జర్మనీ కి చెందిన జూలియన్ కోయెప్కే ప్రపంచం అదృష్టవంతురాలిగా కీర్తించింది. 1971 లో జరిగిన విమాన ప్రమాదంలో జూలియన్ విమానంలోంచి సీట్లు ఊడిపడి పై నుంచి దట్టమైన అమెజాన్ అడవిలో పడిపోయింది. 3000 మీటర్ల ఎత్తు నుంచి పడటం తో కాలర్ బోన్ విరిగి గాయపడింది. ఆ గాయాలతో అమెజాన్ అడవుల్లో నడుస్తూ 11 రోజుల పాటు నడిచి అడవిలో కలప కొట్టే సిబ్బందిని చేరుకుంది వాళ్లే ఆమెను విమానంలో ఆస్పత్రికి పంపటం తో బతికి బయటపడింది.ఆ సంఘటనను ఒక నవలగా వెన్ ఐ ఫెల్ ఫ్రొమ్ స్కై హౌ ది జంగల్ సేవ్ మై లైఫ్ రాస్తే ఆ నవలకు కొరియన్ లిటరేచర్ ప్రైజ్ వచ్చింది. ఆమె కథ తో ఎన్నో సినిమాలు వచ్చాయి.













