మరణం లేని వృక్షం

మరణం లేని వృక్షం

మరణం లేని వృక్షం

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వృక్షం  మెధూసెలా.ఇది కాలిఫోర్నియాలోని  ఇన్యో జాతీయ అటవీ ప్రాంతంలో పెరిగిన  పైన్ వృక్షం. ఈ చెట్టును కాపాడేందుకు దీని ఖచ్చిత మైన ప్రాంతాన్ని చాలా రహస్యంగా ఉంచుతుంది యూఎస్ ఫారెస్ట్ సర్వీస్. దీని వయసు సుమారు 4857 సంవత్సరాలు.  ఒక అధ్యయనం  ప్రకారం ఈ వృక్షం  గిజా లోనీ ప్రాచీన ఈజిప్ట్ పిరమిడ్ నిర్మాణం కంటే చాలా ముందుది అని తేలింది. ఈ చెట్టు అసాధారణమైన దీర్ఘాయువు కి కారణం కఠినమైన ఎత్తైన పర్వత ప్రాంత వాతావరణం లో గడ్డకట్టిన ఉష్ణోగ్రతలు ,సారం లేని నేల పోషకాల కొరత వల్ల ఇది  చాలా నెమ్మదిగా పెరిగి చిరాయువు గా జీవించింది.