Wednesday, 01 Jul, 2026

ఈ మార్కెట్ అమ్మల రాజ్యం!

ఇమా కైథెల్ మార్కెట్ ప్రపంచంలో పూర్తిగా మహిళలే నడిపిస్తున్న అతి పెద్ద మార్కెట్.మణిపురి భాష లో ఇమా అంటే అమ్మ. కైథెల్ అంటే మార్కెట్.తల్లుల మార్కెట్ 5000 నుంచి 6000 మంది మహిళా వ్యాపారులు ఇక్కడ వ్యాపారాలు సాగిస్తారు పురుషులు కేవలం కొనుక్కునేందుకు మాత్రమే ఇక్కడికి వస్తారు ఈ మార్కెట్ మణిపురి మహిళల పోరాట పటిమ కు నిదర్శనం.16వ శతాబ్దంలో ఇక్కడ వెట్టిచాకిరి పద్ధతి ఉండేది.పురుషులు దూర ప్రాంతాల్లో వ్యవసాయం చేయడానికి వెళ్లాల్సి వచ్చేది. ఆ సమయంలో ఇళ్లను కాపాడుకుంటూ పంటని అమ్ముకోవడానికి మహిళలు స్వయంగా ఈ మార్కెట్ ప్రారంభించారు. బ్రిటిష్ వాళ్ళు ఈ మార్కెట్ ని విదేశీయులకి అమ్మాలని చూశారు కానీ ఇక్కడి మహిళలంతా ఏకమై ప్రాణాలకు తెగించి పోరాడి ఈ మార్కెట్ ను  కాపాడుకున్నారు. చేనేత వస్త్రాల నుంచి తాజా కూరగాయలు పండ్లు అన్నీ ఇక్కడ లభిస్తాయి ఈ మార్కెట్ గొప్ప పర్యాటక కేంద్రం.

Leave a Reply