Monday, 21 Sep, 2026
ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో ఐశ్వర్య రాయి ని చుస్తే ఆమెకు 43 సంవత్సరాలంటే నమ్మాలనిపించదు. ఇవ్వాల్టికీ ఆమెను ప్రపంచ సుందరీ అనే పిలవచ్చు. అంత అందంగా వుంది. ఆమె ఎప్పుడూ ప్రత్యేకమే. పెప్సీ కి కోక్ కి నటించిన ఏకైక మహిళా మోడల్ ఐశ్వర్యనే. ఆమెకు ఆభరణాలంటే అస్సలు ఇష్టం ఉండదట. ఐశ్వర్య లాంటి బార్బీ డాల్స్ ను 2005 లో విడుదల చేస్తే మార్కెట్ లోకి వచ్చిన నిమిషాల్లో అమ్ముడైపోయాయట. కొత్తగా సినిమాల్లోకి వచ్చినప్పుడు డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చినా వద్దందిట ఐశ్వర్య. ఐశ్వర్య జార్జ్ బుష్ తో పాటు విందుకు రమ్మని అమీర్ ఖాన్ తో పాటు ఐశ్వర్య కి ఆహ్వానం అందినా ఎదో షూటింగ్ కోసం ఆ అవకాశం వదులుకొందిట. ఓప్రా విన్ ఫ్రె షో లో పాల్గొన్న తోలి భారతీయ ప్రముఖురాలు ఐశ్వర్య. మేడమ్ టుస్సాట్స్ మ్యూజియం లో స్థానం సంపాదించినా తొలిభారతీయ నటి ఐశ్వర్య ఇంత అందాల బొమ్మ నటిస్తే ఏ దిల్ హై ముష్కిల్ బాక్సాఫీస్ బద్దలు కొడితే ఆశ్చర్యం ఏముంది?

ఫస్ట్ లేడీ ఐశ్వర్యా.

టేలెంట్ వుండాలే కానీ అవార్డులు వెతూకుంటు వస్తాయి.ప్రపంచ సుందరి అందాల ఐశ్వర్యరాయ్ ఫస్ట్ లేడీ పురస్కారం అందుకుంది. వివిధ రంగాల్లో సక్సెస్ సాధించిన మహిళలకు ప్రతి సంవత్సరం ఈ అవార్డ్ లు ఇస్తుంటారు.అలాగే 20 సంవత్సరలుగా సినిరంగానికి చేసినా సేవలకు గాను ఐశ్వర్యరాయ్ కి ఈ అవార్డ్ వచ్చింది.భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఈ అవార్డ్ ని అందజేసారు. చిన్న వయసులో పైలట్ అయిన అయేషా అజిజ్ కశ్మీర్ కి చేందిన తొలి మహిళా ఐ.పీ.స్ అధికారి ని రువేద సలామ్ లలో తో పాటు మరో 113 మందికి ఈ ఫస్ట్ లేడీ పురస్కారాలు అందించారు.

Leave a Reply