May 2025
తొలి మిస్ వరల్డ్
స్వీడన్ లో పుట్టిన హకాన్సన్ 1951 లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఆమె బికినీ ధరించి ఆ పోటీల్లో పాల్గొనటం అప్పట్లో గొప్ప సంచలనం. యూరప్ లో మోడలింగ్ వృత్తి కొనసాగించిన హకాన్సన్ ఎన్నో అందాల పోటీలకు జడ్జిగా ఉన్నారు అమెరికన్ శిల్ప డల్లాస్ ఆండర్సన్ ను పెళ్లి చేసుకున్నారు. మిస్ వరల్డ్ టైటిల్ కు ముందు ప్రెటియస్ట్ గర్ల్ ఇన్ స్వీడన్ టైటిల్ గెలుచుకున్నది గత సంవత్సరం కాలిఫోర్నియాలో 94వ ఏటా […]
వెండి ఆభరణాలే అందం
ఆభరణాల్లో బంగారం తర్వాత స్థానం వెండిదే తక్కువ ధరలో లభించే ఎంతో అందమైన వెండి ఆభరణాలు ధరించడం ఇప్పటి లేటెస్ట్ ట్రెండ్ కూడా వెండి వస్తువుల్లాగా వెండి ఆభరణాలు దగదగమని మెరిసిపోతూ ఉండవు వీటికి ఉండే స్టైలిష్ బ్రైట్ లుక్ కోసం ఆభరణాలు కాస్త డల్ గా ఉన్న వీటినే యూత్ ఇష్టంగా ధరిస్తున్నారు హారాలు,చెవిపోగులు చక్కని గాజులు ఏ డ్రెస్ కైనా చక్కగా సరిపోతాయి.
మహిళలే తెలివైన వాళ్ళు
ఎం.బి.ఎ చదువుకున్న కవిత సుబ్రహ్మణ్యన్ బ్రోకరేజ్ సంస్థ అప్‌స్టాక్స్ సహా వ్యవస్థాపకురాలు 2009లో ప్రారంభించిన ఈ సంస్థతో విస్తరణ ఆర్థిక అంశాలు వ్యూహాలు పర్యవేక్షిస్తున్నారు కవిత.గతంలో మెకిన్సే ఎస్.ఎం.ఎస్ మైక్రో ఫైనాన్స్ లో పనిచేసిన అనుభవంతో యువతే లక్ష్యంగా ఆమె స్థాపించిన అప్‌స్టాక్స్ యువతను ఆకర్షించటంతో విజయం సాధించింది ఆర్థిక అక్షరాస్యతకు ప్రాధాన్యత ఇస్తూ సెవెన్ ట్రోల్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ పేరుతో యాప్ లోనూ అఫ్ లెర్న్ పేరుతో కాలేజీల్లోనూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆర్థిక నిర్ణయాలు […]
ఆటో అమ్మాయి
కేరళ కు చెందిన ఆటో డ్రైవర్ 18 సంవత్సరాల అలీషా గిన్సన్ ను కేరళ ప్రభుత్వం తమ ప్రతిష్టాత్మక ‘కేరళ సవారి’ అనే జీరో కమిషన్ ఫ్లాట్ ఫామ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. తల్లి తండ్రి ఇద్దరు అనారోగ్యంతో మంచం పడితే అలీషా అన్న చదువు మానేసి కుటుంబ బాధ్యతలు తీసుకున్నారు అలా అలీషా ఆటో డ్రైవర్ గా లైసెన్స్ తీసుకొని కొత్త ప్రయాణం మొదలు పెట్టింది. ఈ అమ్మాయి సొంత ఊరు మంజుమ్మెల్ […]
వ్యాపార స్ఫూర్తి బిబా
ఫ్యాషన్ బ్రాండ్ బిబా వ్యవస్థాపకురాలు మీనా బింద్రా ఆమె వయసు ఇప్పుడు 80 ఏళ్ళు 1988లో 8వేల రూపాయల బ్యాంకు రుణం తో ప్రింటెడ్ కాటన్ దుస్తులు డిజైన్ చేయడం మొదలుపెట్టారు మీనా బింద్రా . 1990 లో రిటైల్ వ్యాపారం ప్రారంభించి మొత్తం దేశంలో 372 స్టోర్స్ 250 మల్టీ బ్రాండెడ్ అవుట్ లెట్స్ తీసుకువచ్చారు. సింగపూర్. లండన్. యుఎఈ న్యూజెర్సీలో బిబా బ్రాండ్ విస్తరించింది. ఈ స్టోర్స్ లో మూడేళ్ల పాప దగ్గర నుంచి […]
నవ్వించటమే వృత్తి
అమెరికాలో స్థిరపడిన భారత స్టాండప్ కమెడియన్ జర్నా గార్గ్ ఈ మధ్యకాలంలో సినిమాల్లో నటించటం మొదలుపెట్టింది.ఎ నైస్ ఇండియన్ బాయ్ సినిమాలో కీలక పాత్రలు ధరించిందామె అలాగే రి అరేంజ్ అనే సినిమాకు స్క్రిప్ట్ రాశారు. ఆ సినిమాకు ఆస్టిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ కామెడీ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చింది.జర్నా గార్గ్ చక్కని రచయిత్రి కూడా ఆమె తన జీవిత విశేషాలతో రాసిన థిస్ అమెరికన్ ఉమెన్ కు అద్భుతమైన స్పందన లభించింది. కెన్ వెస్టర్న్ […]
చీకటి చాలా ముఖ్యం
నిద్రించే సమయంలో చుట్టూ చీకటి గానే ఉండాలంటున్నారు నిపుణులు. లైట్ వెలుగులో నిద్రపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. శరీరంలో ఇన్సులిన్ పనితీరు మందగిస్తుంది. శరీరంలో నిద్రించేందుకు తోడ్పడే మెలటోనిన్ ఉత్పత్తి శాతం తగ్గుతుంది. వెలుతురు ప్రభావంతో మెదడులో న్యూరో మీటర్లు సమతుల్యత కోల్పోయి భావోద్వేగ నియంత్రణ సామర్థ్యం తగ్గుతుంది.ప్రశాంతంగా నిద్రించాలంటే,శరీరం, పూర్తి విశ్రాంతి పొందాలంటే చీకటి గది లోనే నిద్రపోవాలి.
వయసు అడ్డంకి కాదు
72 ఏళ్ల వయసులో కిలిమంజారో పర్వతాన్ని ఎక్కేసిన ఓల్డెస్ట్ ఇండియన్ ఉమెన్ గా చరిత్ర సృష్టించారు విద్యా సింగ్. విజయనగరం రాజ కుటుంబానికి చెందిన విద్యా సింగ్ టెన్నిస్ లో ఎన్నో పథకాలు గెలుచుకున్నారు మారథాన్ లో పాల్గొనడం గుర్రపు స్వారీ సైక్లింగ్ ఆమెకు చాలా ఇష్టమైన పనులు. 2013 నుంచి ట్రెక్కింగ్ పై ఆసక్తి పెంచుకొని భారతదేశం, భూటాన్, దక్షిణ అమెరికా లలో 19 ట్రెక్కింగ్ లు పూర్తి చేశారామె.గెట్ అప్ అండ్ గో అనే […]
జాగిలాల హాండ్లర్ ఈమె
అస్సాం రైఫిల్స్ కు చెందిన పి.వి శ్రీ లక్ష్మి పారా మిలటరీ దళం లో జాగిలాల హ్యాండ్లర్ గా ఎంపిక అయ్యారు. ఇప్పటివరకు మగవాళ్లే చేస్తున్న ఈ ఉద్యోగంలో శ్రీ లక్ష్మి మొదటి మహిళగా గుర్తింపు పొందారు. శునకాల సైకాలజీ క్షేత్రస్థాయిలో ఎత్తుగడల విభాగంలో అడ్వాన్స్డ్ కోర్స్ లు పూర్తి చేశాక శ్రీ లక్ష్మి ఈ బాధ్యతలు తీసుకున్నారు.సైన్యం లో మహిళలు సత్తా చూపిస్తున్నారని చెప్పేందుకు శ్రీలక్ష్మి చక్కని ఉదాహరణ.
విజయపథంలో విల్వా
ఐటీ లో ఇంజనీరింగ్ చేసిన కృత్తికా కుమారన్ విజయవంతమైన వ్యాపారవేత్త. తమిళనాడు లోని గొబ్బి చెట్టి పాలయమ్ ఆమె పుట్టిన ఊరు తీవ్రమైన చర్మ సమస్యలు ఉన్న ఆమె తల్లి కోసం ఆమె సహజ పదార్థాలతో చర్మ కేశ సంబంధమైన ఉత్పత్తులు చేయడం మొదలుపెట్టారు. వాటిని ‘విల్వా’ పేరుతో ఫేస్ బుక్ లో అమ్మకాలు ప్రారంభించారు ఇప్పుడు కృత్తిక కు ప్రపంచవ్యాప్తంగా కస్టమర్స్ ఉన్నారు. తమిళనాడు లో సొంత స్టోర్ లు ఉన్నాయి. ఆమె వ్యాపారం 30 […]
సూపర్ మోడల్ ఈ బొమ్మ
దక్షిణ కొరియాకు చెందిన చోయ్ సూన్-హ్వా 80 ఏళ్ల వయసులో మోడలింగ్ లోకి వచ్చారు ఆసుపత్రిలో నర్సుగా పని చేసే చోయ్ ఒక రోగి రికమండేషన్ తో 74వ ఏటా సియోల్ ఫ్యాషన్ వీక్ లో అరంగేట్రం చేశారు. దక్షిణ కొరియాలో ప్రచురితం అయ్యే హార్పర్స్ బజార్, ఎల్లె వంటి ప్రముఖ మేగజైన్ ల కవర్ పేజీల పైన ఆమె ఫోటో వేశారు. దానితో ఆమె పాపులర్ అయిపోయి వాణిజ్య ప్రకటనల్లో నటించారు తర్వాత గ్లోబల్ మిస్ […]
క్రేజీ స్టైలిస్ట్
ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్స్ లో మసాబా గుప్తా చాలా ప్రత్యేకం పెద్ద పెద్ద ప్రింట్లు, డార్క్ కలర్స్ తో ఆమె ఫ్యాషన్ బ్రాండ్ క్వీన్ హౌస్ ఆఫ్ మసాబా సెలబ్రెటీలకు పెద్ద ఆకర్షణ. సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ వంటి స్టార్స్ క్యాజువల్స్ నుంచి ఈవెంట్ స్పెషల్స్ వరకు మసాబా నే అడిగేస్తారు. తండ్రి విలియం రిచర్డ్ లాగా టెన్నిస్ వైపు తల్లి నీనా గుప్తా లాగా యాక్టింగ్ వైపు చూడకుండా తన క్రియేటివిటీ […]
పాతవే ఇప్పటి ట్రెండ్
పాత తరం నాటి పట్టు జార్జెట్ చీరలతో ఆఫ్ సైక్లింగ్ చేసి కొత్త డ్రెస్ లుగా మార్చి ధరించటం ఇప్పటి ఫ్యాషన్ ట్రెండ్. అంచులున్న కాటన్, పట్టు చీరలతో చేసిన ఇండో వెస్ట్రన్ మోడల్ డ్రెస్ లు ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నాయి. షిఫాన్, సిల్క్, కాటన్, నెట్టెడ్ చీరలతో చేసిన అనార్కలి లాంగ్ గౌన్ కుర్తీలు పట్టు బ్రోకెడ్, బెనారస్ తో చేసిన ఓవర్ కోట్స్ లాంగ్ జాకెట్స్ పలాజోలు ఇప్పుడు ఎంతో ఫ్యాషన్ చీరల […]
చిన్న నవ్వే చాలు
ఒక చిన్న చిరునవ్వు చుట్టూ ఉన్న వాతావరణాన్నే మార్చేస్తుంది అంటున్నారు పరిశోధకులు. ఇది మానసిక ప్రయోజనాలనే కాదు, సామాజిక బంధాలు బలపడటం లోను కీలక పాత్ర పోషిస్తుంది. ఇతరులకు మనపై నమ్మకం కలిగేలా చేసేది ఈ చిరునవ్వే అంటారు. ఎదుటివారిని చూసి చిన్న నవ్వు నవ్వితే నేను మీతో స్నేహపూర్వకంగా ఉంటాను, నాతో ప్రమాదం లేదు, నాతో ఎప్పుడైనా మాట్లాడవచ్చు అనే పాజిటివ్ సంకేతం ఎదుటి వాళ్లకు వెళుతుందట ఇతరుల నమ్మకం సంపాదించాలంటే పెదవుల పైన చిరునవ్వు […]
మామూలు పెరుగే శ్రేష్టం
యోగర్ట్ లో మాంసాహారం కంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయనుకోవటం అవాస్తవం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇందులో సాధారణ పెరుగు కంటే కాస్త ప్రోటీన్ అధికం కానీ మార్కెట్ లో దొరికే యోగర్ట్ లో అనేక ఫ్లేవర్ లు కలుపుతారు కనుక అసలు వాటి వాడకం మంచిదే కాదు. యోగర్ట్ లో తీపి కోసం చేర్చే చక్కెర ఇతర పదార్థాలు క్యాలరీలు ఎక్కువే ఉంటాయి. ఈ యోగర్ట్ కంటే మామూలు వెన్న తీసిన పాలతో చేసిన పెరుగు కొవ్వు […]
కేశరక్షణకు వెన్న
ప్రపంచవ్యాప్తంగా మహిళలు అందం విషయంలో ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు వాటిలో కొన్ని విలక్షణంగా కనిపిస్తాయి కూడా. ఇథియోపియా మహిళలు వెన్నను కేశ సౌందర్యానికి ఉపయోగిస్తారు ఆఫ్రికా నేలపై సూటిగా పడే సూర్యకిరణాల నుంచి తక్షణ గా కూడా వెన్నను పేర్కొంటారు. కేశాలకు బాగా వెన్న పట్టించి గంట తర్వాత తల స్నానం చేస్తారు దీని వల్ల జుట్టుకు బాగా బలం వస్తుందని పెరుగుతుందని నమ్ముతారు వెన్న లోని ఫ్యాక్టరీ యాసిడ్లు విటమిన్లు జుట్టుకు తేమని చక్కని […]
స్ఫూర్తినిచ్చే వారసురాలు
వ్యాపార రంగంలో ఆరితేరిన కుటుంబం నుంచి వచ్చింది ఇషా అంబానీ పిరామల్ ముఖేష్ అంబానీ కుమార్తె ఆమెను దేశం లోని అత్యంత స్ఫూర్తిదాయకమైన మహిళగా చెబుతారు. రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ గా పని చేస్తోంది ఆమె. అలాగే ధీరుభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహణలో ప్రధాన పాత్ర ఆమెదే.ఇషా గత సంవత్సరం మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు తీసుకున్నారు నెక్స్ట్ రైజింగ్ స్టార్స్ జాబితాలో ఆమె పేరు చోటు చేసుకున్నది ఆమె వార్షిక […]
ఔషధ గుణాలు ఎక్కువ
తెలుపు గులాబీ రంగులో మెరిసిపోయే గునుగు పూలు ప్రపంచవ్యాప్తంగా అలంకరణ కోసం ఉపయోగిస్తారు.ఈ పూల మొక్కల్లో ఔషధ గుణాలు చాలా ఎక్కువ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చాలా ఎక్కువ వీటి ఆకులు చర్మంపై గాయాలు, పుండ్లు తగ్గిస్తాయి. అధిక రక్తపోటు నియంత్రించగలవు యూరినరీ ఇన్ఫెక్షన్ లు, మలబద్ధకం నివారణ కోసం ఈ మొక్క పువ్వులు కూడా ఉపయోగపడతాయని ఆయుర్వేద పండితులు చెబుతున్నారు.
మృదుత్వాన్ని ఇచ్చే బేబీ ఆయిల్
చిన్నపిల్లలకు రాసే బేబీ ఆయిల్ లో మినరల్స్, విటమిన్ ఇ వంటి పోషకాలు ఉంటాయి ఈ నూనె రాత్రిపూట పాదాలకు రాసుకుని పది నిమిషాలు మర్దన చేస్తే చర్మం కోమలంగా మారిపోతుంది. స్నానం చేశాక కాస్త తడిగా ఉన్నప్పుడే ఈ బేబీ ఆయిల్ రాసుకుంటే, శరీర చర్మం మృదువుగా అయిపోతుంది. శరీర భాగాల్లో, జుట్టుకు కూడా బేబీ ఆయిల్ మెరుపును మృదుత్వాన్ని తీసుకువస్తుంది జిడ్డుగా ఉండదు.పొడి చర్మం గలవారు బేబీ ఆయిల్ ప్రతిరోజు ఉపయోగించవచ్చు.
