Saturday, 15 Aug, 2026
మొహం కళ్ళు పెదవులు జుట్టు గురించి ఆలోచిస్తాం గానీ సాధారణంగా నిరాదరణకు గురయ్యేది మెడ మెడ పై చర్మం ముఖ్యంగా వెనక వైపు చాలా త్వరగా పిగ్మెంటేషన్ కు గురవుతుంది. డార్క్ లైన్స్ ఇన్ గ్రోన్ హెయిర్ మడతలు ఎక్కువగా పడతాయి. ఇక్కడ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కనీసం రోజుకు రెండు సార్లైనా క్లీన్స్ చేస్తుండాలి. మైల్డ్ స్క్రబ్ తో రుద్దటం వల్ల చర్మం మృదువుగా అవుతుంది. పగటివేళ సన్ స్క్రీన్ రాత్రి వేళ మాయిశ్చరైజర్ క్రీమ్ అప్లయ్ చేయాలి. పైవైపుకు మస్సాజ్ చేయాలి. దీని వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా అయ్యి లైన్స్ మడతలు తగ్గి పోతాయి. ఆయిల్ మస్సాజ్ చేస్తే వార్ధక్య లక్షణాలు కనపడవు. రెండు టేబుల్ స్పూన్ల సెనగపిండి పసుపు నిమ్మ రసం పాల మీగడ కలిపి మెడకు అప్లయ్ చేసి కడిగేస్తే మృత కణాలు పోతాయి. నలుపు తగ్గిపోతుంది.ఓట్ మీల్ పెరుగు బాదం పొడి టొమాటో రసం కలిపి రాసినా ఫలితం ఉంటుంది.

రాత్రి వేళల్లో బెస్ట్ 

స్క్రబ్బింగ్ ఎప్పుడు రాత్రివేళలో చేయడం మంచిది. రాత్రి సమయంలో చర్మంలోని మృతకణాలు వాటంతటవే మరమ్మతులు అవుతాయి. అంచేత నిద్రపోయే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి పొడి చర్మం అయితే క్రీమ్ స్క్రబ్ ని  సున్నితమైన చర్మం ఉంటే తేలికైన చిన్న చిన్న బిడ్స్ లేని స్క్రబ్బర్ ను జిడ్డు చర్మం అయితే జెల్ స్క్రబ్ ను ఉపయోగించాలి. ముఖానికి నెమ్మదిగా మసాజ్ చేయాలి తరువాత గోరువెచ్చని నీళ్లతో ముఖం కడుక్కుని మాయిశ్చరైజర్ రాసుకుంటే ఉదయానికి చర్మం మృదువుగా కాంతివంతంగా కనిపిస్తుంది.

Leave a Reply