కంటె నెక్లెస్ 

కంటె కాసుల పేరు ఎప్పుడో పూర్వకాలపు నగలు నాజూకైన మెడ చుట్టే ఈ సన్నని నగలు సరికొత్త డిజైన్ లతో మళ్ళీ వచ్చాయి. పచ్చలు కెంపులు లతో మెరిసిపోతూ నయా డిజైన్ లతో కళకళలాడుతున్నాయి. లక్ష్మీదేవి, రాధాకృష్ణులు,హంసలు,ఏనుగులు పూల డిజైన్ లు లాకెట్ లతో కంటె నెక్లెస్ సాంప్రదాయ చీరెల పైకి లంగా ఓని గాగ్రా చోళీ వంటి నాజూకు డ్రెస్ ల పైకి ట్రెండీ గా కనిపిస్తున్నాయి. బరువుగా లావుగా ఉండే కంటె కాస్త సన్నగా […]

ఖనిజాల శాతం అధికం 

జీవన్ ఉన్న బ్యాక్టీరియా లేదా ఈస్ట్ కాణాలే ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు మరెన్నో వ్యాధుల నివారణకు ప్రోబయోటిక్స్ ఉపయోగపడతాయి. దక్షిణాది ప్రజలకు చిరపరిచితమైన ప్రోబయోటిక్ ఇడ్లీ, మినపప్పు నానబెట్టి, పిండి రుబ్బి,బియ్యపు రవ్వ లేదా ఉప్పుడు రవ్వ కలిపి ఆవిరి మీద వన్డే ఇడ్లీ, నూనె లేకుండా వేసే అట్లు, పుల్లట్లు అన్నీ బ్యాక్టీరియాను  పెంచి పోషించేవే.పులిసినప్పుడు పిండి లోని ఖనిజాల శాతం పెరగడంతో ఇవి ఆరోగ్యానికి మంచివే రోజువారీ పనులకు అవసరమయ్యే పోషకాలు […]

చల్లగా వేడిగా ఒకే డ్రస్ 

ఒకే రకమైన దుస్తులు వేసవిలో చల్లదనం ఇస్తాయి. చలికాలంలో వెచ్చగా ఉంటాయి .ఈ టెక్స్ టైల్ పేరు జానస్. చైనా కు చెందిన జె జియాంగ్ యూనివర్సిటీ వెస్ట్ లేక్ విశ్వవిద్యాలయ నిపుణులు సంయుక్తంగా ఈ  జానస్ టెక్స్ టైల్ అనే సరికొత్త రివర్సబుల్ ఫ్యాబ్రిక్ రూపొందించారు. పాలి టెట్రా ఫ్లోరో   ఇథలిన్ తో చేసిన ఈ ఫ్యాబ్రిక్ ని కుట్టిన జాకెట్స్ రెండు కాలాలకి పనికి వస్తాయి. వెచ్చగా కావాలంటే జంక్ , కాపర్ నానో […]

వాటర్ పప్పెట్ షో 

వియత్నం లో ప్రతి రోజు జరిగే వాటర్ పప్పెట్ షో పనాడా11వ శతాబ్దం నాటిది. బొమ్మలకు సన్నటి దారాలు కట్టి తెర వెనక నుంచి కళాకారులు ఆడించే తోలు బొమ్మలాట మనకు తెలిసిందే. అయితే ఈ వాటర్  పప్పెట్ లో దారాలు ఏమీ కనిపించవు నీటి పైన తోలు బొమ్మలు అలా తిరిగేస్తూ కథలు చెబుతాయి. ఈ పప్పెట్ షో లో నీటి కొలనే వేదికా. తెర వెనక నుంచి కళాకారులు నీటి అడుగున ఏర్పాటు చేసుకున్న […]

ఎవర్ని పట్టించుకోవద్దు 

చాలా చిన్న పిల్ల గా ఉన్నప్పటి నుంచే నా శరీరాకృతి గురించి అసభ్యమైన కామెంట్స్ విన్నాను నా శరీరం తీరు గురించి అంత చిన్న వయసులో బాడీ షేమింగ్ ఎదురవడంతో మానసికంగా ఎంతో కృంగిపోయాను. అదెంత దూరం పోయింది అంటే నేను సినిమాల్లో సక్సెస్ ఫుల్ గా ఉన్నప్పుడు మనసులో ఒక కాంప్లెక్స్ నేను అందంగా లేనని…అందులో నుంచి బయటపడేందుకు వైద్యుల సలహాలు తీసుకోవాలిసి వచ్చింది అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది నటి ఇలియానా .ఇప్పుడిక […]

వాకింగ్ లైబ్రేరియన్ 

64 ఏళ్ల రాధా మణి ని నడిచే గ్రంథాలయం అని పిలవచ్చు.కేరళ లోని వయనాడ్ జిల్లా లో కొండ ప్రాంతంలో ఉండే మద్దికెర మోథెక్కర గ్రామంలోని ప్రతిభా లైబ్రరీలో ఆమె పని చేస్తోంది. మహిళలలో పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో ఇక్కడ విమెన్స్ రీడింగ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. ఇందులో భాగంగానే రాధా మణి వాకింగ్ లైబ్రేరియన్ గా మారి రోజూ నాలుగు కిలోమీటర్లు నడిచి చుట్టుపక్కల ఉన్న ఊర్లకు వెళ్లి ఇంటింటికి తిరుగుతూ […]

అన్ని వివరాలు ఇక్కడే 

ది అన్ కట్ టీమ్ కామ్ అనే వెబ్ సైట్ ని తన స్నేహితురాలు తీయగర్గ్ తో కలిసి రూపొందించిన పదిహేడేళ్ల సుహాని దారుకా .ఈ టీమ్ లో మొత్తం 55 మంది విద్యార్థులు ఉన్నారు ఢిల్లీ, ఆగ్రా తో సహా వివిధ స్కూళ్లు కాలేజీలల్లో చదువుతున్న వీరంతా ఏకమై కేవలం 14 గంటల్లో కోవిడ్ రోగులకు అవసరమైన డేటాతో ది అన్ కట్ టీమ్ కామ్ నిరూపొందించారు. ఈ సైట్ లో ఏ రాష్ట్రానికి ఆ […]

వీలైనంత చేస్తున్నా 

గతంలో లాక్ డౌన్ సమయంలో ప్రజల ఇబ్బందులు చూడలేక నేను స్వయంగా వంట చేసి పెట్టాను. ఇప్పుడు అంత ధైర్యం చేయలేకపోతున్నా. మా అమ్మ నాన్న ఇద్దరు డాక్టర్లే వాళ్ళు ఆస్పత్రికి వెళ్తూనే ఉన్నారు. ఎంతో మంది సాయం కోసం ఫోన్ లు చేస్తున్నారు వీలైనంత వరకు వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అని చూస్తున్నా అంటోంది ప్రణీత .కోవిడ్  పంజా విసిరిన అప్పటినుంచి నటి ప్రణీత తన ప్రణిత ఫౌండేషన్ ద్వారా నిధులు సేకరించి ఎంతో మందికి […]