Wednesday, 05 Aug, 2026
సమంత స్టార్ హీరోయినే కాదు. అందమైన అమ్మాయి. మంచి అభిరుచులు ఆలోచనలు తెలివితేటలు పుష్కలంగా ఉన్న ఇవాల్టి అమ్మాయి. ఆమె సినిమాలేనంత పాప్యులరో ఆమె కాబోయే పెళ్లి కూడా అంత సెన్సేషన్. ఎంతో బాగా మాట్లాడుతుంది కూడా. సినిమాల్లో ఎంత సంపాదించావు ఎంత వెనకేశవు అని చాలా మంది అడుగుతారు. దానికి నేను వెలకట్టలేను. అంటోందీ అమ్మాయి. నేను దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. సినిమా రంగం నాకు సుఖవంతమైన జీవితాన్ని అంతులేనంత ఆత్మ విశ్వాసాన్ని నాపిల్ నాకు నమ్మకాన్ని ఇచ్చింది. ఇలాంటి సౌకర్యవంతమైన జీవితాన్ని కనుక ఇచ్చిన ఈ సినిమాలు నేను మానేయ వచ్చు. ఈ రంగానికి దూరంగా కూడా వుండచ్చు. అప్పుడు కూడా ఇంతే ఆనందంగా ఉంటాను అది కూడా నాకు సినిమానే నేర్పించింది. నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేయటమే కాకుండా నాకు ఈ ప్రపంచాన్ని పరిచయం చేసింది . నేను ఎన్నో నేర్చుకున్నాను. నా చేతి కందిన జీవితాన్ని ఎంజాయ్ చేయగలను అని చెప్పుకొచ్చింది ఒక ఇంటర్వ్యూ లో. నిజమే సమంత చెప్పినట్లు ఇది విలువైన జీవితం అని తెలుసుకోవటమే ఎవరికి వాళ్ళు చేయవలసిన పని.

అబద్దాల వల్ల చాలా నష్టం

పర్సనల్ జీవితం లో ఎవరిష్టం వాళ్ళదే. కానీ పబ్లిక్ లో కొస్తే మాత్రం బాలెన్సుడ్ గా ఉండాలి లేకపోతే మాట పడటం,సమస్యల పాలవటం ఖాయం. సమంత ఇదే చెబుతోంది అబద్దాలు ఆడే వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం వుండదు. నేనయితే అస్సలు ఆడను. అవసరం వున్న లేకపోయినా ఏదో అబద్దం ఆడేవాళ్లు ఆక్షణం లో తపించుకుపోతారు కానీ ఎప్పుడో అప్పుడు నిజం బయటపడిపోతుంది అప్పుడు వాళ్ళను ఎప్పుడు నమ్మారు. నిజం కఠినంగా ఉన్నా నిజమే చెప్పాలి. నిజం చెప్పటం వల్ల ఆక్షణం లో మనకి బాధ కలగచ్చు,కోపం రావచ్చు,కాస్త ఇబ్బంది ఉండవచ్చు కానీ మనపైన ఒక నమ్మకం మాత్రం ఎదుటి వాళ్ళకు కలుగుతుంది. మనుష్యులుగా నిజాయతీగా ఉండటం చాలా ముఖ్యం అంటుంది సమంత .

Leave a Reply