చేపల వేట సరదా

చేపల వేట సరదా

చేపల వేట సరదా

26 సంవత్సరాల ప్రాప్తి మెండన్ ఫిషరీస్ కాలేజీ లో అసిస్టెంట్ గా పనిచేస్తోంది.ఎగిసిపడే అలలు సముద్రంలో డీప్ సీ ఫిషింగ్ లో తనదైన ముద్ర వేస్తోంది.ఫిషింగ్ బోట్ పైన సముద్రం లోకి వెళ్లడం ఆమె ఇష్టమైన అభిరుచి.ఆ ఇష్టం తోనే ఆమె ఫిషరీస్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లో మాస్టర్స్ చేసింది.చేపలు పట్టే పద్ధతులు,పడవ నిర్వహణ,చేపల వాలాను లగే టెక్నిక్ లను కోర్స్ ల్లో భాగంగా చక్కగా నేర్చుకుంది.ఖాళీ దొరికితే చాలు సముద్రంలోకి వెళ్లి డైవింగ్ చేస్తుంది.ఫిషింగ్ చేస్తుంది  అంతులేని శ్రమ తో నిండి ఉండే ఈ ఫిషింగ్ లో ఆమె ఆరితేరింది.ఎక్కువ మంది అమ్మాయిలు ఈ రంగంలోకి రావాలని నా ఆశ అంటోంది ప్రాప్తి మెండన్.