Tuesday, 21 Jul, 2026
పెండ్లి నిస్చియం అయ్యాక సామంత ఎప్పుడూ వార్తల్లోనే వుంటుంది. ప్రస్తుతం రాజుగారి గది-2 లో నటిస్తోంది. ఏడాది నుంచి కొత్తగా సినిమాలు ఎం చేయలేదు. కానీ సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా వుంటుంది. తన అనుభవాల్ని, ఆలోచనల్ని పంచుకోవడంలో చాలా బోల్డ్ గా వుంటుంది. తన కెరీర్ లో ఇంత విరామం తీసుకోవడం ఇదే తొలిసారని, అయినా తనేం ఖాలీగా లేనని చెపుతుంది సామంత. చేతిలో పనేం లేకపోతె నాకు పిచ్చెక్కుతుంది. షూటింగ్ లో ఒక్క రోజు విరామం వున్న ఎలా సద్వినియోగం చేయాలా అని ఆలోచించేదాన్ని. ఇన్నాళ్ళ సుధీర్ఘ విరామం ఎప్పుడూ తీసుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సంవత్సరపు సమయాన్ని నా మానసిక ఆనందం కోసం వెచ్చించాను. నా గురించి లోతుగా అలోచించుకునేందుకు ఈ సమయం తోడ్పడింది. సినిమాల బిజీలో ఎం పోగొట్టుకొన్నాను అదంతా సంపాదించుకొనే వీలు కలిగింది. ఇలా అప్పుడప్పుడు మనలోకి, మన కోసం మనం ప్రయాణం చేయడం చాలా అవసరం అంది సామంత. నిజమే ఇలాంటి బిజీ సెలబ్రెటీనోటి గుండా ఒక విరామంలో మన గురించి మనం ఆలోచించుకుని మన కోసం మనం సంతోష పడాలని వినవస్తే లాభమే. ఎక్స్ పర్ట్స్ కూడా ఇదే చెప్పారు. కాస్త విరామం తీసుకొమ్మని.

ఇవన్నీ మంచిరోజులు

స్టార్ అని ఎప్పుడైతే మనల్ని పిలవటం మొదలుపెడతారో ఇక జివీతంలో సవాళ్ళు ఎదురవుతాయి అంటుంది సమంత. త్వరలోనే ఆమె నటించిన రంగస్థలం రాబోతుంది. మొదట్ట్లో ఎవరు పట్టించుకోరు. స్టూడియోలో ఆదుతూ పాడుతూ పని చేస్తాం. ఒక స్థానంలోకి చేరాక మాత్రం ఇక శ్రద్దగా ఉండాలి.  ఒక్క తప్పు చేసినా ఒక్క పరాజయం ఎదురైనా వేలెత్తి చూపిస్తారు. స్ట్టార్ స్టేటస్ అంత అషామాషి వ్యవహారం ఐతే కాదు సినిమా ఒప్పుకుంటే కథ, కాస్ట్యూమ్స్ ప్రతి విషయం శ్రద్దగా పట్టించుకోవాలి. మొదట్లో నాకు చాలా టెన్షన్ అనిపించేది. కాని ఇప్పుడు అలవాటు అయిపోయింది.  నా కెరీర్ లో అత్యుత్తమమైన దశలో ఉన్నా ఇప్పుడు నా సినిమాల అన్నింటిలో నా పాత్ర ప్రత్యేకంగా నన్ను ఒక మెట్టు ఎక్కించేదిగానే ఉంది అంటుంది సమంత.

Leave a Reply