Sunday, 28 Jun, 2026

మానవీయ కృషి

బ్రైట్ ది సోల్ ఫౌండేషన్ స్థాపించి వందల కొద్ది అనాధ శవాలకు దహన సంస్కారాలు నిర్వహించింది ఢిల్లీకి చెందిన పూజా శర్మ కొట్లాటలో చనిపోయిన సోదరుడి దహన కార్యక్రమాలకు ఎవరు సాయం చేయకపోవడంతో తానే ముగించిన పూజా శర్మ అనాధ శవాలను సాగనంపాలని నిర్ణయం తీసుకుంది. ఇది ఆడవాళ్లు చేసే పని కాదని ఎందరో విమర్శించిన ఆమె తన కృషిని ఆపనే లేదు. సేవా రంగంలో ఆమె చేస్తున్న మానవీయమైన కృషికి ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చాయి […]

బిబిసి 100 లో వినేష్ ఫోగట్

2024 సంవత్సరానికి గాను బిబిసి ఎంపిక చేసిన 100 మంది ప్రభావ వంత మహిళల పేర్లలో వినేష్ ఫోగట్ చోటు చేసుకుంది. కుస్తీ యోధురాలిగా దేశానికి పథకాలు తెచ్చి కీర్తి పెంచిన వినేష్ ఫోగట్ ఇటీవల హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎం ఎల్ ఏ గా ఘనవిజయం సాధించింది. స్త్రీలకు ఎన్ని సవాళ్లు ఎదురైనా ఎదురీదగలరని నిరూపించి వినేష్ ఫోగట్ అందుకే ఆమెకు బి బి సి లో చోటు దొరికింది.

ట్రెండింగ్ లో సమీరా

నేపథ్య గాయని సమీరా భరద్వాజ్ ఇన్‌స్టా రీల్స్ తో సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉంది తెలుగు తమిళ్ భాషల్లో 500 పాటలు పెట్టిన సమీరా డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. అలాగే ఇన్స్టా లో రీల్స్ చేయడంతో చాలా ఫేమస్ కూతుర్ని చిత్రవిచిత్రమైన ప్రశ్నలు అడిగే  తల్లిగా బంధువుల మనస్తత్వాలు ఏరి పడేసే ఇల్లాలిగా, నవతరం అమ్మగా ఆమె చేసే రీల్స్ ప్రేక్షకులు ఎంతో ఇష్టపడతారు.ఈ మధ్యకాలంలో సినిమాలో కూడా నటిస్తోంది సమీరా భరద్వాజ్.

సహజ వర్ణాలే అందం

శ్రద్ధా మిశ్రా బ్యూటీ కన్సల్టెంట్ టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులకు పనిచేస్తుంది. అల్లు అర్జున్, సుస్మితాసేన్, అభిషేక్ బచ్చన్ వంటి వాళ్లు ఆమె కష్టమర్స్. ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో ఎం డి చేసిన  శ్రద్ధా ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ ల దగ్గర మేకప్ పరిజ్ఞానాన్ని సంపాదించింది. ఆమె మేకప్ చేస్తే సహజమైన మొహం లాగే కనిపిస్తుంది కానీ మొహానికి రంగు వేసినట్లే తెలియదు. తమ అడ్వటైజ్మెంట్స్ కోసం ఈమె మేకప్ నే కోరుకుంటారు. సినిమాలు డిజైనర్ కాంపెయిన్లు కమర్షియల్స్ […]

ఎన్నారైల పర్సనల్ షాపర్

హైదరాబాద్ కు చెందిన స్నేహ పోల ప్రగడ, గత ఎనిమిది పర్సనల్ షాపర్ గా స్టైలిస్ట్ గా ఫ్యాషన్ ప్రియుల మన్ననలు అందుకుంటుంది. ‘ఎకిసా బై శాండ్స్‌’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఎన్నారైల కోసం షాపింగ్ చేసి పెడుతోంది స్నేహ. కర్ణాటక,తమిళనాడు, వారణాసి,జైపూర్,ఢిల్లీ కోల్ కతా వంటి ప్రదేశాల్లో ఉత్పత్తులను కస్టమర్స్ కు వీడియోల్లో చూపిస్తూ వీటిని కొనుగోలు చేస్తుంది స్నేహ. స్టిచ్చింగ్ స్టైలింగ్ సేవలను కూడా అదనంగా అందిస్తుంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా […]

ఇంటి భోజనం గెలిపించింది

39 ఏళ్ల వయసులో 40 కిలోల బరువు తగ్గి మిసెస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ యు.ఎస్.ఎ 2024 అందాల పోటీ గెలిచింది చాందిని సింగ్. 118 కిలోల బరువున్న చాందిని సింగ్ జీవనశైలి. ఆహారపు అలవాట్లు మార్చుకొని 40 కిలోల బరువు తగ్గింది. వాకింగ్, జాగింగ్ చేసింది. జంక్ ఫుడ్ మానేసి ఇష్టమైన భారతీయ వంటకాలు అన్నీ తిన్నది. భోజనంలో ప్రోటీన్,ఫైబర్ చేర్చడం ద్వారా క్యాలరీలు లోటు లేకుండా చూసుకొని చక్కగా బరువు తగ్గిందామె.ఏకంగా అందాల పోటీల్లో పాల్గొని […]

వయసుతో పనేముంది

యాభయ్యో ఏటా భరతనాట్యం అరంగేట్రం చేశారు లలిత ఆనంద్. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి వి ఆనంద్ భార్య. నచ్చిన పని చేసేందుకు వయసు అడ్డురాదని నిరూపించారామె. ఐ ఎస్ బి రీసెర్చ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఫైనాన్స్ పాఠాలు చెప్పారు.డయాబెటిస్ బారిన పడ్డాక నృత్యం వైపు దృష్టి పెట్టారామె అలాగే టెయిల్విండ్ టేల్స్ అనే పుస్తకం రాశారు. టీనేజర్ల కోసం రాసిన ఈ పుస్తకం బాగా అమ్ముడుపోయింది. జీవితానికి ప్రణాళికలు ఉండవు. నచ్చినట్లుగా జీవించాలి […]

హర్మీత్‌ కౌర్‌ కు అపూర్వ గౌరవం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా 54 ఏళ్ల హర్మీత్‌ కౌర్‌ ను అమెరికా న్యాయశాఖ పౌర హక్కుల ఆటర్ని జర్నల్ జనరల్ గా ప్రకటించారు. అమెరికాలోని భారత సంతతికి చెందిన సిక్కు మహిళ హర్మీత్‌ కౌర్‌ లా డిగ్రీ అందుకున్న హర్మీత్‌ కౌర్‌ 2006లో థిల్లాన్ లా గ్రూప్ ఇంక్ ను స్థాపించి ప్రజా హక్కుల కోసం లాభాపేక్ష లేని కేంద్రాన్ని నడిపింది. 2020లో ఎన్నికల ప్రచార సమయంలో న్యాయ సలహాదారుగా కూడా వ్యవహరించింది.

గనుల్లోకి మహిళలు

సింగరేణి చరిత్రలో మొదటిసారిగా భూగర్భ బొగ్గు గనుల్లో మహిళా అధికారులను నియమిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది ఇటీవల సింగరేణి యాజమాన్యం మేనేజ్మెంట్ ట్రెయినీ ఎక్స్టర్నల్ పరీక్ష నిర్వహించింది. ఎంపిక చేసిన వారిలో 28 మంది మహిళలు ఉన్నారు. ఎంపికైన మహిళలను వివిధ పరియాల్లోని భూగర్భ గనుల్లో విధులు నిర్వహించేందుకు కేటాయించింది వీరు గనుల్లో పనిచేయనున్నారు.

అరవైల్లో విహారయాత్ర

విద్యావేత్తగా స్థిరపడిన మెర్సీ రెగో 1977 లో ముంబైలో చదువుకున్నారు. పదవ తరగతి లో ఆమెకు ఎంతో మంది స్నేహితులున్నారు. 60 ఏళ్లు దాటాక ఈ స్నేహితులను కలుసుకోవాలనుకున్నారు మెర్సీ క్లాస్ అఫ్ 1977 పేరుతో ఫేస్బుక్ పేజీ ఏర్పాటు చేసి స్నేహితులను కలుసుకున్నారామె. 2022 బెంగళూరులో తొలిసారి గర్ల్స్ ట్రిప్ పేరుతో బెంగళూరులో కలుసుకున్నారు స్నేహితులు. తర్వాత అంతర్జాతీయ ప్రయాణం పెట్టుకుని కోలాలంపూర్ వెళ్లి వచ్చారు. వయసు మళ్ళిన ఈ స్నేహ బృందం చేసిన విహారయాత్ర […]

మహిళలకు ఆదర్శం

రైతులకు మహిళలకు ఆదర్శంగా నిలిచిన రేణు సాంగ్వాన్ జాతీయ గోపాల్ రత్న పురస్కారం 2024 అందుకున్నది హర్యానా రాష్ట్రం ఝజ్జర్ జిల్లాలోని ఖర్మాన్ గ్రామానికి చెందిన రేణు పాడి పరిశ్రమలో ఆమె చేసిన సేవలకు గాను కృషి జాగరణ్ మిలీనియర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డ్ కూడా అందుకున్నది. 280 పాడి ఆవులతో మూడు కోట్ల టర్నోవర్ తో ఆమె సొంతమైన గోకుల్ ఫామ్ శ్రీకృష్ణ అత్యుత్తమమైన ఫామ్ లలో ఒకటి ఈ ఫామ్ తయారు చేసే […]

అసామాన్యురాలు

బి బి సి ఎంపిక చేసిన 100 మంది స్ఫూర్తిదాయక మహిళల్లో పూజా శర్మ పేరు కూడా ఒకటి అనాధ శవాలకు దహన సంస్కారాలు చేయటం ఆమె ఒక బాధ్యత గా తీసుకుంది మూడేళ్ల గా సాగుతున్న ఈ ఆమె నాలుగు వేల మృతదేహాలకు దహన సంస్కారాలు చేసింది. అన్న చనిపోయాక ఆయినా దహన సంస్కారాలకు ముందు రాకపోతే తానే అంత్యక్రియలు నిర్వహించింది. చనిపోయిన వారి మతాచారాలకు అనుగుణంగా వారి గౌరవంగా సాగనంపుతుంది పూజా శర్మ. ఇన్స్టాగ్రామ్ […]

ఈ అమ్మే అద్భుతం

భారత దేశపు తొలి ఎఐ మామ్ ఇన్ఫ్లుయెన్సర్ కావ్య మెహ్రా మాతృత్వం లోని వాస్తవికత, ఆధునిక సంకేతికత కలుపుకొని సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన ఈ అమ్మను సృష్టించింది కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్ వర్క్.ఈమే వ్యక్తిత్వాన్ని నిజమైన తల్లుల అనుభవాల నుంచే తీసుకున్నారు. కావ్య మెహ్రా పోస్ట్ లో మాతృత్వానికి సంబంధించిన అంశాలే ఉంటాయి. గర్భిణిగా ఉన్నప్పటి నుంచి కాబోయే తల్లిగా తన భావోద్వేగాలను విస్తరిస్తోంది ఎఐ అమ్మ.. పాపాయి సంరక్షణ,స్వీయ సంరక్షణతో పాటు వంటకాలు తయారీ గురించి […]

అత్యంత సౌందర్యవతి

ఈ ప్రపంచంలో అత్యంత పర్‌ఫెక్ట్ గా ఉండే మొహం బెల్లా హడిద్ దే నని చెబుతున్నాయి గణాంకాలు గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ ఫై సైంటిఫిక్ కాలమానం ప్రకారం ఈమె మొహం 94. 35 శాతం పర్‌ఫెక్ట్ గా ఉండటం టైమ్ మ్యాగజిన్ ఆమెను అత్యంత ప్రభావంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పేర్కొన్నది. 2016లో హడిడ్ మోడల్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు.2016 లోనే ఆమె టాప్ 50 మోడల్స్ లో స్నానం పొందింది. […]

మెరుపులీనే బ్రోకెడ్

పట్టు దారాలు అసలైన బంగారు పోగులు లేదా బంగారు రంగు దారాలతో తయారయ్యే బనారస్ బ్రోకెడ్ పండుగలు వేడుకలకు మంచి ఎంపిక.పూలు లతల డిజైన్లు బంగారు వెండి దారాలతో తయారవుతాయి. బంగారు పోగులు వస్త్రానికి రాచరికపు హుందాతనాన్నిస్తాయి. నూలు బ్రొకెడ్ చీరలు కూడా పట్టు మెరుపులు చిందిస్తూ విలాసవంతంగా కనిపిస్తాయి. వారణాసి మూలాలున్న బెనారస్ బ్రోకెడ్ చీరె పెళ్లిళ్లలో వధువు కోసం ఎంచుతారు.

నిప్పుల నడక జీవితం

బబ్లీ గంభీర్ జాతీయ,అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ప్రముఖ బ్యూటీషియన్ మధ్యప్రదేశ్ లోని జావరా గ్రామానికి చెందిన ఒక సిక్కు కుటుంబంలో ఎనిమిదో సంతానంగా పుట్టిన బబ్లీ కి పుట్టుకతో పొట్టి చేతులు ముడేసి వేళ్ళున్నాయి.ఎన్నో చేదు అనుభవాలతో పెరిగిన బబ్లీ ప్రముఖుల వద్ద శిక్షణ పొంది ఇందౌర్  లో పార్లర్ తెరిచింది.రెండేళ్లలో తన అపాయింట్మెంట్ తీసుకుంటేనే సేవలు అందుకోగలిగే స్థాయికి చేరింది. 15 జాతీయ అంతర్జాతీయ అవార్డులు 2013లో రాష్ట్రపతి అవార్డును అందుకుంది. సవాళ్లను ఎదురీది తేనే […]

సంగీత ప్రభంజనం జస్లీన్

సంగీత ప్రపంచం లో ఓ ప్రభంజనం జస్లీన్ రాయల్ విజయ్ దేవరకొండ తో చేసిన మ్యూజిక్ వీడియో పాట ఇప్పుడు వైరల్ అవుతుంది. రెండు వారాల్లో దాదాపు రెండు కోట్ల వ్యూస్ సంపాదించుకుంది. జస్లీన్ రాయల్ గాయని, మ్యుజీషియన్ గా కంపోజర్ గా యువతను ఆకట్టుకుంది. పంజాబ్, హిందీ గుజరాతీ లతో పాటు ఇంగ్లీషులోనూ పాటలు పాడింది. మహిళా మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. బాలీవుడ్ లో కంపోజర్ గా స్థానం సంపాదించుకుంది. షోక్ […]

సమాజ సేవ దిశగా సారా టెండూల్కర్

సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ డైరెక్టర్ గా ఆయన కుమార్తె సారా టెండూల్కర్ నియమితురాలయింది. మారుమూల పల్లె ప్రాంతాల్లోని పిల్లలకు వైద్య సేవలు అందిస్తూ పోషకాహార  లోపాన్ని అధిగమించేలా ఈ ఫౌండేషన్ సహాయ కార్యక్రమాలు చేపడుతోంది. సారా టెండూల్కర్ లండన్ లోని యూనివర్సిటీ నుంచి క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్ లో మాస్టర్ చేసింది .ఈ విషయాన్ని గురించి చెబుతూ మా అమ్మాయి సారా ఎస్ టి ఎఫ్ డైరెక్టర్ కావడం నాకెంతో సంతోషంగా ఉంది. ఆమెకు […]

 18 ఏళ్ళకే పైలట్  

కర్ణాటక కు చెందిన సమైరా హల్లూర్ 18 సంవత్సరాలు కమర్షియల్ పైలట్ అయింది. బీజాపూర్ లోని సైనిక్ స్కూల్లో చదువుకున్న సమైరా ఇంటర్ తర్వాత వినోద్ యాదవ్ ఏవియేషన్ అకాడమీలో ధియరి పూర్తి చేసి మహారాష్ట్రలో కార్వర్ ఏవియేషన్ అకాడమీ లో చేరి 200 గంటల విమాన అనుభవం పొందింది.18 వ ఏటనే కమర్షియల్ పైలట్ గా అర్హత సాధించి కొత్త తరానికి ప్రతినిధి నని పించుకొంది సమైరా.

ఆమె చిరునామా సంగీతం

మూడు దశాబ్దాలుగా సరిగమల ప్రవాహంలో సాగిపోతున్న శ్వేత ప్రసాద్ ప్రతిష్టాత్మక ఉస్తాద్   బిస్మిల్లా ఖాన్ పురస్కారం అందుకున్నారు. రక్త కన్నీరు నాగభూషణం గారు, ఈమె తాతగారు. పదో ఏట నుంచే కూచిపూడి భరతనాట్యం ప్రదర్శనలకు పాడేవారు. శ్వేత కొన్ని వేల ప్రదర్శనలు వర్క్ షాప్ సంగీత తరగతులలో బిజీగా ఉండే శ్వేత సర్కారు వారి పాట లో కళావతి జతులు ఆలపించారు. ఆ పాట ఎంతో పాపులర్. ఎక్కువగా సినిమాలకు పాడిన శ్వేత ప్రత్యేకత సంగీత […]