Thursday, 08 Oct, 2026

సవాళ్ళు అంటే నాకు ఎప్పుడు ఇష్టం.

ఒకవైపు క్రీడల్లో రాణిస్తూనే ఇంకొక వైపు గా వ్యాపార రంగంలో కూడా తమ క్రియేటివిటీని చూపిస్తున్నారు మహిళా అథ్లెట్లు.స్మృతి మందాన మహిళ జాతీయ జట్టు తరఫున ఆడే  భారత క్రికెటర్.2018 లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆమెను మహిళ అంతర్జాతీయ క్రికెటర్ గా పేర్కొన్నది. స్మృతి క్రికెట్ స్టార్ మాత్రమే కాదు వ్యాపార రంగంలో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. మహారాష్ట్రలోని సాంగ్లీలో తన పేరు జెర్సీ నెంబర్ మీద ఎస్.ఎం 18 పేరుతో  స్పోర్ట్స్ కేఫ్ ప్రారంభించారు. అలాగే వన్ అండ్ ఎయిట్ అనే హెల్త్ అండ్ వెల్నెస్ కన్జ్యూమర్ బ్రాండ్ లో కో క్రియేటర్ గా ఇన్వెస్టర్ గా ఉన్నారు.ఎన్నో ప్రముఖ బ్రాండ్లకు ఆమె అంబాసిడర్ కూడా. ఒక్కొక్క ఎండార్స్మెంట్ కి సుమారు 75 లక్షల నుంచి 1.5 కోట్ల వరకు తీసుకుంటుంది స్మృతి . ఏదైనా సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి కాలక్రమంలో ఆ సంస్థ ఎదగటం చూడాలనే ఆలోచన నాకెప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. ఏదైనా సాధించాలనుకుంటే దానికి ఒక పరిమితి అంటూ ఉండదు. ఏ రంగంలో అయినా కష్టపడితే రాణించగలం అంటుంది ఈ క్రికెటర్.

Leave a Reply