నైక బ్యూటీ అండ్ ఫ్యాషన్ ఈ- కామర్స్ కంపెనీ స్థాపించి స్వయంకృషితో బిలినియర్ అయినా భారతీయురాలు ఫల్గుణి నాయర్. భారతదేశపు తొలి మహిళ యూనికాన్ వ్యాపారవేత్త. ఆమె బ్రాండ్ నైకా. అంటే కేవలం కాస్మెటిక్స్ మాత్రమే కాదు బ్యూటీ ఫ్యాషన్ అన్నీ కలిపిన మహిళల సెల్ఫ్ కేర్. ఉమెన్ సెంట్రిక్ బ్రాండ్. 2021 లో నైకా ఐపిఓ విడుదల అయ్యాక కంపెనీ విలువ భారీగా పెరిగింది. వ్యాపారంలో మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ గా ఫార్చ్యూన్ ఇండియా ఆమెను అభివర్ణించింది. ఫోర్బ్స్ ఇండియా మోస్ట్ పవర్ ఫుల్ కూడా తొలిసారిగా నైకా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి. తన పేర్లను ప్రజలకు అమ్మ కలిగింది భారతదేశ వ్యాపార రంగంలో ఫల్గుణి ఒక స్ఫూర్తి.














