Thursday, 01 Oct, 2026
ప్రతి రోజూ ఇతర ఆహార పదార్ధాల్లో కలిసి వాల్ నాట్స్ తీసుకోవటం వాళ్ళ ఇన్ఫలమేషన్ మెటాబాలిజమ్ పై ప్రభావం కనిపిపిస్తుందని తాజా పరిశోధనలు చెపుతున్నాయి. వాల్ నాట్స్ ను చెర్రీలు గ్రీన్ టీ వంటి వాటితో కలిసి టీ మరింత ఎక్కువగా ఉంటాయి . వాల్ నట్స్ ఇతర ఆరోగ్య వంతమైన పదార్ధాలతో కలిపి తీసుకోవటం వల్ల దుష్ప్రభావాలు తగ్గుతాయని తాజా పరిశోధనలు చెపుతున్నాయి. వీటి వల్ల ఆల్ఫాలినో లెనిక్ యాసిడ్ వృక్ష సంబంధిత ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్ లు గుర్తించ దగిన మోతాదులో పెరుగుతాయి. ఇవి మనిషి శరీరానికి ఎంతో ఉపయోగపడే పోషకాలు. పీచు ప్రోటీన్ పొటాషియం లకు వాల్ నట్స్ పవర్ హౌజ్ లాంటివి.

మెదడుకు మేలు చేసే ఆక్రోట్స్

అష్టవంకర లతో, వగరు రుచితో ఉండే ఆక్రోట్లు అంతో ఇంతో మందులా పని చేస్తాయి రోగులకు మూలమైన ఇన్ ఫ్లమేషన్ తగ్గించే గుణం వీటిలో మెండుగా ఉందని గుర్తించారు వైద్యులు. రోజు 40 గ్రాముల చొప్పున వాల్ నట్స్ తీసుకున్నవాళ్లు హృద్రోగ సమస్యలు తక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరిగిందని బిపి అదుపులో ఉందని దానితో గుండె ఆరోగ్యం మెరుగైందని గుర్తించారు. ఈ అక్రోట్లు చెట్లని తెలివి తేటలకు సంకేతంగా, శక్తి కేంద్రంగా విశ్వసిస్తారు అమెరికన్లు.

Leave a Reply