డౌన్ సిండ్రోమ్ తో జన్మించిన 15 సంవత్సరాల అహిదా సరమాయి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మోడలింగ్ సినిమాల్లో రాణిస్తోంది. ఈ పాప పుట్టిన వెంటనే డాక్టర్లు ఆమెలో లోపాన్ని చెప్పేశారు. అహిదా అమ్మానాన్నలు ఆ అమ్మాయిని బలంగా పెంచారు. నాట్యం, నటన, పెయింటింగ్ వంటి రంగాల్లో శిక్షణ తీసుకుంది అహిదా. దురందర్ ది రివేంజ్ లో షరారత్ పాటకు డాన్స్ చేసిన సోషల్ మీడియాలో పెడితే అది కాస్త వైరల్ అయి దురందర్-2 లో అర్జున్ రాంపాల్ కూతురు లైబా గా స్క్రీన్ ముందుకు వచ్చే అవకాశం వచ్చింది ఎలాంటి బెరుకు లేకుండా నటించి సెట్ లో అందరి ప్రశంసలు అందుకున్నది.














