Friday, 02 Oct, 2026
ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్ట్ ప్రకారం ఇటీవల మధుమేహం తర్వాత ఎక్కువమంది మహిళల వెన్ను నొప్పి తోనే. శారీరిక బలహీనత మానసిక వత్తిడి కూర్చునే భంగిమ సరిగాలేక పోవటం ఇలా కారణాలు ఏమైనా నడుము కింది భాగంలో వెన్నునొప్పి తో బాధపడేవాళ్లు సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతుంది. ప్రతి పదిమందిలోను ఎనిమిదిమంది దీని బారిన పడుతున్నారని అధిక బరువు ఎత్తటం క్షణం కూడా తీరిక లేని అనేక పనులు పదే పదే చేస్తూ ఉండటం కూడా మరో ముఖ్య కారణమని పరిశోధకులు చెపుతున్నారు . ఇందులో రెండు రకాల్ని ఒకటి దీర్ఘ కాలికంగా వస్తూ పోతుందని ఒకటి ఉదయం పూట ఎక్కువగా ఉంటుందనీ విశ్లేషించారు. తొలిదశలోనే కారణం తెలుసుకుని బరువులు ఎత్తటం ,దించటం ఆపాలనీ యోగా చేయాలనీ కూర్చునే భంగిమలు మార్చుకోవాలని వాటి ద్వారా దీన్ని నివారించుకుంటే మంచిదని చెపుతున్నారు. ఇలా ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే నెప్పి తీవ్ర స్థాయికి చేరుతుందని అది దీర్ఘకాలికంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు . నడుం నొప్పి కదా ఒక మాత్రతో పోతుందని ఆలస్యం చేయద్దంటున్నారు

నడుము నొప్పికి నడక మందు

నడుము నొప్పికి మందులకన్నా నడక ఎక్కువ ఉపయోగపడుతుంది అంటున్నారు పరిశోధకులు. సుమారు లక్షన్నర మంది పై చేసిన పరిశోధనలో నడుము నొప్పి గల వారిని ప్రతిరోజు సుమారు అరగంట పాటు నడవమని సలహా ఇచ్చారు. దీర్ఘకాలంగా నడుము నొప్పితో బాధపడుతున్న వారిలో 16 శాతం మందికి ఉపశమనం కలిగింది. నడక వల్ల నడుము నొప్పి తగ్గినందుకు గల కారణాలు విశ్లేషిస్తే అధికబరువు సమస్య తలెత్తుతోందని ఇదే నడుము నొప్పి వీపు నొప్పికి కారణం అవుతుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

Leave a Reply