సువాసనతోను సమస్యే!
సువాసనలు వెదజల్లే పెర్ఫ్యూమ్స్ డియోడరెంట్స్ వాడటం చాలా మందికి ఇష్టం.కానీ వాటిలో ఆల్కహాల్ ,సింథటిక్ ఆయిల్స్,రసాయనాలు ఉంటాయి.ఇవి పట్టు షిఫాన్ ఆర్గంజా వంటి వస్త్రాల మీద పడితే రంగు మారిపోతాయి.చిరిగిపోతాయి కూడా. అందుకే వీటిని నేరుగా కాకుండా దూరం నుంచి స్ప్రే చేయాలి .అలాగే బంగారు నగలు వెండి వస్తువులు ముత్యాలు కుందన్లు వంటి వాటిపై ఈ స్ప్రే పడితే వాటి సహజమైన మెరుపు కోల్పోయి నల్లగా అవుతాయి .ఘాటైన వాసన వచ్చే ఈ పెర్ఫ్యూమ్ లు పరిమితి మించి వాడితే శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తవచ్చు.ముఖ్యంగా వీటి రసాయనాలు కొందరికి అలర్జీలు కలిగిస్తాయి. అందుకే చర్మానికి ఎప్పుడూ నేరుగా పెర్ఫ్యూమ్ స్ప్రే చెయ్యొద్దు తేలికపాటి మాయిశ్చరైజర్ లేదా పెట్రోలియం జల్ రాసుకుని వాటికి ఈ పెర్ఫ్యూమ్ స్ప్రే చేయాలి.
