భూమిక ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్ లో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది ఎత్తు, శరీరవరణం కారణంగా చిన్నతనం నుంచి ఎన్నో వివక్షులు ఎదుర్కొన్న భూమిక బికాం చదువుతూ ఇన్స్టా లో రీల్స్ చేసేది. ఆమె పోస్ట్ లు వీడియోలు చూసి నింజాస్ మోడల్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రతినిధులు ఆమె ఊరికి వెళ్లారు. కెమెరా ముందు ఆమె పలికించే హావ భావాలు అంతర్జాతీయ బ్రాండ్ లకు సరిగ్గా సరిపోతాయని గ్రహించి అవకాశాలు అందించారు. ప్రఖ్యాత ఎలైట్ పారీస్, ఎలైట్ స్పెయిన్ లా వంటి ఏజెన్సీల కాంట్రాక్ట్ లు సంపాదించింది. వర్ణ వివక్ష గోడలు బద్దలు కొట్టి 19 ఏళ్ల వయసులోనే ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ బ్రాండ్ లకు మోడలింగ్ చేస్తోంది భూమిక.













