Chinna Maata
రాత్రి వేళల్లో బెస్ట్
స్క్రబ్బింగ్ ఎప్పుడు రాత్రివేళలో చేయడం మంచిది. రాత్రి సమయంలో చర్మంలోని మృతకణాలు వాటంతటవే మరమ్మతులు అవుతాయి. అంచేత నిద్రపోయే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి పొడి చర్మం అయితే క్రీమ్ స్క్రబ్ ని సున్నితమైన చర్మం ఉంటే తేలికైన చిన్న చిన్న బిడ్స్ లేని స్క్రబ్బర్ ను జిడ్డు చర్మం అయితే జెల్ స్క్రబ్ ను ఉపయోగించాలి. ముఖానికి నెమ్మదిగా మసాజ్ చేయాలి తరువాత గోరువెచ్చని నీళ్లతో ముఖం కడుక్కుని మాయిశ్చరైజర్ రాసుకుంటే ఉదయానికి […]
The social dilemma (డాక్యుమెంటరీ)
ఈ డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ లో ఈ మధ్యనే రిలీజ్ చేశారు మనల్ని కనక్ట్ చేస్తున్న టెక్నాలజీ మనల్ని ఎలా కంట్రోల్ చేస్తుందో అలాగే మనకు తెలియకుండా టెక్నాలజీ ట్రాప్ లో ఎలా పడుతున్నామో చక్కగా చూపెట్టారు.మనం ఫేస్ బుక్ లో ఏం చూస్తున్నామో ఎంతసేపు చూస్తున్నామో ఎలాంటి సీక్వెల్ మెథడ్ లో చూస్తున్నామో పోస్ట్ లు ఫోటోలు ఎలా ఉంటున్నాయో కామెంట్స్ అన్న టెక్నాలజీ (Machine learning) గమనిస్తూనే ఉంటుంది మనల్ని ఒక పక్క ప్రణాళికలో […]
చర్మ కాంతికి ఫ్రూట్ ప్యాక్స్
రోజు పండు తినటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు అన్న సంగతి తెలిసిందే. కానీ కొన్ని రకాల పండ్లు ఆరోగ్యంతో పాటు అందాన్ని రెట్టింపు చేస్తాయి తక్కువ సమయంలో ఈ పండ్లతో వేసుకొనే ఫేస్ ప్యాక్ లో ముఖాన్ని మెరిపిస్తాయి.అవకాడో కివీ మొదలైనవి విదేశీ పండ్లు అయినా మనకు విరివిగా దొరుకుతూనే ఉన్నాయి.వీటిని మెత్తగా గుజ్జులాగా చేసుకోవాలి.ఈ మిశ్రమానికి కొంచెం తేనె, పాలు, పెరుగు కలిపి మొహం,మెడకు ప్యాక్ లాగా వేసుకొంటే చాలు ఓ పావుగంట తర్వాత నీటితో […]
వర్క్ ఫ్రమ్ హోమ్ తో సమస్య
కరోనా మొదలయ్యాక చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవాళ్ళే.ఇది ముందు బాగానే ఉన్నా నిద్ర అలవాట్లను ఎంతో ప్రభావితం చేస్తోంది అంటున్నారు పరిశోధకులు. ఒక సారిగా జీవనశైలిలో వచ్చిన మార్పు వల్ల నిద్ర పైన ప్రభావం పడుతోంది.18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న వాళ్ల పైన చేసిన అధ్యయనంలో క్వారంటైన్ కు ముందు, క్వారంటైన్ పూర్తయిన నలభై రోజుల తర్వాత నిద్ర అలవాటు ను పరిశీలించారు. క్వారంటైన్ తర్వాత నిద్రపోయే సమయం చాలా తగ్గటం పరిశీలనలో […]
ఉన్న చోటే వ్యాయామం
కరోనా భయం తో వాకింగ్ కోసం,జాగింగ్ కోసం బయటికి వెళ్లి వ్యాయామం చేయాలన్న భయంగానే ఉంటుంది కనుక ఊపిరి తిత్తుల సామర్ధ్యాన్ని పెంచేవి వ్యాధినిరోధకతకు ఉపయోగపడే వ్యాయామాలు ఇంట్లోనే కూర్చొని,పడుకొనే చేయండి అంటున్నారు లైఫ్ స్టైల్ అండ్ వెల్ నెస్ ఎక్సపర్ట్స్. నిలబడే చేసే బెల్లీ బ్రీతింగ్ బోర్లాపడుకొని చేసే బ్రీతింగ్ స్ట్రెంటెనింగ్ ఎక్సర్ సైజెస్ చేయ మంటున్నారు. నిలుచున్న చోటే కదిలిస్తూ స్టాటిక్ వాకింగ్ చేయమంటున్నారు. ఆయాసం రానంత సేపు ఈ వ్యాయామం చేయాలి. ఊపిరి […]
పెంచటం చాలా తేలిక
పోషకాలు పుష్కలంగా ఉండే మైక్రో గ్రీన్స్ ఇంట్లో పెంచుకోవడం చాలా తేలిక ఇందుకోసం ఓ మోస్తారు ట్రే, కోకోపీట్ కొద్దిగా సేంద్రియ ఎరువు కావాల్సిన విత్తనాలు ఉంటే చాలు ఇంట్లో దొరికే ధనియాలు,మెంతులు,అవిసె, సోంపు వంటివి పెంచుకోవచ్చు ముందు రోజు విత్తనాలు నానబెట్టి మరుసటి రోజు చల్లుకుంటే త్వరగా మొలకెత్తుతాయి. వీటిని రెండు అంగుళాల ఎత్తు ఎదిగాక కత్తిరించుకుంటే సరిపోతుంది.మెగ్నీషియం, మాంగనీస్, ఇనుము వంటి సూక్ష్మ పోషకాలు అందాలంటే ఈ మైక్రో గ్రీన్స్ ని ఎక్కువ వేడి […]
నూనె లేకుంటేనే శ్రేష్టం
నూనెతో వండిన వంటకాలు రుచి గా ఉండే మాట వాస్తవమే అయినా ఆరోగ్యం కోసం నూనె తగ్గించి వండుకోమంటున్నారు పోషకాహార నిపుణులు ప్రస్తుతం కూరగాయల సలాడ్ గా తీసుకోవటం ఆరోగ్యం అంటారు.పచ్చిగా కాకుండా కొన్ని నిమిషాలు ఆవిరి తో ఉడికించి తీసుకుంటే రుచిగా ఉంటాయి.అలాగే నూనె లేకుండా వండాలనుకున్న కూరగాయల్ని కొంచెం చిన్న మంటపై వేగనిచ్చి చివర్లో రెండు స్పూన్ల నీటిని చిమ్మి మూతపెట్టాలి.చెక్కతో చేసిన గరిటతో తిప్పాలి.గిన్నె అడుగు మాడిపోకుండా నెమ్మదిగా ఉడుకుతుంది. రుచి తగ్గకుండా […]
ఇల్లంతా సువాసన
ఇప్పటి చల్లని వాతావరణంలో వర్షాల రోజుల్లో ఇంట్లోకి సరైన గాలి వెలుతురు రాదు.దుర్వాసన వస్తూ ఉంటుంది అలాంటప్పుడు రసాయనాలు ఉన్న రూమ్ ఫ్రెష్ నర్లు వాడేకంటే లెమన్ గ్రీన్, తులసి పుదీనా వంటి సహజమైన మొక్కలు పెంచడం ద్వారా గదిలో చక్కని సువాసనలు వస్తాయి. నీళ్లలో పుదీనా, తులసి ఆకుల్ని వేసి మరిగించాలి అందులో రెండు చుక్కల నిమ్మగడ్డి నూనె వేసి కలిపి ఆ నీళ్లను ఇల్లంతా స్ప్రే చేస్తే చక్కని సువాసన వస్తుంది.ఓ ప్లాస్టిక్ డబ్బాలో […]
ముఖానికి మెరుపు
బ్రౌన్ షుగర్ స్క్రబ్ గా,వాడితే చర్మం ప్రకాశవంతంగా అయిపోతుంది. బ్రౌన్ షుగర్ (ముడి చక్కెర)చర్మ సంరక్షణకు వాడితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.బ్రౌన్ షుగర్ తేనె సమన పరిమాణంలో తీసుకుని ఇందులో రెండు చుక్కల రోజ్ ఆయిల్ కలపాలి ఇందులో ఉండే గ్లైకోలిక్ యాసిడ్ ఎండ వల్ల రంగు కోల్పోయిన చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. ఈ మిశ్రమంతో ముఖం మృదువుగా రుద్ది పావుగంటాగి మొహాన్ని శుభ్రం చేసుకోవాలి.ఒక కప్పు బ్రౌన్ షుగర్ లో కొద్దిగా పాలు ఓ స్పూన్ […]
మొటిమలకు కారణం ఇదే
మొటిమలు, పెదవుల పగుళ్లు రావడం సర్వసాధారణం కానీ వీటిని అశ్రద్ధ చేస్తే అనవసర సమస్యలు అవుతాయి ఒత్తిడి,నిద్రలేమి,చర్మతత్వం చుండ్రు కూడా మొటిమలకు కారణం కావచ్చు. లేదా హార్మోన్ల అసమతుల్యత కూడా కావచ్చు.అలాటప్పుడు ఎక్కువ మేకప్ చేసుకోకూడదు.సౌందర్య లేపనాలు గాఢత ఎక్కువగా ఉన్న షాంపూల కారణంగా చర్మం దెబ్బతింటుంది.తీసుకునే ఆహారంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్న మొటిమలు వస్తాయి తేనె టీట్రీ ఆయిల్,ఆపిల్ సిడర్ వెనిగర్ గ్రీన్ టీ,కలబంద వంటివి చిట్కాలు గా వాడి ముఖానికి పూతలా వేసుకుంటూ […]
నిద్రలేమికి చెర్రీ జ్యూస్
నిద్రలేమి ఇప్పుడు ఒక సాధారణ సమస్య అయ్యి కూర్చుంది. ఇదొక ఆరోగ్య సమస్య కాకపోయినా దాని ద్వారా వచ్చే అనారోగ్యాలకు లోటు లేదు. ఈ సమస్యకు చెర్రీ జ్యూస్ తో చెక్ పెట్టవచ్చు అంటున్నారు పరిశోధకులు. దీర్ఘకాలంగా నిద్రలేమితో బాధపడుతున్న కొందరిని చెర్రీ జ్యూస్ రెగ్యులరుగా ఇస్తూ పరిశీలిస్తూ వచ్చారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో రాత్రి పడుకునే ముందు చెర్రీ జ్యూస్ ఇచ్చారు. కొన్ని రోజుల తరువాత నిద్ర సమయాలను పరీక్షిస్తే గతంలో కన్నా నిద్ర […]
ఆత్మ విశ్వాసం ఇచ్చే తోటపని
కాస్సేపు మొక్కల్లో పనిచేస్తే మన రూపాన్ని మనం ప్రేమించుకొని గుణం పెరుగుతుందంటున్నారు పరిశోధకులు .తోటపని లో మొక్కల పెరుగుదల అదేపనిగా గమనించటం వల్ల ఎవరి శరీరం పట్ల వారికీ ఒక ఆత్మ విశ్వాసం కలుగుతోందని చెపుతున్నారు .మంది ఉద్యానవన ప్రేమికులతో చేసిన ఒక విశ్లేషణ లో వాళ్ళలో రూపం విషయం లో ఎలాటి పిర్యాదులు అందలేదట .ప్రకృతి కి దగ్గరగా ఉండేవాళ్ళు చుట్టూ చెట్లను, పుట్టలను ప్రేమించినట్లే తమను తాము అంతే ప్రేమించుకొంటారట .నగర జీవితంలో ఉండేవాళ్ళు […]
అచ్చమైన మాయిశ్చరైజర్
బొప్పాయి ఫేస్ ప్యాక్ తో ముఖవర్చస్సు పెరుగుతుంది ముఖం పైన నల్ల మచ్చలు పోతాయి. బొప్పాయి పొడి చర్మం గలవారికి మాయిశ్చరైజర్ లాంటిది. బొప్పాయి గుజ్జులో ముల్తానీ మట్టి కలిపి ముఖానికి పట్టించాలి. ఈ మిశ్రమం ఆరిన తర్వాత తేడా తెలుస్తుంది.ముల్తానీ మట్టి ముఖం పై ఉండే జిడ్డును తొలిగిస్తుంది. బొప్పాయి మృదుత్వాన్ని ఇస్తుంది. ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లు మొటిమలతో బాధ పడుతున్న వారు ఈ ప్యాక్ ను వేసుకొంటే ప్రయోజనం ఉంటుంది. బొప్పాయి గుజ్జుతో రెండు […]
సరిగ్గ వేయాలి
సరైన పద్దతిలో చేస్తేనే వ్యాయామంలో లాభం అందుతోంది. ఫిట్ నెస్ లక్ష్యాలు సాధించాలంటే వర్క్ వుట్స్ కు ముందు వామప్ అవసరం అంటారు ప్రముఖ ఫిట్ నెస్ ట్రైయినర్ యాస్మిన్ కరాచీవాలా. నాలుగు రకాల స్ట్రెబ్బింగ్స్ తో కీళ్లు కండరాలకు స్వాంతన లభిస్తుంది అంటారు యాస్మిన్. క్వాడ్రి సెప్స్ స్ట్రెచ్,హిప్ ఫ్లెక్సర్ స్ట్రెచ్,గ్లూట్ స్ట్రెచ్, హమ్ స్ట్రింగ్ స్ట్రెచ్ ఈ నాలుగు పర్ ఫెక్ట్ గా చేస్తే తొడ దెగ్గర కీళ్లు కండరాలు స్ట్రెచ్ అవుతాయి. వెన్ను […]
బహుశా ఇదే కారణమా ?
జుట్టు రాలిపోవడానికి ప్రతిసారి పోషకాహార లోపమే అనుకోనక్కరలేదు.మనం చేసే పొరపాట్లు కూడా కావచ్చు. తడి జుట్టును ఆరబెట్టేందుకు డ్రయర్ వాడటం స్ట్రైయిటనర్ ఉపయోగించటం కూడా నష్టం కలగజేస్తోంది.ఈ వాడే సమయంలో వచ్చే వేడి మాడుపై నూనేని,తేమని తగ్గించి జుట్టును పొడిబారేలా చేస్తుంది జుట్టుని సహజంగా ఎండ పొరలో గాలిలో ఆరనివ్వాలి.వాడే షాంపూల్లో పి పి డి అమ్మోనియా వంటి రసాయనాలు వెంట్రుకలకు హాని చేస్తాయి.పైగా పీహెచ్ శాతం ఎక్కువ ఉండటం వల్ల జుట్టు పొడిబారి చిట్లిపోతుంది రాలిపోతుంది […]
అలవాటు పడ నివ్వాలి
ఇది కరోనా కాలం పెద్దవాళ్ళు ఉద్యోగాలు, పిల్లలు చదువుల పైనా ఈ వైరస్ పెను ప్రభావం చూపించింది. బడికి వెళ్లి నేర్చుకునే విద్య వర్చ్యువల్ తరగతిగా మారిపోయింది.ఈ మార్పును పిల్లలు అర్థం చేసుకోవడం అలవాటు పడటం కాస్త కష్టమే.పిల్లల చదువు కోసం ఇంట్లో కొన్ని మార్పులు చేసుకోవాలి. రోజును ఒక టైం టేబుల్ ప్రకారం విభజించుకోవాలి.చదువు, వ్యాయామం, అలవాటు పనులు అన్నింటినీ ఒక పేపర్ పైన ఒక్కదానికి ఇంత సమయం అని కేటాయించుకుని రాసి పెట్టుకోవాలి.ముందుగా […]
ఇవే ఆరోగ్యం
పింగాణీ వస్తువులు శుభ్రం చేయటం తేలిక. పైగా పెద్ద ఖరీదు ఉండవు.ఇంట్లో వాడుకొనికి అవసరమయ్యే అన్ని వస్తువుల పింగాణీ లో లభిస్తున్నాయి,ఇవి మన్నికగా ఉండాలంటే ఇలా శుభ్రం చేయాలి.రెండు స్పూన్ల వంటసోడా లో ఓ స్పూన్ వెనిగర్, రెండు చుక్కలు డిష్ వాష్ లిక్విడ్ కలిపి కాఫీ కప్పులు, పింగాణి ప్లేట్లు రుద్దితే మరకలు లేకుండా కొత్తవి లాగా మెరిసిపోతాయి.ప్లాస్టిక్ కంటైనర్ల కంటే పింగాణీ పాత్రలు వాడటం ఎంతో ఆరోగ్యం. ఇవి వేడిని ఎక్కువగా తట్టుకుంటాయి. ఆహారం […]
ఎలాగైనా తినచ్చు
చర్మం తాజాగా, ముడతలు,మచ్చలు లేకుండా నిగనిగలాడాలంటే కొబ్బరిని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోమంటున్నారు ఎక్సపర్ట్స్. దీనిలోని కాల్షియం,ఫాస్పరస్ శరీరానికి సమపాళ్లలో అందటం వల్ల ఎముకలు దృఢంగా అవుతాయి.శరీరంలో ఇనుము లోపిస్తే ఎర్రకణాల కు తగిన ఆక్సిజన్ అందదూ రక్తంలో హిమోగ్లోబిన్ వృద్ధి అవ్వదు. రోజు కప్పు కొబ్బరి పాలు ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావలసిన దానిలో సగం ఐరన్ అందుతోంది కొబ్బరి నుంచి లభించే జింక్ జుట్టు రాలనివ్వదు.దీన్ని నేరుగా తిన్న వంటకాల్లో ఉపయోగించినా ఎన్నో పోషకాలు సొంతం […]
ఎక్కడైనా చేయొచ్చు
కరోనా సమయంలో ఇల్లు కదలటంలేము కనుక వ్యాయామం మానేయనక్కర్లేదు. ఏ పరికరాలు అవసరం లేకుండా ఎక్కడైనా ఎప్పుడైనా క్యాలరీలు కరిగించ గలిగే వ్యాయామాలు ఉన్నాయి.నిలుచున్న చోట నుంచి ముందుకు వెళ్లకుండా పరిగెత్తటం స్పాట్ జాగింగ్.ఈ వ్యాయామంలో కాళ్లు చేతులను నిజంగా పరిగెత్తుతున్నట్లే కదపాలి.వేగాన్ని పెంచుతూ తగ్గిస్తూ ఐదు నిమిషాలు చేసినా చాలు అలాగే అలాగే బట్ కిక్స్ చేయొచ్చు.కాలితో పిరుదుల భాగాన్ని తాకటం ఈ వ్యాయామం .అలాగే స్ట్రెబ్బింగ్స్ప పవార్ ప్లాంక్స్, ఏ వ్యాయామం అయినా ఇంట్లోనే […]
మెరిసే చర్మం కోసం
చర్మాన్ని కాంతివంతంగా మార్చే ఎన్నో పదార్థాలు వంటింట్లోనే ఉన్నాయి.బంగాళాదుంప లతో చర్మం పైన నల్ల మచ్చలు తగ్గి చర్మం మెరుస్తుంది.ఒక గిన్నెలో టీ స్పూన్ యోగర్ట్,ఉప్పు, కొన్ని చుక్కల నిమ్మ గడ్డి నూనె లేదా, శాండల్ వుడ్ నూనె తీసుకొని బాగా కలిపి ఈ మిశ్రమంలో మధ్యకు కోసిన బంగాళాదుంపను మంచి దానితో మొహం పైన నెమ్మదిగా రాస్తే వెంటనే ప్రయోజనం కనిపిస్తుంది. ముఖంపైన మురికి,మలినాలను వదిలించుకునేందుకు బియ్యంపిండి వాడవచ్చు. టీ స్పూన్ చొప్పున అలోవెరా జెల్ […]
