ఇషితా సంగ్వాన్ ఇప్పుడు ఫైటర్ పైలట్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి శిక్షణ పూర్తి చేసుకున్న మొదటి బ్యాచ్ మహిళ క్యాడెట్ లలో ఆమె కూడా ఒకరు. హర్యానా కు చెందిన ఇషితా ఫైటర్ పైలట్ అవ్వాలనుకుంది ఎన్డీఎ లో అవకాశం లేదనటం తో ఇంజనీరింగ్ చదవాలనుకుంది. 2021 లో అమ్మాయిలను చేర్చుకోవచ్చునని కోర్టు తీర్పు ఇవ్వడంతో ప్రవేశ పరీక్ష రాసి ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ క్యాండిడేట్ లకు అవసరమైన కంప్యూటరైజ్డ్ పైలెట్ సెలక్షన్ సిస్టం పరీక్ష ను పూర్తి చేసింది ఎన్డీఎ లో చేరే నాటికి ఆమె వయసు 16 ఏళ్లు సైన్యం లో చేరాలనుకునే అమ్మాయిలకు ఇషితా గొప్ప స్ఫూర్తి.













