Wednesday, 05 Aug, 2026

ఓవర్ సైజ్ ఫ్యాషన్  

ఓవర్ సైజ్ బ్లేజర్స్ ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అలియా భట్ ప్రియాంక చోప్రా వంటి తారలు ధరించే ఈ ఓవర్ సైజ్ డ్రెస్ ల్లో లాంగ్ స్కర్ట్, ట్రౌజర్స్ ఈవినింగ్ గౌన్లు ఓవర్ సైజ్ బ్లేజర్స్ తో జత చేయడం కొత్త ట్రెండ్. అటు ఆఫీస్ వేర్ గా, ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌ గా మహిళలు ఇష్టపడుతున్న ఈ డ్రెస్ లను ననుష్క,ఎంపోరియో అర్మానీ,కామె డెన్ గార్కన్స్ వంటి ప్రముఖ కంపెనీలు తయారు చేస్తున్నాయి హై హీల్స్ చేతిలో […]

ముత్యాల జాకెట్లు

ఏదైనా వేడుకల్లో ప్రత్యేకంగా కనిపించాలి అంటే ముత్యాల ఎంబ్రాయిడరీ జాకెట్లు ఎంచుకోండి అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. కుందన్లు, అద్దాలు, జర్దోసి అల్లికలు కాసుల బిళ్ళలు నగల నగిషీలతో ఎంబ్రాయిడరీ బ్లౌజులు కు బ్లవుజు చక్కగా ముస్తాబయింది ఈ పెరల్ ఎంబ్రాయిడరీ బ్లవుజులు రెడీమేడ్ గా కూడా దొరుకుతున్నాయి. రకరకాల ఆకారాల్లో ముత్యాలు ఎంచుకొని చక్కని ఎంబ్రాయిడరీ పనితో జాకెట్లు నయా ట్రెండ్.

తొలి రోబో టీచర్

రోబో టీచర్ ఐరిస్ అస్సాం గుహవాటి లోని ఒక ప్రైవేట్ స్కూల్లో పాఠాలు చెప్పింది.నీతి ఆయోగ్ ప్రారంభించిన అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్ట్ కింద మేకర్స్ ల్యాబ్ ఎడ్యుటెక్ సహకారంతో ఈ రోబోను తయారు చేశారు. సాంప్రదాయ దుస్తులైన ‘మేఖేలా చాదర్’ ధరించి, మెడలో ఆభరణాలతో పిల్లలు పిల్లల ప్రశ్నలకు సమాధానాలు ఉదాహరణలతో సహా చెప్పి పిల్లల్లో ఆసక్తి రేకెత్తించింది టీచర్. ఈశాన్య భారతదేశంలో తొలి ఎ ఐ ఉపాధ్యాయురాలుగా నిలిచింది ఐరిస్ రోబో.

నెయిల్ జ్యువెలరీ ట్రెండ్

ప్రాచీన చైనా,ఈజిప్ట్ రాణులు ఇష్టంగా ధరించే నెయిల్ క్లాసికల్ జ్యువెలరీ ఆధునికమైన రూపంలో మార్కెట్లోకి వచ్చింది. బంగారం వెండి ఇతర లోహాల తో ఈ జ్యువెలరీ సంప్రదాయం, ఆధునికతల కలబోతగా కనిపిస్తోంది. లోహపు డిజైన్లతో ముత్యాలు, రత్నాలు, ఎనామిల్ వంటివి జతచేసిన డిజైన్లు ఎంపిక.ఇప్పుడు అలంకార జాబితాలో పై ఎత్తున ఉంది.

మెకానికల్ ఏనుగు మహాదేవ

నటి ప్రియమణి పెటా తో కలిసి కుర్చీలోనే త్రిక్కయిల్ మహాదేవ గుడికి మెకానికల్ ఏనుగు మహాదేవ ను బహుకరించారు. కేరళ లో జరిగే ఎన్నో ఉత్సవాలలో ఏనుగులు పాల్గొంటాయి. వాటిని మాట వినేలా చేసేందుకు మావటి తో వాటిని ఇనుప చువ్వలతో గుచ్చటం తిండి పెట్టకుండా మాడ్చటం వంటి శిక్షలతో అదుపు చేస్తారు ఈ హింస నుంచి ఏనుగులను రక్షించేందుకు ఈ మెకానికల్ ఏనుగు ను బహుకరించింది ప్రియమణి.మూగజీవాలను హింసించకుండా సాంకేతికత సాయంతో సంస్కృతి సంప్రదాయాలు ముందుకు […]

బాల్కనీకే అందం

లేత ఆకుపచ్చ రంగు ఆకులతో హృదయాకారపు పూలతో ఆసియా బ్లీడింగ్ హార్ట్ మొక్కలు బాల్కనీలో పెంచుకోవచ్చు అధిక వేడికి తట్టుకుంటాయి.అలాగే నీడ లోను పెరుగుతాయి.కుండీల్లో ఈ మొక్కలు పెంచుకోవాలంటే అందులో నింపే మట్టిలో వర్మి కంపోస్ట్, పశువుల పేడ కలిపి నింపుకుంటే బలంగా ఎదుగుతాయి .ఒక్క కొమ్మకు డజన్ పైగా పువ్వులు పూస్తాయి. ఇవి ఎరుపు గులాబీ పసుపు తెలుపు వైలెట్ కాంబినేషన్ లో ఎక్కువగా కనిపిస్తాయి.ఈ మొక్కలకు కాల్షియం అవసరం ఎక్కువ నేలపైన నాటినా తగిన […]

ఉత్తమ ప్రచారకర్త

దక్షిణాఫ్రికా లోని మారుమూల గ్రామంలో పుట్టిన మూడేళ్ల లేతుకుఖాన్య మ్జాజీ అల్బానీ బ్రెడ్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ అయింది.అమ్మ వద్దన్నా ఏడ్చి మరీ బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కునే పాప మొహంలో ఆనందం చూసి ఆమె మామ లుంగీసా జాజి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.గంటల్లో ఆ ఫోటో వైరల్ అయ్యి ఇంత ఆనందించే పాపను మీ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోమని లక్షలమంది ట్రీట్ చేశారు దాంతో ఆ కంపెనీ వాళ్ళు ఇంతకుముందు […]

అందంగా గోళ్ళు

నెయిల్ ఆర్ట్ డిజైన్స్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు అమ్మాయిలు. వేడుకల్లో, తగిన డ్రెస్ లు వేసుకున్నట్టుగా,నెయిల్స్  మ్యాచింగ్ పట్ల శ్రద్ధ చూపించినట్లుగా, నెయిల్స్ కూడా తీర్చిదిద్దు కుంటున్నారు. ఫ్రెండ్ షిప్ డే, ఇండిపెండెన్స్ డే, రక్షాబంధన్,కృష్ణాష్టమి ల వంటి వేడుకలకు నెయిల్ ఆర్ట్ డిజైన్లు చాలా ప్రత్యేకమైనవి సృష్టించారు.అందంగా ఉండాలి అనుకునే వాళ్ళు చేతులకు పెడిక్యూర్ చేయించుకునే సమయంలో గోళ్లు చక్కగా కట్ చేయించుకుని ప్రతిరోజు కొబ్బరి నూనె మర్దన చేసుకోవాలి. అవసరం అయితే ఆర్టిఫీషియల్ […]

ఇవాల్టి ట్రెండ్

ట్రెండీగా వెజ్ ఫర్నిచర్ మార్కెట్ లోకి వచ్చేసింది. చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో రూమ్స్ లో ప్రీ స్కూల్స్ కోసం ఈ వెజ్ ఫర్నిచర్ ప్రత్యేకంగా రూపొందించారు చూసేందుకు వెరైటీగా కూర్చునేందుకు నిద్రపోయేందుకు సౌకర్యంగా సీతాఫలం, పుచ్చకాయ, కర్బూజ, పైన ఆపిల్, ఆరెంజ్, షేపుల్లో ఈ ఫర్నిచర్ కలర్ ఫుల్ గా ఆకర్షించేలాగా ఉన్నాయి. అరటి, ఆపిల్, కొబ్బరి, వంకాయ, సోఫాలు పిల్లల్ని ఆకర్షించే లాగా ఉన్నాయి.

ట్రెండీ ఇయర్ రింగ్స్

ఫ్యాషన్ అంటే ధరించే దుస్తులే కాదు నగలు ట్రెండీగా ఉండాలి. స్టైలిష్ గా ట్రెండీగా ఉండటం కోసం అమ్మాయిలు ఫుడ్ ఇయర్ రింగ్స్ ఇష్టపడుతున్నారు. బిస్కెట్లు, వైన్ కుకీస్, లాలిపాప్, బర్గర్, పీస్ క్రీమ్, ఆమ్లెట్లు అన్ని రకాల తిండి పదార్థాలు స్టైలిష్ ఇయర్ రింగ్స్ గా  అందుబాటులో కొచ్చాయి. గమ్మత్తైన ఫుడ్ ఫ్యాషన్ కాంబో ఇప్పుడు చాలా క్రేజీ.

పేషెంట్లకు అన్నం పొట్లం

కేరళ లోని డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డి.వై.ఎఫ్.ఐ) హృదయపూర్వం పేరుతో ఇంటింటి నుంచి అన్నం పొట్లాలు సేకరించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండే రోగులకు వారిని కనిపెట్టుకొని ఉండే బంధువులకు ఇస్తారు. కేరళలోని చాలా ఇళ్లలో ఇల్లాలు ఈ భోజనం పొట్లాలు ఇస్తారు. 300 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇవాళ 40000 మంది దాతలతో ఈ అన్నదానం కొనసాగుతోంది.

ఇన్ స్టెంట్ చీరెలు

ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్ని స్టైల్స్ వచ్చినా చీర కట్టుకున్న స్థానం ఎప్పటికీ పోదు. చీర కట్టు అనుకున్నంత సులువు కాదనే ఉద్దేశ్యం తో  ఫ్యాషన్ డిజైనర్స్ ఇన్ స్టెంట్ శారీలను సృష్టించారు. దోతి, స్కర్ట్, పలాజో, జంప్ సూట్ మోడల్స్ తో సిల్క్ కాటన్ జార్జెట్ ఎంబ్రాయిడరీల ఫ్యాబ్రిక్స్ తో ఈ వన్ మినిట్ శారీస్ వచ్చేసాయి ఇవి వేసుకునే చీరలు. ఇతర డ్రెస్సులు మాదిరే వీటిని ధరించే వీలు ఉండటంతో ఇవి ఈ రోజుల్లో ట్రెండ్ […]

పెళ్ళికి గౌరవం

పోస్టల్ శాఖ తాజాగా పెళ్లికూతుళ్ళ బొమ్మలతో ప్రత్యేక పోస్టల్ స్టాంప్ లు విడుదల చేసింది. ఆయా రాష్ట్రాల లోని వివాహ సంప్రదాయాలు యావత్ దేశానికి చాటి చెప్పాలని ఉద్దేశ్యం తో పోస్టల్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. పెళ్లి కూతురి కట్టు బొట్టు ఆభరణాలు ఇతర అలంకారణాలతో ఆ సంప్రదాయం ఏ రాష్ట్రానికి సంబంధించినదో స్టాంప్ పైన ముద్రించింది. పంజాబ్, తమిళనాడు, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కేరళ రాష్ట్రాల స్టాంప్ లు ఇప్పుడు విడుదలయ్యాయి మిగతా రాష్ట్రాల […]

డాన్సింగ్ డాల్స్

కూచిపూడి భరతనాట్య భంగిమలతో సరికొత్త ఇయర్ రింగ్స్ వచ్చాయి.డాన్సింగ్ డాల్స్ ఇయర్ రింగ్స్ లేటెస్ట్ ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు. సంప్రదాయ ఆధునిక దుస్తులకు కూడా మ్యాచ్ అవ్వటంతో ఇప్పుడు ఇవి అమ్మాయిల క్రేజీ నగలైపోయాయి. చెవుల పైన నర్తిస్తూ ఈ లోలాకులు ఫ్యాషన్ ప్రపంచంలో సరికొత్త మాయాజాలం సృష్టించాయి. జువెలరీ డిజైనర్లు పచ్చలు, కెంపులు, వజ్రాలు ముత్యాల తో ఈ డాన్సింగ్ డాల్స్ అందంగా చెక్కేస్తున్నారు.

సూర్యరథం

ఒరిస్సా లో కోణార్క్ సూర్య దేవాలయాన్ని బ్లాక్ పగోడా గా పిలుస్తారు. తూర్పు చాళుక్య రాజు మొదటి నరసింహ దేవుడు ఈ ఆలయాన్ని కీ.శ  1250 లో నిర్మించారు కలింగ వాస్తు శిల్ప ప్రకారం నిర్మించిన ఈ దేవాలయం ఓ రథం ఆకారంలో 24 చక్రాలు ఏడు గుర్రాలు లాగుతున్నట్లు నిర్మించారు. 100 అడుగుల ఎత్తైన ఈ రాతిరథం 1984 లో యునెస్కో వారసత్వ గుర్తింపు పొందింది సంవత్సరానికి ఆరు కోట్ల 50 లక్షల మంది టూరిస్ట్ […]

కన్నీటి ఉప్పెన

బలగం సినిమాలో తోడుగా మా తోడుండి పాట పాడిన కొమరమ్మ బుడగ జంగాల గాయకురాలు.భర్త మొగిలయ్యతో తో కలిసి తంబురా దిమ్మెస వాయిస్తూ పాటలు పాడుతోంది.చావులు,దినాలకు ప్రత్యేక పాటలు పాడే కొమరమ్మ పాట తెలుగు ప్రేక్షకులను కదిలించి కంటి తడి పెట్టించింది.కుటుంబ అనుబంధాలు విలువలు గుర్తుతెచ్చే పాటలను అప్పటికప్పుడు కూర్చి పాడుతుంది కొమరమ్మ.

అత్యంత ఖరీదు

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫర్ ఫ్యూమ్ షుముఖ్ ధర 9.3 కోట్లు 2019లో దుబాయ్ లో నబిల్ ఫర్ ఫ్యూమ్ అనే సంస్థ విడుదల చేసింది. చందనం, ఇండియన్ అండర్ వుడ్ అంబర్ టర్కిష్ రోజ్ ఆయిల్ వంటి సుఖంధ ద్రవ్యాలతో దీన్ని తయారు చేశారు. ఇంత ఖరీదుకు కారణం దీని ప్యాకింగ్ 3500 డైమండ్స్ ముత్యాలు రెండున్నర కిలోల 18 క్యారెట్ల బంగారం 5.9 కిలోల వెండితో తయారు చేసిన ప్యాకింగ్ తో ఈ ఫర్ […]

పాకే పువ్వులు

హటాత్తుగా చూస్తే అచ్చం పూవుల లగే ఉంటాయి. కానీ కదులుతుంటే అవి కీటకాలు అని అర్ధం అవుతుంది. దక్షిణ తూర్పు ,ఆసియా దేశాల్లో ముఖ్యంగా ఇండోనేషియా మలేషియా వర్షా రణ్యాల్లో కనిపించే ఫ్లవర్ మ్యాంటిస్ లేదా ఆర్కిడ్ మ్యాంటిస్ లు అచ్చం పువ్వులే వీటి కాళ్ళు కూడా పూల రేకుల్లాగే ఉంటాయి. పులా మధ్యలో వాలితే అస్సలు కనుక్కోవడం కష్టం పైగా ఇవి తామున్న తోటలో ఉండే పువ్వుల రంగులోకి ముదురు,లేత రంగుల్లోకి మారిపోతాయట ఈ విచిత్రమైన […]

ఈ ఇద్దరు ప్రత్యేకం

డాక్టర్ రూత్ జాన్ పాల్ డాక్టర్ ప్రాచీ రాథోడ్ తెలంగాణలో ప్రభుత్వ వైద్యులు గా నియమితులైన మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ లుగా చరిత్ర సృష్టించారు హైద్రాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రిలో యాంటీ రెట్రో వైరల్ థెరపీ ( ఎ ఆర్టీ )లో మెడికల్ ఆఫీసర్స్ గా పని చేస్తున్నారు.

అందంగా నెయిల్ ఆర్ట్

అందమైన చీరకు సరిగ్గా మ్యాచ్ అయ్యేలా థీమ్ ఆర్ట్ ను నెయిల్స్ పై ఎంచుకుంటున్నారు అమ్మాయిలు. బ్యూటీ కాన్సెప్ట్ లో గోళ్లకు  ప్రాధాన్యత పెరిగింది. సొంత గోళ్లకు సూట్ అయ్యే ఆర్టిఫిషియల్ గోళ్లు ఎంచుకొని వాటిపైన చక్కని ఆర్ట్ వర్క్ చేస్తున్నారు. మెరిసే పొడుగాటి గోళ్ళ పైన నెయిల్ రింగ్స్ ఫాన్సీ స్టడ్స్ మంచి లుక్ ఇస్తాయి. స్వరోస్కి స్టోన్స్ కూడా డిజైన్ లో భాగం అవుతున్నాయి.ఆర్టిఫీషియల్ నెయిల్స్ జెల్ తో గోళ్ళకు అటాచ్ చేసుకోవచ్చు వాటి […]