మహిళా సాధికారతే లక్ష్యంగా వెల్త్ కంపెనీ
2022 లో వెల్త్ కంపెనీ పేరుతో మధు లునావత్ స్థాపించిన మ్యూచువల్ కంపెనీ భారతదేశపు 47వ మ్యూచువల్ ఫండ్ హౌస్ గా అవతరించింది.దీని మేనేజింగ్ డైరెక్టర్ సీఈవో ఐన లునావత్ సి ఎ చదివింది .అస్సాంలో పుట్టి పెరిగిన లునావత్ మహిళా సాధికారతే లక్ష్యంగా పల్లెలు చిన్న పట్టణాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి చిన్న మొత్తాల్లో పెట్టుబడులు అందుబాటులోకి తేవాలనే నిర్ణయం తో ముందుగా 2014లో పాంటోమత్ గ్రూపు ప్రారంభించింది.పెట్టుబడుల్లో విప్లవం తేవాలన్న సంకల్పంతో ముంబైలో 2002లో స్థాపించిన వెల్త్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ , కంపెనీల విలీనాలు, కొనుగోళ్లు, పెట్టుబడుల నిర్వహణ, పంపిణీ వంటి సేవలందిస్తుంది. ఇందులో మహిళా సాధికారతకు ప్రాధాన్యం. అందులో భాగంగా ఆమె మ్యూచువల్ ఫండ్స్ ని కూడా తీసుకుని వచ్చింది. స్త్రీలను పొదుపు వైపు ప్రోత్సహిస్తుంది ఆమె స్థాపించిన సంస్థ. మ్యూచువల్ ఫండ్ రంగంలో ఒక సంచలనంగా దూసుకు వచ్చింది మధు లునావత్.సాంకేతిక, సరళ మైన పారదర్శకమైన పెట్టుబడుల ద్వారా ప్రతి భారతీయుని దేశ వృద్ధి లో భాగస్వాములను చేసేందుకు తన వంతుగా ప్రయత్నిస్తున్నా అంటుంది మధు లునావత్ మ్యూచువల్ కంపెనీ నెలకొల్పిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది లునావత్.
