కేరళ కు చెందిన ఆటో డ్రైవర్ 18 సంవత్సరాల అలీషా గిన్సన్ ను కేరళ ప్రభుత్వం తమ ప్రతిష్టాత్మక ‘కేరళ సవారి’ అనే జీరో కమిషన్ ఫ్లాట్ ఫామ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. తల్లి తండ్రి ఇద్దరు అనారోగ్యంతో మంచం పడితే అలీషా అన్న చదువు మానేసి కుటుంబ బాధ్యతలు తీసుకున్నారు అలా అలీషా ఆటో డ్రైవర్ గా లైసెన్స్ తీసుకొని కొత్త ప్రయాణం మొదలు పెట్టింది. ఈ అమ్మాయి సొంత ఊరు మంజుమ్మెల్ ఈమె ఆటో పైన ‘మంజుమ్మెల్ గర్ల్’ అని పేరు రాసి ఉంటుంది. ఇప్పుడు పగలు కాలేజీలో చదువుతూ రాత్రిళ్ళు ఆటో నడుపుతుంది అలీషా.













