Tuesday, 28 Jul, 2026

మహిళలకు మహోపకారం

కాలిఫోర్నియా యూనివర్సిటీ లో మాలిక్యులర్ బయాలజీ చదివిన సురభి 24 ఏళ్లకే ఎన్ విజన్ మెడికల్ పేరుతో స్టార్టప్ ప్రారంభించారు.అండాశయ క్యాన్సర్ ను ఎటువంటి కోత లేకుండా ప్రాథమిక దశలోనే గుర్తించే పరికరాన్ని తయారు చేయడం ఆమె ఆశయం.అండాశయ క్యాన్సర్ అండాశయాల్లో కాకుండా ఫెలోపియన్ నాళాల్లో మొదలవుతాయని తెలుసుకొని ఒక ప్రత్యేకమైన మైక్రో క్యాథేటర్ పరికరాన్ని రూపొందించారు. దీన్ని బోస్టన్ సైంటిఫిక్ కంపెనీ 2000 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేశారు. ప్రస్తుతం సురభి మెంటార్ గా మారారు.ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక స్టార్టప్ యాక్సిలరేటర్ వై కాంబినేటర్లు గ్రూపు పార్ట్నర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు వర్క్‌లైఫ్‌ బ్యాలెన్స్ గురించి వితౌట్ ఏ డౌట్ పేరుతో పుస్తకం రాశారు సురభి.

Leave a Reply