Wednesday, 12 Aug, 2026
సాధారణంగా ఎవరైనా డెలివరీ తర్వాత కాస్తో కూస్తో మారతారు.. బరువు పెరుగుతారు. హార్మోన్ల సమతుల్యత లోపించటం కొవ్వులు పెరగటం ఇంకా ఎన్నో ఇతర కారణాలతో ప్రసవం తర్వాత తేడా వస్తుంది . వెంటనే బరువు తగ్గటం చాలా కష్టం కూడా కానీ బాలీవుడ్ నటి కరీనా కపూర్ మాత్రం ఈ సమస్యను రెండు నెలలోపునే అధిగమించింది. ప్రముఖ డైటీషియన్ రుజుత్ దివేకర్ కరీనా స్లిమ్ గా అయ్యేందుకు డైట్ చార్ట్ ఇచ్చారు. కరీనా కూడా నేను తక్కవ ఏమీ తినలేదు. నెయ్యి వాడాను పిజ్జా లు తిన్నాను పరోటాలు లాగించాను ఆకలేసినంతవరకు తిన్నానన్నారు. కానీ ప్రెగ్నెన్సీ కి ముందు సినిమాల్లో ఉన్నప్పుడు ఆమె ఎలా ఉందో ఇప్పుడు వెంటనే అలంటి షేప్ ;లోకి మారిపోయింది కరీనా. నలుపు రంగు హాఫ్ షోల్డర్ బార్ డాట్ డ్రెస్ ధరించిన కరీనా కపూర్ ఫోటో చూసి అందరూ ఎంత బావుందో అనేసారు. ఏ బ్యూటిఫుల్ మదర్ ని చూసి సైఫ్ ఏమని అంటాడో.. డిసెంబర్ లో మగబిడ్డను జన్మనిచ్చిన కరీనా రెండు నెలలకే రుజుత్ ఆధ్వర్యంలో తిరిగి చక్కగా అయిపోయారు. ఈ క్రెడిట్ అంతా రుజుత్ దే నన్నారు కరీనా...

నా ఇష్టమే కదా

ఒక్క మాట అన్న సహించం అంటారు సెలబ్రిటీలు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా రెస్పాండ్ అయ్యే వాళ్ళలో కరీనాకపూర్ కూడా ముందే ఉంటుంది. తైమూర్ పుట్టాకా కూడా చిన్న పిల్లలా ఆ డ్రెస్ లేమిటి. తల్లిలా కనిపించరా అంటూ వినబడిన కామెంట్ చూసి కరీనా కపూర్ ఎవరైన ఏది సౌకర్యమో అది ధరిస్తారు మదర్ డ్రెస్ వేసుకోవడం ఎంటో అర్ధం కావడం లేదు. మా అమ్మ బబితా మా అత్త షర్మిలా టాగూర్ అయినా చక్కని మోడ్రన్ డ్రెస్ లే ధరిస్తారు. మాకు ఏది నచ్చిందో అది ధరించే స్వతత్ర్యం ఉన్న ఇళ్ళ నుంచి వచ్చాను. నేను ఒక పిల్లాడికి తల్లి అయితే షార్ట్ లు వేసుకోకూడదా. నాకు నమ్మకం ఉండి సౌకర్యం అనుకుంటే ఎలాంటి డ్రెస్ అయినా వేసుకోవచ్చు అనుకుంటాను, వేసుకుంటాను కూడా అంటుంది కరీనా కపూర్. ఆ మాత్రం స్వేచ్చ అందరికి ఉంటుంది కదా.

Leave a Reply