చీరల మీద త్రీ డీ ఎంబ్రాయిడరీ
హీటెడ్ డిటిఎఫ్ స్టిక్కర్లు ఇవాల్టి నయా ట్రెండ్. ఇదివరకు ఐరన్ అండ్ ప్యాచెస్ పేరుతో మార్కెట్లో దొరికేవి.అవి టీ షర్ట్ లు చొక్కా కాలర్ల మీద వేసే వాళ్ళు కానీ ఇప్పుడు ఈ కొత్త స్టిక్కర్లు చీర మీద పెట్టి దాన్ని హీట్ ప్రెస్ మిషన్ తో వేడి చేస్తే చాలు ప్రింట్ చక్కగా చీర మీద పడుతుంది.ఏ ఫ్యాబ్రిక్ మీద అయినా ఈ డిజైన్ వేసుకోవచ్చు.కలంకారీ,తంజావూరు మొదలైన ఆర్ట్స్, దేవుళ్ళ చిత్రాలు ఏనుగులు చిలకలు పూలతల వంటి డిజైన్లు కూడా ఈ ప్రింట్ స్టిక్కర్స్ లో వస్తున్నాయి.నాణ్యమైన స్టిక్కర్ వేయించుకుంటే త్రీ డీ లుక్ లో అక్కడ పెయింటో ఎంబ్రాయిడరీ నో చేశారా అన్నట్లు కనిపిస్తుంది.ప్రత్యేకమైన ఇంకుతో తయారుచేసిన ఈ డిజైన్లు ఏళ్ల తరబడి అలాగే ఉంటాయి.డిజైన్ ని బట్టి మొత్తం చీరకు ప్రింట్ వేయాలంటే వెయ్యి వరకు చార్జి చేస్తున్నారు.
