Friday, 02 Oct, 2026
మామిడి పండు పైన పంచ రత్నాలు రాయవచ్చు. తిన్న వెంటనే సంతోషం పట్టలేక కవితలు రాయచ్చు. నోరారా కీర్తించవచ్చు. అంత కమ్మగా వుండే మామిడి పండు మనకు దొరికేది ఏడాదిలో రెండు మూడు నెలలు అయితే సంవత్సరం పొడవునా సరిపోయేన్ని ఔషధ గుణాలు ఈ పండులో పుష్కలంగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో, కార్బోహైడ్రేట్స్ తక్కువ మోతాదులోఉంటాయి. పిండి పదార్ధం, కొవ్వు తక్కువగా ఉండటం వల్ల మామిడి పండు తింటే బరువు పెరుగుతామన్న భయం అక్కర్లేదు. అంచేత ప్రతిరోజూ ఒక మామిడి పండు చొప్పున తింటూ వుంటే నీరసం, నిస్సత్తువ రావు. అజీర్తి చేయదు. ఎక్కువ ఇరోన్వుంటుంది కాబట్టి రక్తహీనత పోతుంది. విటమిన్ ఎ, ఇ, సేలోనియంలు గుండె సమస్యల నుంచి దూరంగా ఉంచుతాయి. సీజన్ అయిపోయేదాకా రోజుకో పండు తినేస్తేనే మంచిది.

మామిడి తో మెరిసే చర్మం

మామిడి పండులో ఉండే మ్యాగ్నిఫెర్రస్ అనే  శక్తి మంతమైన యాంటీ ఆక్సిడెంట్ చర్మానికి ఎంతో స్వాంతన ఇస్తుంది. ముఖం తాజాగా కాంతివంతంగా కనిపిస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. అందులోని సి-విటమిన్ మెగ్నీషియం మొటిమల కారణంగా వచ్చిన వాపును తగ్గిస్తాయి చర్మంపైన జిడ్డును తొలగించి మొటిమలు రాకుండా చేస్తాయి. మామిడి పండు ఫేస్ ప్యాక్ తో చర్మం సున్నితంగా మారుతుంది. ముఖం పైన చర్మం ఒకే  రంగులో లేకుండా ఉన్నప్పుడు ముఖం పైన వచ్చే నల్ల మచ్చలకు మామిడి పండు రసం ఒక మంచి మందు లాంటిది. ముఖం పైన మామిడిపండు రసం రాసి కాస్త నెమ్మదిగా మర్దన చేస్తే చర్మం ఒకే  రంగులోకి మారుతుంది.

Leave a Reply