Sunday, 28 Jun, 2026

ఈమె గోద్రెజ్ వారసురాలు

గోద్రెజ్ అండ్ బాయ్స్ సంస్థకు భవిష్యత్తు వారసురాలిగా ఎంపికైంది నైరిక హోల్కర్, తాజాగా ఆసియా పవర్ బిజినెస్ ఉమెన్ 2024 జాబితాలో స్థానం సంపాదించారు. అమెరికాలోని కొలరాడో కాలేజీలో ఫిలాసఫీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ పూర్తి చేసింది. లండన్ లో న్యాయశాస్త్రాన్ని చదువుకుంది. 2017 లో ఆమె ఓ ఈజీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకరుగా నియమితురాలయింది. నైరిక లండన్ భారత్ లాఫర్న్ లో పనిచేసింది. తమ కంపెనీలు వ్యూహాత్మక ప్రణాళిక లో కీలక పాత్ర […]

అల్పాదాయ వర్గాల మహిళలకే తోడ్పాటు

గోవాలో ‘మ్యూజియం ఆఫ్ గోవా’ ( ఎం ఓ జి) కి చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ శారద కేల్కర్.ఆమె పబ్లిక్ పాలసీ లో మాస్టర్స్ చేసింది.చిల్డ్రన్ ఆర్ట్ స్టూడియో స్థాపించి పిల్లలకు కళారంగం గురించి తెలుసుకునేందుకు అవకాశం కల్పించింది .గ్రాఫిక్ డిజైనింగ్,ఫ్యాషన్ ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైనింగ్, యానిమేషన్,గేమింగ్ సృజనాత్మక ఉపాధి రంగాలను కళల విభాగంలోకి తీసుకువస్తూ కళారంగాన్ని విస్తరిస్తోంది శారద.’అమి గోవా ‘అనే నాన్ ప్రాఫిటబుల్ సోషల్ ఎంటర్ ప్రైజ్ ద్వారా అల్పాదాయ వర్గాల మహిళలు తయారు […]

నెయిల్స్ కు గుర్తింపు

త్రిపర్ణ బెనర్జీ ఫిల్మ్ మేకర్,స్క్రిప్ట్ రైటర్.ఈమె తీసిన షార్ట్ ఫిల్మ్ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైంది.ఆ షార్ట్ ఫిల్మ్ పేరు నెయిల్స్.సైకలాజికల్ హారర్ చిత్రం ఇది.ద గిఫ్ట్, వన్ మోర్, ది స్కూల్ ఇన్ ది క్లౌడ్, డాక్ ఘర్ వంటి సినిమాలకు పనిచేసింది త్రిపర్ణ.ఈమె దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిల్మ్ రైడింగ్ అన్ ద మూన్ బొట్.ఈ చిన్న సినిమా బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డు గెల్చుకొంది.త్రిపర్ణ […]

అందమైన బంగారు పక్షి

మిస్ యూనివర్స్ కిరీటం అందకపోయినా గోల్డెన్ బర్డ్ కాస్ట్యూమ్ తో అందరి హృదయాలను గెలుచుకున్నది రియా సింఘా మిస్ యూనివర్స్ పోటీలకు మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించింది రియా సింఘా. ఆమె ధరించిన ది గోల్డెన్ బర్డ్ దుస్తులను  వియత్నాం డిజైనర్ గుయెన్ న్గోక్ డిజైన్ చేశారు.

ఈమె నిజమైన ప్రపంచ సుందరి

34 సంవత్సరాల లోజినా సలా మిస్ యూనివర్స్ ఈజిప్ట్ గా ఎంపికై మాతృదేశానికి గౌరవం తెచ్చి పెట్టింది. అందాల పోటీలో పాల్గొన్న తొలి విటిలిగో వ్యాధి గ్రస్తురాలు. 8 ఏళ్ల వయసులో బొల్లి సోకిన ఈమె తన అనారోగ్యాన్నీ మనస్ఫూర్తిగా అంగీకరించి, చక్కగా చదువుకున్నది. ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అయింది. యూనిసెఫ్,ఫోర్ట్స్ తో కలిసి మహిళా సాధికారత కోసం పనిచేసింది ఆమె కృషికి ది మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఉమెన్ వంటి అవార్డులు వచ్చాయి. తాజాగా ఈజిప్ట్ కు […]

మా అమ్మే నాకు ఆదర్శం

రష్యా లో నిర్వహించిన డబ్ల్యూ పి.పి.ఎల్ పవర్ లిఫ్టింగ్ లో 48 కేజీల కేటగిరి లో బంగారు పతకం  సాధించింది కస్తూరి రాజమూర్తి,ఆమె తల్లి రైల్వే స్టేషన్ లో పోర్టర్ గా బరువులు మోస్తుంది,ఆమె తనకు స్ఫూర్తి అంటుంది కస్తూరి,తమిళనాడు లో చెయ్యేర్ అనే చిన్న గ్రామంలో పుట్టింది కస్తూరి,తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్ మెంట్ అథారిటీ ప్రోత్సాహంతో పవర్ లిఫ్టింగ్ సాధన చేసిన ఏడాదిలో 36 పతకాలు సాధించింది కస్తూరి.

సినిమా కంటే ధ్యానం ఇష్టం

గీతాంజలి సినిమా తో ప్రేక్షకుల ఆదరణ గెలుచుకున్న పూర్వ సినీ నటి గిరిజా షెట్టర్ 35 ఏళ్ల విరామం తర్వాత మళ్ళీ ఒక కన్నడ సినిమా లో సింగిల్ గా నటించింది.తనకు సినిమాల కంటే యోగ పైనే ఆసక్తి అంటుంది గిరిజ.లండన్ లో స్థిరపడిన గిరిజ యోగ లో పి హెచ్ డి చేశారు రాజయోగ ప్రత్యేకంగా అధ్యయనం చేశారు యోగ, ధ్యానం మనసుని అలజడల నుంచి కాపాడుతాయి.రోజుకు అరగంట ధ్యానం మీ ఆత్మకు రక్షణ కల్పిస్తుంది […]

మంగ్లీ కి పురస్కారం

నేపథ్య గాయని మంగ్లీ (సత్యవతి చౌహన్ మంగ్లీ ) ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందుకున్నది. అలాగే కన్నడ పాటకు బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా సైమా అవార్డ్, కర్ణాటక విశ్వమాన్య పురస్కారం తెలుగులో బలగం పాటకు ఐఫా అవార్డ్ అందుకున్నది. ఈ జాతీయ స్థాయి పురస్కారం ఈ ఏడాది నాకు ఎంతో ప్రత్యేకం అన్నది మంగ్లీ.

వింటర్ స్పెషల్ వెల్వెట్

ఈ వింటర్ లో ఏదైనా ఫంక్షన్ లో వెలిగిపోవాలి అంటే అట్లాగే చలికి తట్టుకునే ఒక ప్యాట్రన్  కోసం చూస్తుంటే వెల్వెట్ డిజైనర్ డ్రెస్ లు ఎంచుకోమంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. వెల్వెట్ లో ముఖ్మల్ అని కూడా పిలుస్తారు. ఎంబ్రాయిడరీ ఈ వెల్వెట్ క్లాత్ పైన ఎంతో అందంగా కనిపిస్తుంది.సాంప్రదాయ వేడుకల్లో లెహంగా చోళీ డిజైన్ లలో చక్కగా ఒదిగిపోతుంది. ఈవినింగ్ పార్టీలకు ప్లయిన్ వెల్వెట్ స్పెషల్ గా డిజైన్ చేస్తున్నారు.ఈ సీజన్ కు బెస్ట్ ఎంపిక […]