Wednesday, 05 Aug, 2026

డాన్సింగ్ ట్రీస్

ప్రకృతి మనిషిని ఎప్పటికప్పుడు కొత్తగా ఆశ్చర్యపోయేలా చేస్తూనే ఉంది. ఇండోనేషియా లోని తూర్పు సుంభ ద్వీపం లోని వలికిరి తీరంలో మాడ అడవులు ఎంతో ప్రత్యేకం అక్కడి చెట్లన్నీ మరుగుజ్జు రకానికి పైగా ఏదో నాట్యం చేస్తూ ఆగిపోయినట్లు కనిపిస్తాయి. అందుకే వీటిని డాన్సింగ్ ట్రీస్ అంటారు. సూర్య అస్తమయం సమయం లో సముద్రం వెనక్కి తగ్గుతుంది. నేలంతా తెల్లని మెరిసే ఇసుక దానిపైన ఈ నర్తించే చెట్లు వాటి నీడలో ప్రకృతి తీర్చిదిద్దిన ఈ సుందరమైన […]

నచ్చిన ప్రింట్ రెడీ

ఇష్టమైన క్లాత్ పైన నచ్చిన రంగుల్లో మెచ్చిన ప్రింట్ వేయించుకొని డ్రెస్ కుట్టించుకోవాలనుకొంటే వెంటనే ఫ్యాబ్ క్యూరటే (Fabcurrate) యాప్ ఓపెన్ చేయాలి గుజరాతీ లోని సూరత్ కు చెందిన ఒక దుస్తుల సంస్థ ఏర్పాటు చేసిన ఈ యాప్ లో ఏ రంగు వస్త్రం కావాలో ఎంచుకొని వందలాది డిజైన్ లతో ప్రింట్స్ ఎంచుకొని ఆర్డర్ ఇస్తే ఆలా రెడీ చేసి ఇస్తారు. ఎలాంటి వస్త్రశ్రేణి అయిన ఎంచుకోవచ్చు మీటర్ కు 250 నుంచి 1700 […]

కాగితపు బొమ్మలు

రంగులు కుంచెలతోనే కాదు పేపర్లతో కూడా కళాకృతులు చేయవచ్చని నిరూపించాడు బ్రిటన్ కు చెందిన 47 ఏళ్ల బెక్ స్టోన్ ఫాక్స్ ఈ ఆర్టిస్ట్ క్విల్లింగ్ టెక్నిక్ తో రూపొందించిన కాగితపు బొమ్మలు. వాస్తవికత ఉట్టిపడుతూ కళా ప్రియులను మంత్రముగ్ధులను చేశాయి. కుక్క, గొరిల్లా, పిల్లి,పక్షి వంటి రకరకాల జీవులను కాగితాలను మలిచి బొమ్మలు గా తయారు చేస్తారు ఫాక్స్.

టీ పాట్ మ్యూజియం  

భావన నిర్మాణాల్లో ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు ఇంజనీర్లు చైనా లోని మీటాన్ కౌంటీ లో ఉన్న టీ పాట్ మ్యూజియం ఇంజినీరింగ్ అద్భుతం. ఈ భవనానికి ప్రపంచంలోనే అతిపెద్ద టీ పాట్ షేప్ బిల్డింగ్ గా గుర్తింపు ఉంది. భవనం ఎత్తు 73 మీటర్లు. చైనీస్ గ్రీన్ టీ కి మీటాన్ కౌంటీ పుట్టిల్లు అంటారు. అందుకే ఇక్కడ టీ పాట్ మ్యూజియం కట్టారు. జగ్గు ముందున్న కప్పు కూడా ఇంకో చక్కని భవనం.

మానవ శిఖరాలు 

కృష్ణాష్టమికి ఉట్టి కొట్టే వేడుక లాంటిదే స్పెయిన్ లో క్యాస్టిల్ పేరుతో జరుపుకొంటారు. కటాలోనియా నగరం లో జరిగే ఈ ఉత్సవానికి 15 వేల మందికి అంచెలంచెలుగా వలయాలుగా ఏర్పడుతూ పైకి ఎగబాకుతారు. ఈ క్యాస్టిల్ నిర్మించే వంద గ్రూప్ లు ఈ నగరంలోనే ఉన్నాయి. వివిధ జట్లు కలిసి 40 అడుగులు ఎత్తు వరకు మానవ శిఖరాలు నిర్మిస్తారు. పోటీల్లో అతి ఎత్తయిన మానవ శిఖరానికి బహుమతులు ఇస్తారు.

ఫెయిరీ టేల్ క్యాజిల్

అద్భుతమైన కోట వంటి హోటల్ ఒకటి చైనాలో ఉంది కధల్లో వర్ణించే అందమైన రాజమహల్ లాగా ఉండే ఈ హోటల్ పేరు ఫెయిరీ టేల్ క్యాజిల్ 2011 లో కొండల మధ్య వంతెనలను కలుపుతూ కట్టిన ఈ కోట వంటి హోటల్ లో బస చేసేందుకు బారులు తీరుతారు అచ్చం రాజు రాణీల్లాగా జీవించే లాగా ఇక్కడ ఏర్పాట్లన్నీ ఉంటాయి.

ట్రీ లైబ్రరీ

ట్రీ లైబ్రరీ ని సృష్టించారు ఆలీపూర్ దౌర్ మహిళలు మరియాని గర్ల్స్ హైస్కూల్ ప్రాంగణంలో ఉన్న చెట్టుకు బాక్స్ లు అమర్చి వాటిలో దిన పత్రికలు మ్యాగజైన్ లు పుస్తకాలు పెట్టారు. ఈ లైబ్రరీ అందరికీ నచ్చింది. ఈ లైబ్రరీ పశ్చిమ బెంగాల్ లోని ఆలీపూర్ దౌర్ యూరోపియన్ క్లబ్ గ్రౌండ్ లో ఉంది. అస్సాం లోని జోర్వాత్ జిల్లా కు చెందిన మహిళలు ఒక బృందంగా ఏర్పడి సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు. వారి ఆలోచనల్లోంచి […]

కోహినూర్ 

కోహినూర్ వజ్రం మన దేశం లోనే కృష్ణాతీరంలో దొరికింది అంటారు చరిత్రకారులు. దాన్ని మొదట్లో శమంతకమని అని అన్నారు. 11 వ శతాబ్దంలో పర్షియన్ భాష లో కోహినూర్ అంటే కాంతి శిఖరం అనే అర్థం వచ్చేలా పేరు పెట్టారు. ఆ కాలానికి ప్రపంచంలో అతి పెద్ద వజ్రం అదే 1849 లో ఈస్టిండియా కంపెనీ దాన్ని సొంతం చేసుకొని 1851లో బ్రిటిష్ రాణి కి బహూకరించారు. అప్పటికి అది 186 క్యారెట్ల వజ్రం. మరో రెండు […]

ఆభరణాలల్లో వంశీ మోహనుడు

దేవతామూర్తుల ఆభరణాలలో రాధాకృష్ణల రూపం, వేణుమాధవుడు ధరించే ప్రతి ఆభరణం చూడగానే ముచ్చటగా ఉంటాయి కృష్ణుని  సౌందర్యం అంతా ధరించే నెమలి లోనే ఉంటుంది. ఆభరణాలు డిజైన్ లలో ఈ కృష్ణుడు పింఛం మురళి ఇవన్నీ చక్కగా కనిపిస్తాయి. రంగు రంగుల దారాల ముళ్ళతో గవ్వలు మువ్వలు జత చేసిన ఆహారం లో కృష్ణుని రూపం ఎంతో మనోహరం. జతగా నెమలి పించాన్ని చెవిపోగులుంటే ట్రెడిషనల్ లుక్ ఇట్టే వచ్చేస్తుంది. వెండి, బంగారు ఆభరణాలలో కృష్ణుని రూపం […]

శ్రేయాస్ హేంగవుట్

యాసిడ్ సర్వైవర్స్ నడిపే శ్రేయాస్ హ్యాంగవుట్ ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో లో ఉంది దేశవ్యాప్తంగా ఎంతో మంది బాధితులకు స్ఫూర్తి శ్రేయాస్ హ్యాంగవుట్ ఇప్పుడు ప్రముఖ బ్యూటీ సెలూన్ నేచురల్స్ తో కలిసి యాసిడ్ బాధిత మహిళలకు ప్రొఫెషనల్ బ్యూటీ కోర్స్ లలో ఉచిత శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వారు సొంతంగా బ్యూటీ పార్లర్ పెట్టుకునేందుకు అవసరమైన సహాయాన్ని కూడా చేస్తారు. శ్రేయాస్ చేస్తున్న ఈ ప్రయత్నం యాసిడ్ బాధితుల్లో అలంకరణ, అందం మనకు […]

ఎడారిలో స్టార్ హోటల్

ప్రపంచంలోని వింతల్లో చైనా లోని జోంగ్ ప్రాంతంలో ఉన్న డెజర్ట్ స్టార్ హోటల్ ఒకటి. ఈ హోటల్ ఎడారిలో ఉంది. బయట ఎర్రని ఎండ చుట్టూ ఇసుక తెన్నులు నర మానవుడు కనిపించని ఎడారి. ఈ అద్భుతమైన లొకేషన్ లో జీవితకాలపు అనుభవాలు మూట కట్టుకోవచ్చు అంటారు సందర్శకులు. ఎంతో ఖరీదైన ఈ హోటల్లో పూర్తి అద్దాలతో నిర్మాణం చేసిన హోటల్ గదులు ఎన్నో ఆధునిక వసతులు స్విమ్మింగ్ ఫూల్ రాత్రి పగలు మెరిసిపోయే దీపాల కాంతులతో […]

ఇద్దరూ ఒకేసారి

తల్లి కొడుకు ఒకేసారి ప్రభుత్వోద్యోగులు అయ్యారు. ఒకేసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశారు. మలప్పురం ఇర్కోడ్ అనే ఊర్లో ని తల్లీకొడుకులు బిందు, వివేక్ ఇప్పుడు న్యూస్ మేకర్స్. తల్లి బిందు చాలాకాలంగా అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తోంది. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని ఆమె కోరిక. డిగ్రీ చదివిన వివేక ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాడు ఇద్దరూ కలిసి కోచింగ్ లో చేరారు. తల్లి బిందు లాస్ట్ గ్రేడ్ సర్వెంట్ విభాగంలో 92 వ ర్యాంక్ సాధిస్తే […]

ఎంతో హాయి

థాయిలాండ్ మసాజ్ లకు పెట్టింది పేరు అక్కడి పర్యాటక కేంద్రం చయాంగ్ మాయ్ ప్రాంతంలో ఉన్న ఎలిఫెంట్ నేచర్ పార్క్ లో ఏనుగులు ఫిజియోథెరపీ చేస్తాయి. హాధ్ మసాజ్ పేరుతో ఈ మర్దన చాలా ఫేమస్. ఫిజియోథెరపీ నిపుణులు చేత శిక్షణ ఇప్పించి వారి ఆధ్వర్యంలో పర్యాటకులకు ఏనుగులు మర్దన చేస్తాయి. భారీ బరువుండే ఏనుగులు సున్నితంగా తట్టేలా వీటికి నిపుణులు శిక్షణ ఇస్తారు. దీనితో ఎటువంటి హాని చేయకుండా ఏనుగులు మసాజ్ చేస్తున్నాయి.

సుశీల దేవి లిక్మాబమ్  

కామన్ వెల్త్  క్రీడలలో సుశీల దేవి లిక్మాబమ్ రజత పతకం సాధించింది. 48 కేజీల జూడో ఫైనల్స్ లో రెండో స్థానంలో నిలిచింది మేరీకోమ్ పుట్టిన మణిపూర్ లోనే సుశీలాదేవి జన్మించారు. తల్లి చావోచి, తండ్రి మనిహర్.  ఇంపాల్ లోని స్పోర్ట్ అత్తారింటి ఆఫ్ ఇండియా ప్రాక్టీస్ మొదలు పెట్టిన సుశీల పటియాలా లోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు మారింది. 2008 లో జూనియర్ నేషనల్ ఛాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ గెలుచుకొని […]

బోల్ట్ పోయెట్రీ

కళాకారుల దృష్టిలో ప్రతి వస్తువు కళాత్మకమే బస్లోకు చెందిన ఆర్టిస్ట్ టోబ్బే మాల్మ్ బోల్ట్ లతో వ్యక్తుల ఆకారాలను ఊహించాడు. కమ్మరి, ఫోటోగ్రాఫర్ అయినా మాల్మ్ తన కళకు బోల్ట్ పోయెట్రీ అని పేరు పెట్టాడు. అతను సృష్టించిన బొమ్మలు అపురూపంగా అద్భుతంగా ఉన్నాయి. అన్ని బోల్ట్ లు ఈ మేకులతో ఇద్దరు కుర్చీలో కూర్చుని మాట్లాడుకుంటున్నట్లు కార్మికులు బండి లాగుతున్నట్లు దిగులుగా కూర్చున్న వ్యక్తి పిల్లని ఎత్తుకున్న బొమ్మ బందీగా సంఖ్యలతో ఉన్న వ్యక్తి ఎంతో […]

ఫస్ట్ కపుల్ టు వాక్ అరౌండ్ ఇండియా

బెన్నీ కొట్టారత్తిల్,అతని భార్య మాలి కొట్టరత్తిల్‌ తమ స్వస్థలం అయిన కేరళ కొట్టాయం నుంచి ఈ సుదీర్ఘ యాత్ర చేశారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ కు తిరిగి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కి మొత్తం 8,263 కిలోమీటర్లు నడిచారు. ఫస్ట్ కపుల్ టు వాక్ అరౌండ్ ఇండియా అనే రికార్డ్  సాధించారు ఈ కేరళ దంపతులు. మొత్తం 216 రోజుల యాత్ర లో చలికాలం,ఎండాకాలం చూశారు అమృత్ సర్, మురుడేశ్వర,  రిషికేశ్,బుద్ధగయ, వైష్ణోదేవి ఇవన్నీ కాళ్లతో నడుస్తూ […]

అభివృద్ధి సులభం

ఉత్తరప్రదేశ్ కాన్పూర్ దేహత్ జిల్లా లో అత్యున్నత స్థాయి అధికారులంతా మహిళలే జిల్లా కలెక్టర్ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ చీఫ్ మెడికల్ సూపర్డెంట్ తాసిల్దార్ వరకు 17 కీలక పదవుల్లో మహిళలే ఉన్నారు. తాజాగా జిల్లా ఎస్పీగా సునీతి పగ్గాలు చేపట్టడం తో ఆ సంఖ్య 18 కి చేరింది. మేమంతా మహిళలం కనుక మా ఆలోచనా రీతి ఒకే తీరుగా ఉంటుంది. అభివృద్ధి దిశగా ఆలోచించడం అమలు చేయటం సులువుగా అవుతుంది అంటారు కలెక్టర్ నేహ […]

చర్మం మెరుపు

వయసుతో వచ్చే మడతలు పోగొట్టేందుకు స్కిన్ లిఫ్టింగ్ మైక్రో కరెంట్ బ్యూటీ మెషిన్ మార్కెట్ ల్లోకి వచ్చింది. న్యూ అప్ గ్రేడ్  టెక్నాలజీతో రూపొందించిన ఈ డివైజ్ 3.7 వోల్టేజ్ తో పని చేస్తుంది. ఈ యాంటీ రింకిల్స్ డివైజ్ క్రమం తప్పకుండా 28 రోజులు వాడితే మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు.స్కిన్ మాయిశ్చరైజింగ్ కోసం మెరుపు కోసం,మెరుపు కోసం ఫిట్ నెస్ కోసం దీని తో గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేసుకోవాలి. ఇలాంటి డివైజ్ లు […]

అందాల చిలుక

ఎరుపు పసుపు నీలం రంగుల కలయికతో ఎంతో అందమైన పెంపుడు చిలుక మకావ్ (Macaw)హోండురాస్ జాతీయ పక్షి కరేబియన్  సముద్ర తీరం లోని హోండురాస్ ఎంతో గౌరవంతో జాతీయ పక్షిగా ప్రకటించిన ఈ ప్యారెట్స్ కు ప్రపంచవ్యాప్త ప్రేమికులున్నారు. రకరకాల రంగుల్లో కనిపించే ఈ చిలుకలు కోస్టారికా తో పాటు మెక్సికో, పెరు, ఈక్వడార్, కొలంబియా, బొలీవియా, వెనిజులా, బ్రెజిల్ లోని దట్టమైన అడవుల్లో కనిపిస్తాయి. ఈ విదేశీ చిలుకలు పెంచుకొనే వారి సంఖ్య ఇప్పుడు మన […]

ఎడారి అందం

చిన్న చిన్న వేడుకలకు కానుకలుగా మొక్కలు ఇవ్వటం చాలా మందికి ఇష్టం ఇలాంటి గిఫ్ట్ లాగా ఇచ్చేందుకు సక్యులెంట్ల ఫ్లవర్ వాజ్ ఆకారంలో వచ్చేలా పెంచుతున్నారు. ఇప్పుడు పెద్దగా పువ్వులు పూయగానే ఈ ఎడారి మొక్కలు డ్రాయింగ్ రూమ్ కి చాలా అందం కుండీలో ముందుగా ఎరువు మట్టి వేసి దాని మధ్యలో ఇంకో ఒక కప్పులో సక్యులెంట్ల లను ఒక పద్ధతి ప్రకారం నాటుతారు గులకరాళ్లు ఇతర కొమ్మలతో అలంకరించిన ఈ ఎడారి మొక్కల ప్రేమికులకు […]