Chinna Maata
ఈ చిగురు మంచి ఔషధం
సీజనల్ గా చింత చిగురు దొరికే రోజులు ఇవే. ఈ చిగురులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.ఇవి చెడు కొలెస్ట్రారాల్ని తగ్గిస్తాయి.వారంలో నాలుగైదు సార్లు తిన్న మంచిదే. ఈ చిగురులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ.నీటిలో చింతచిగురు వేసి ఉడికించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి నోటిపూతకు చింత చిగురు మంచి ఔషధం లాగా పనిచేస్తుంది.ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది కనుక రోగనిరోధకశక్తి ఎక్కువే. థైరాయిడ్ తో బాధపడే వాళ్ళు చింత చిగురు […]
యూట్యూబ్ స్టార్ గంగవ్వ
60 ఏళ్ల వయసులో లక్షల మంది అభిమానులను సంపాదించుకుంది యూట్యూబ్ స్టార్ గంగవ్వ.ఈ మధ్యనే తెలంగాణ గవర్నర్ తమిళిసై చేతుల మీదగా గ్రామీణ మీడియా యూట్యూబ్ కళాకారిణి పురస్కారం తీసుకుంది.మిల్కురి గంగవ్వ జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడి పల్లె లో పుట్టింది ముగ్గురు సంతానం ఆకలి తీర్చేందుకు వ్యవసాయ కూలీగా పని చేసేది.’మై విలేజ్ షో’ యూట్యూబ్ ఛానల్ లో ఆమె మాటతీరు,నటనలో సహజత్వం. స్క్రిప్ట్ తో పనిలేకుండా చెప్పే కబుర్లు నెటిజన్లను ఆకట్టుకున్నాయి బిబిసి, […]
ఇది సహజమైన స్క్రబ్
ఆవనూనెతో అందాన్ని పెంచుకోవచ్చు అంటారు బ్యూటీ ఎక్స్ పర్ట్స్. ఆవాల్లో విటమిన్-ఇ ఉంటుంది ఇది చర్మంపై ముడతలను తగ్గిస్తుంది.మంచి సన్ స్క్రీన్ లోషన్ లాగా కూడా ఉపయోగపడుతుంది.ఆవనూనెలో ఒక చెంచా శెనగపిండి కాస్త పెరుగు వేసి కలపాలి.ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి వారానికి రెండు సార్లు ఇలా చేస్తే ముఖం పై నల్ల మచ్చలు తగ్గిపోతాయి.చర్మం మృదువుగా ఉంటుంది. చర్మం నిర్జీవంగా అనిపిస్తే పావుకప్పు ఆవ నూనెలో రెండు చుక్కలు రోజ్ […]
ప్రపంచవ్యాప్త గుర్తింపు
జేమ్స్ బాండ్ సినిమాకు థీమ్ సాంగ్ పాడే అవకాశం 18 ఏళ్ల అమెరికా అమ్మాయి బిల్లీ ఐలిష్ దక్కించుకుంది.బిల్లీ ఐలిష్ ఈ నో టైమ్ టు డై పాట రాబోతున్న సినిమా కంటే పాపులర్ అయింది. ఈ పాట పాడిన సింగర్ 2019లో వెన్ వీ ఆల్ ఫాల్ ఎస్లీప్ అనే తొలి ఆల్బమ్ తో అమెరికా ఇంగ్లాండ్ లో సింగర్ గా వెలుగులోకి వచ్చింది. వరుసగా ఐదు గ్రామీ అవార్డులు ,రెండు అమెరికన్ మ్యూజిక్ అవార్డ్ […]
ఇప్పుడు ప్రశాంతత కావాలి
ఇప్పుడు మనందరికీ తాజాగాలి,మనసుకు ప్రశాంతత కావాలి అంటోంది హీరోయిన్ తాప్సీ.ఆన్ లాక్ ప్రక్రియ మొదలు కావడంతో అందరూ షూటింగ్ లకు హాజరవుతున్నారు.కొందరు బయట ప్రదేశాలకు విశ్రాంతి కోసం వెళ్తున్నారు.తాప్సీ ఇప్పుడు జైపూర్ లో ఉంది.ఐదు నెలలుగా ఇంట్లోనే ఉన్నాను.ఇప్పుడు మళ్లీ పని కోసం వెళ్లే సమయం వచ్చింది. ఇప్పుడు ప్రశాంతత కావాలి ఒత్తిడినుంచి విముక్తి కావాలి.కరోనా ఆలోచనలు నుంచి తేరుకొనే శక్తి కావాలి.వైరస్ అనే కాదు, ఏ కష్టం లోంచి అయినా బయటకు రావాలంటే ముందు మన […]
హెల్తి ఫుడ్ తో కరోనా దూరం
ఆరోగ్యకరమైన ఆహారం వ్యాయామాలు రోగ నిరోధక శక్తిని పెంచి కరోనా సోకినా శరీరం పైన దాని ప్రభావం తగ్గించేందుకు తోడ్పడతాయి. కనుక పోషక భరితమైన ఆహారం పైన దృష్టి పెట్టండి అంటున్నారు అధ్యయనకారులు.ఆహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ పప్పుధాన్యాలు సీజన్ వారీగా దొరికే కూరగాయలు, ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పాల ఉత్పత్తులు.చర్మం తొలగించిన చికెన్, చేపలు పరిమితంగా తినాలి. పొట్టు తీయని ధాన్యాలు పిండి పదార్థాలు,నట్స్ నూనెతో కూడిన విత్తనాలు ఆరోగ్యకరమైన కొవ్వులు […]
ఇలా తినాలి
రోజులో మూడు పూటలా అధిక మొత్తంలో అన్నమే తినే అలవాటుంటే షుగర్ వచ్చే అవకాశాలున్నాయి జాగ్రత్త అంటున్నారు అధ్యయనకారులు. కుటుంబ చరిత్ర,జీవనశైలి,అధిక బరువు పెరిగే వయసు కూడా మూలకారణాలే. ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఈ ఇబ్బంది అధిగమించవచ్చు. అన్నంతో పాటు కొర్రలు,ఊదలు,సజ్జలు,రాగులు,ఆహారంలో చేర్చుకోవాలి. సమతులాహారం తినాలి. వ్యాయామం చేయాలి పోషకాల కూరగాయిలు శక్తి నిచ్చే పప్పులు డైట్ లో ఉండాలి. రాత్రి వేళ చెపాతీలు, జొన్న రొట్టెలు,గోధుమ రవ్వ తో చేసిన ఉప్మా వంటివి కూడా తీసుకోవచ్చు. […]
మడతలు మార్చాలి
ఖరీదైన చీరెలను సరిగ్గా భద్రం చేయకపోతే వాటి కళ కాస్త పోయి మన్నిక తగ్గుతుంది.ప్రతిసారి పట్టుచీరెను ఉతక కూడదు ఒక్కసారి వాడిన తర్వాత గాలిలో ఆరవేయాలి. చీరెలపై మరకలు పడితే చల్ల నీళ్ళతో ఆ మరక పడిన మేరకు శుభ్రం చేయాలి లేదా మరక పడిన చోట కాస్త గ్లిజరిన్ రాయాలి లేదా టాల్కం పౌడర్ తో తుడిచేయాలి. పట్టు చీరెలు ఎక్కువ రోజులు కదలకుండా బీరువాలో ఉంచకూడదు.నెలకోసారి బయటకు తీసి మడతలు మార్చాలి లేకపోతే మడతల్లో […]
కాఫీ మాస్క్ తో మెరుపు
ముఖం తాజాగా కనిపించేందుకు కాఫీ పొడి పూత వేసుకోండి అంటున్నారు బ్యూటీ ఎక్స్పర్ట్స్.రెండు స్పూన్ల కాఫీ పొడిలో చెంచా బాదం నూనె కాసిన్ని పాలు రెండు స్పూన్ల తేనె వేసి పూతలా వేసుకోవాలి.ఒక పావు గంట ఆరిపోయాక చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే ముఖం తాజాగా ఉంటుంది అలాగే రెండు స్పూన్ల కాఫీ పొడిలో తేనె, నిమ్మరసం, గుడ్డులోని తెల్లసొన కలిపి బాగా గిలక్కొట్టి ముఖానికి రాసుకుని ఆరనివ్వాలి.బాగా ఆరిపోయాక కొంచెం పంచదార చేతిలోకి తీసుకుని నీళ్లతో చేతులను […]
ఈ దశాబ్దం ఇండియానే
నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ అండ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్)కు మొదటి మహిళా అధ్యక్షురాలు దేవయాని ఘోష్ ఈ సమస్య భారత్ లో ఐటీ బిపిఎమ్ సేవలను అందించే సంస్థలను ప్రోత్సహిస్తోంది.ఇంటెల్ ఇండియాలో పని చేశారామె 1966 -2017 మధ్య ఇంటెల్ లో దక్షిణాసియా ఆగ్నేయాసియా దేశాలకు సంబంధించిన అనేక కీలక పదవుల్లో పనిచేసిన దేవయాని భారతీయ విభాగం ఎండీ గా ఉన్నారు తర్వాత నాస్కామ్ అధ్యక్షురాలిగా 2018లో బాధ్యతలు తీసుకున్నారు కోవిద్-19 నేపథ్యంలో భారతీయ ఐటి […]
పరిమళాలతో ప్రశాంతం
కరోనా సమయం కనుక చాలా మందికి ఇల్లే ఆఫీస్,జిమ్ అయింది.ఇంటి అలంకరణ తో కొన్ని మార్పులు చేసుకుంటే ఉత్సాహంగా పని చేసుకోగలుగు తారంటున్నారు ఇంటీరియర్ ఎక్సపర్ట్స్. ఆఫీస్ వర్క్ చేసుకునే డెస్క్ దగ్గరలో ఒక వెలుతురు వచ్చే లాంప్ ఏర్పాటు చేసుకోవాలి చక్కని వెలుగు పడాలి. అలాగే చిన్న చిన్న మొక్కలు ఉండే కుండీలు ఎదురుగా కనబడుతూ ఉంటే గదంతా తాజాగా కనిపిస్తుంది. చక్కని సువాసన వచ్చే ఎయిర్ ప్యూరిఫైయర్స్ గదిలో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. లావెండర్ […]
సంపద నిచ్చే కెంపు
కెంపు లను ధరిస్తే సర్వ శుభాలు చేకూరుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.ప్రాచీన కాలంలో ఈ రూబీ లను కిరీటాలు ఉంగరాలు భుజ కీర్తులు కంకణాలు కర్ణాభరణాల్లో విరివిగా వాడే వాళ్లు కోరండమ్ అనే ఖనిజం నుంచి ఏర్పడే రత్నాలలో కెంపు చాలా ముఖ్యమైనది.ఈ కోరండమ్ నుంచి సఫైర్ జాతికి చెందిన నీలం,కనకపుష్యరాగం, శ్వేత పుష్యరాగం వంటి రత్నాలు భూగర్భంలో తయారవుతాయి. ఈ రత్నాలు కాఠిన్య లో వజ్రాల తర్వాతి స్థానంలో నిలుస్తాయి.కనుల కింపుగా ఉండే ఈ కెంపు […]
5000 మందికి ఉపాధి
గుజరాత్ లోని సూరత్ సమీప గ్రామాల్లోని పేద మహిళలకు స్వయం ఉపాధి ఏర్పరిచేందుకు శక్తి ఫౌండేషన్ కు రూపకల్పన చేశారు జర్నలిస్ట్ సోనాల్ రోచాని. ఇక్కడ కుటుంబాల్లో చాలామంది మగవాళ్ళు తాగుడుకు బానిసలై మృతిచెందారు. ఒంటరిగా మిగిలిన మహిళలు దుర్భరమైన దరిద్రంలో ఉన్నారు వారికి ఉపాధి కల్పించి ఆ కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు గానూ సోనాల్ రోచాని ఈ ఫౌండేషన్ ద్వారా విరాళాలు సేకరించి మహిళలకు అందించారు. ప్రభుత్వ సాయం కూడా అందింది ఆ డబ్బుతో సూరత్ […]
ఈ ఆహారం ప్రమాదం
జంక్ ఫుడ్ తింటున్న కొద్ది తినాలనే ఉంటుంది.కొంచెం కష్టపడి అయినా తినే సందర్భాలను తగ్గించుకుంటే క్రేవింగ్ తగ్గుతుంది అంటున్నారు డాక్టర్లు. ఆరోగ్యకరమైన ఆహారం పెంచుకుంటూ జంక్ ఫుడ్ తగ్గించుకోవాలి. ముందుగా జంక్ ఫుడ్ అందుబాటులో లేకుండా చూసుకోవాలి. రకరకాల రుచులతో పోషకాహారం తయారు చేసుకోవటం ద్వారా మెదడు కోరుకునే రుచిని అందించి నెమ్మదిగా జంక్ ఫుడ్ తగ్గించుకోవాలి ఆకలి వేస్తే దాకా ఆగకుండా సమయానికి తినేయాలి అప్పుడే జంక్ ఫుడ్ వైపు చేతులు వెళ్ళావు.ఒత్తిడిలో ఉంటే ఏదో […]
వెన్నుముక వంగదు
యాభై ఏళ్లు దాటుతున్నాక విటమిన్ సి శరీరంలో పుష్కలంగా ఉండేలా చూసుకుంటే వృద్ధాప్యం వల్ల ఎదురయ్యే సమస్యలు రావు అంటున్నారు పరిశోధకులు ముఖ్యంగా వెన్నెముక కండరాల పరిమాణం ఏటా ఒక శాతం తగ్గిపోతుంది.దానితో వెన్నుముక ఒంగుతూ ఉంటుంది. యాభై దాటిన వాళ్ళు సి విటమిన్ ఎక్కువగా ఉండే పండ్లు కూరగాయలు బెర్రీలు తినాలి అంటున్నారు.హానికర ఫ్రీ రాడికల్స్ కారణంగా దెబ్బతిన్న కణజాలాలు దెబ్బతినకుండా ఉంటాయి. పండ్లు కూరగాయలు తినే వాళ్ళలో ఎముక కండరాల క్షీణత తక్కువ గా […]
ఎలాగోలా నవ్వితేనే ఆరోగ్యం
కావాలని నవ్వినా ,నవ్వొచ్చి నవ్వినా, ఎలా నవ్వి నా సరే నువ్వు నవ్వే దీనివల్ల మేలే జరిగేది అంటున్నారు పరిశోధకులు.నవ్వుతో ముఖంలో కదిలే కండరాలు వల్ల మెదడులో న్యూరో ట్రాన్స్ మీటర్లు విడుదల అవుతాయని దీనివల్ల మన మనసుకి హాయిగా అనిపిస్తుందని పరిశోధనల్లో తేలింది కోవిడ్ కారణంగా ఎంతోమంది డిప్రెషన్ లోకి వెళ్ళటం ఆందోళన పడటం వల్ల ఆరోగ్యం పాడవడం గురించి చేస్తున్న పరిశోధనల్లో నవ్వుతో మానసిక శారీరక ఆరోగ్యం బాగుంటుందనీ పాజిటివ్ గా ఆలోచించే గుణం […]
ఇది తేలికైన పద్ధతి
కొన్ని వస్తువులతో వంట గదిలో పని సులభం అవుతోంది.ఉదాహరణకు ఆయిల్ ఫిల్టర్ పాట్ లో వేయించిన నూనెలో మడ్డి తేలికగా తీసేయొచ్చు నూనెలో ఎన్నో రకాల వేపుళ్లు చేస్తారు. వేయించ గా మిగిలిపోయే నూనెలో అడుగున మడ్డి పేరుకుంటుంది.దాన్ని మళ్లీ విడిగా వడకట్టి వేరు చేయాలి.ఆ కష్టం లేకుండా ఈ స్టిల్ జార్ లో రంధ్రాలున్న జాలి ఉంటుంది. వాడిన నూనె ఆ జల్లెడ మీదుగా జార్ లోకి పంపిస్తే వ్యర్ధాలన్ని పైనే ఉండి నూనె కిందకు […]
పోషకాల డ్రాగన్
80 శాతం నీళ్లు ఉండే డ్రాగన్ పండు తింటే జీర్ణవ్యవస్థ బావుంటుంది. సి, ఎ, బి1, బి2, బి3 విటమిన్లు మెగ్నీషియం క్యాల్షియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండటం తో ఈ డ్రాగన్ రోగనిరోధక శక్తిని ఇస్తుంది.డయాబెటిక్స్ రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంచుతుంది టమోటా ల్లాగే డ్రాగన్ పండులో పుష్కలంగా లైకోపిన్ వల్ల చర్మం ముడతలు పడకుండా దెబ్బతినకుండా కాపాడుతుంది ఇది.ఏ వాతావరణంలో అయినా సులభంగా పెరుగుతోంది. డ్రాగన్ లో హైబ్రిడ్ రకాలు చాలానే ఉన్నాయి […]
చక్కెరతో క్యాన్సర్
ఏదో రకంగా కాస్తో కూస్తో చక్కెర కడుపులోకి పోతూనే ఉంటుంది. చక్కర వల్ల వచ్చే ఎన్నో నష్టాల గురించి వింటూనే ఉన్నాం. ఇపుడు ఒక కొత్త అధ్యయనం చక్కరలో క్యాన్సర్ కణాలను ఉత్తేజ పరిచే రాస్ అనే జన్యువు ఉందని కనుగొన్నారు. ఈ జన్యువు క్యాన్సర్ కణాలను ప్రేరేపిస్తుందనీ ఆ కణాలు వేగంగా వ్యాప్తి చెందడానికి సహాయపడుతుందని చెపుతున్నారు. చక్కెర వినియోగం పెరిగితే మధుమేహం కన్నా కాన్సర్ వచ్చే ప్రమాదమే అధికంగా ఉందని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు.చక్కెర అయినా, […]
అన్నింటా స్ట్రా బెర్రీ
స్ట్రా బెర్రీ ఫ్రూట్ ఎర్రగా, ముద్దుగా, తియ్యగా ఎంతోమందికి చాలా ఇష్టమైన పండు.ఈ పండు ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో కూడా ముందే ఉంటుంది. ఎర్రని లోలాకులుగా,మెరిసే బ్యాగ్ కో అందాన్నిచ్చే డిజైన్ గా కర్టెన్ లు,పిల్లో కవర్స్ పైన వస్త్రాల పైన స్ట్రా బెర్రీ డిజైన్ అందంగా ఒదిగిపోతుంది.డ్రెస్ మెటీరియల్ పైన ఎప్పుడో దర్శనం ఇచ్చిన ఈ పండు కొత్తగా మాస్క్ లకు కూడా చక్కని రూపొందిస్తోంది. ఈ ఫ్యాషన్ ఫ్రూట్ మాస్క్ పైన ఎంత బాగుందో […]
