Friday, 14 Aug, 2026

వ్యాపారం కూడా ఇష్టమే

న్యూయార్క్ లోని సోనా ఇన్ న్యూయార్క్ రెస్టారెంట్ లో భారతీయ రుచులు ఉంటాయి.దోసకాయ తో చేసిన వంటకాలు కూడా ఇక్కడ ఫేమస్ అంటుంది ప్రియాంక చోప్రా న్యూయార్క్ నడిబొడ్డున ఉన్న ఈ రెస్టారెంట్ నా హృదయంలో ఒక భాగం అంటుంది ప్రియాంక. బాలీవుడ్ లో హాలీవుడ్ లో నటనా రంగం లోనే కాదు వ్యాపార రంగం లోనూ తన సత్తా చాటుతోంది ప్రియాంక.ఇప్పటికే ఆమె సొంత హెయిర్ కేర్ బ్రాండ్ ‘అనోమోలీ’ ప్రొడక్షన్ హౌస్ పర్పుల్ పెబల్ […]

వ్యాయామం చాలా ముఖ్యం

50 ఏళ్లు దాటాక ఎంత వ్యాయామం చేస్తే అంత మంచిది అంటున్నారు నిపుణులు.స్త్రీ, పురుషులన్నా సమస్య లేకుండా కండరాల పరిమాణం, దృఢత్వం తగ్గిపోతుంది.కండరాల కదలిక వల్లే జీవక్రియలు పెరిగి క్యాలరీలు కరుగుతాయి. కండరాల్లో పట్టు తగ్గుతే బరువు తగ్గుతారు. అందుకే 50 దాటిన తర్వాత బరువులు ఎత్తడం, స్పీడ్ వాక్,నడక, తాడాట ఆడడం వంటివి చేస్తే ఎముకలు దృఢంగా ఉంటాయంటున్నారు.

ఫ్లోర్ శుభ్రం

ఇళ్లలో ఎన్నో రకాల మరకలు కనిపిస్తాయి రసాయనాలు లేకుండా వాటిని క్లీన్ చేయచ్చు. ఫ్లోర్ పైన కాఫీ టీ మరకల్ని నీళ్లలో వెనిగర్ వేసి శుభ్రం చేయచ్చు. టైల్స్ పైన మరకల్ని నిమ్మరసంతో పోగొట్టవచ్చు. మార్బుల్స్ ని వేడి నీళ్లతో శుభ్రం చేయాలి. బండల పైన నూనె ఉంటే ముందుగా కార్న్ ఫ్లోర్ వేస్తే అది నూనె పీల్చేస్తుంది.తర్వాత సబ్బు నీళ్లతో శుభ్రం చేయచ్చు. బ్లీచింగ్ పౌడర్ చల్లి ఫ్లోర్ క్లీన్ చేయొచ్చు. టైల్స్ పైన మరకలను […]

పాలిచ్చే తల్లులకు 

బిడ్డకు తల్లిపాలను మించిన పౌష్టికాహారం లేదు.పాలు సమృద్ధిగా ఉండాలంటే తల్లులకు కొన్ని పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. ఓట్స్ లో, బ్రౌన్ రైస్ గుడ్డు లో ఎన్నో పోషకాలున్నాయి. ఓట్స్ పాలతో కానీ తేనెతో కానీ కలిపి తీసుకుంటే చక్కగా పాలు పడతాయి. ఓట్స్ బిస్కెట్స్ తిన్న ప్రయోజనమే.రోజుకు రెండు గుడ్లు,జీడిపప్పు, వాల్ నట్స్, బాదం పప్పులు పాలిచ్చే తల్లులకు మంచి ఆహారం.

సమస్య పరిష్కారం

బ్లూ సర్కిల్ డయాబెటిస్ ఫౌండేషన్ నుంచి మధుమేహం ఉన్నవారికి సాయం చేస్తోంది నుపుర్ లాల్వాని.ఎనిమిదేళ్ల వయసు లోనే ఆమెకు టైప్ 1 డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆరోగ్యం బాగాలేక పోయిన బాగా చదువుకోంది నుపుర్.ఎంబిఎ  చేసింది ఆతిధ్య రంగంలో స్థిరపడింది.డయాబెటిస్ తో తాను పడిన ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని బ్లూ సర్కిల్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ ఇషా ల ద్వారా నిరుపేదలైన మధుమేహ వ్యాధిగ్రస్తులకు మందులు ఆర్థిక సాయం మార్గదర్శకత్వం అందిస్తోంది.200 పైగా వర్క్ షాప్ లు […]

జుట్టు మెరిసిపోతుంది

జుట్టు రాలకుండా ఆరోగ్యంగా మెరుస్తూ ఉండాలి అనుకుంటే బి విటమిన్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియంతో పాటు కురులకు ఆరోగ్యం ఇచ్చే బయోటిన్ కూడా దొరుకుతుంది. పాలకూర,పప్పు ధాన్యాలు బీన్స్,బాదాం,పొద్దుతిరుగుడు గింజల్లో బి విటమిన్ ఉంటుంది.బ్రౌన్ రైస్,ఓట్స్, చేపలు వీటితో పాటు విటమిన్ సి ఉండే నిమ్మ, నారింజ పండ్లు తినాలి ఇవన్నీ రోజువారీ ఆహారంలో ఉంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

డైట్ తో అనారోగ్యాలు

ది ఆయుర్వేదిక్ వెల్‌నెస్ కుక్ బుక్ రాశారు ఆయుర్వేదిక్ విలేజ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గీతా రమేష్ ఈ పుస్తకానికి ఆమె ప్రతిష్టాత్మక గౌర్మాండ్ అవార్డ్ అందుకున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో చేసిన వంట తినాలి మార్కెట్లోకి వచ్చే ఎలాంటి డైట్ లు ఫాలో అవ్వరాదు కీటో డైట్ వంటి వాటి వల్ల సమస్యలే తప్ప ప్రయోజనం ఉండదు. శరీరానికి అనవసరంగా కష్టపెట్టకూడదు అంటారు గీతా రమేష్. ముఖ్యంగా మహిళలు పౌష్టిక ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి అంటారామె.

క్రూర జంతువులకు రక్ష

ఆపదలో ఉన్న వన్యప్రాణుల ప్రాణాలు కాపాడుతుంది డాక్టర్ మేఘన పెమ్మయ్య చిరుత పులులు, పక్షులు, తాబేళ్లు,పాములు,తోడేళ్లు పులులు, నక్కలు వంటివి అడవుల సమీప గ్రామాల్లో ప్రవేశించి పొరపాటున ఏ గోతుల్లోనో చిక్కుకుంటే వాటిని ఎంతో సాహసంతో కాపాడి ప్రాథమిక చికిత్స చేస్తుంది మేఘన.ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్ లో ఒక్కోసారి గాయాలు తగులుతాయి. కానీ జంతువుల పట్ల నాకున్న ఇష్టంతో అవేమీ పట్టించుకోను అంటారామే.

ఉత్తమ ప్రచారకర్త

దక్షిణాఫ్రికా లోని మారుమూల గ్రామంలో పుట్టిన మూడేళ్ల లేతుకుఖాన్య మ్జాజీ అల్బానీ బ్రెడ్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ అయింది.అమ్మ వద్దన్నా ఏడ్చి మరీ బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కునే పాప మొహంలో ఆనందం చూసి ఆమె మామ లుంగీసా జాజి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.గంటల్లో ఆ ఫోటో వైరల్ అయ్యి ఇంత ఆనందించే పాపను మీ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోమని లక్షలమంది ట్రీట్ చేశారు దాంతో ఆ కంపెనీ వాళ్ళు ఇంతకుముందు […]

అసలైన వ్యాపారవేత్త

కైరవి మెహతా ను స్టీల్ రంగానికి రాణి అంటుంటారు తండ్రి వి.కె ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ అధిపతి.దేశవ్యాప్తంగా వీరికి వేర్ హౌస్ లు ఉన్నాయి. ఈ వ్యాపారంలో నిలదొక్కుకోవడం కోసం కైరవి మెహతా ఎంతో కష్టపడింది. మేనేజ్మెంట్ డిగ్రీ చేసింది నేరుగా సి ఈ ఓ బాధ్యతలు తీసుకోకుండా కింద స్థాయి నుంచి వర్కర్స్ తో కలిసి పనిచేసింది. డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ వేగవంతం చేసేందుకు సాఫ్ట్ వేర్ ప్రవేశపెట్టింది ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి కస్టమర్స్ ను పెంచి […]

బాల్కనీ మేకోవర్

చాలామందికి చిన్న బాల్కనీ వరండాలు ఉంటాయి. ఆ కాస్త ప్లేస్ అందంగా తీర్చిదిద్దొచ్చు అనుకున్నది రామా హేమలత స్వర్గ బాల్కనీ మేకోవర్ పేరుతో ఇన్ స్టా లో సరికొత్త డెకరేషన్ లతో బాల్కనీ ఫోటోలను పోస్ట్ చేసింది.ఆమె వీడియోలు పోస్ట్ లు సినిమా తారలు కూడా మెచ్చుకొని తమ బాల్కనీలు డెకరేట్ చేసి ఇవ్వమని అడిగారు. ఇప్పుడు వ్యాపారం లక్షల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతోంది. ఇప్పుడు పార్లర్లు, విల్లాలు ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తోంది రామా హేమలత.

మతిమరుపే రాదు

50 ఏళ్లు రాకముందే చాలా మందికి మతిమరుపు వస్తోంది. వృద్ధాప్యంలో ఇది మరింత సమస్య అవుతోంది. ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివర్సిటీ నిపుణులు వందల మంది పై పరిశీలన చేసి ప్రతి వాళ్లు టీవీ చూడటం,సంగీతం వినటం, చిత్రలేఖనం, పజిల్స్ కంప్యూటర్ వాడకం వంటి వ్యాపకాలు అలవాటు చేసుకుంటే మతిమరుపు రాదంటున్నారు. కంప్యూటర్ వాడే వాళ్ళలో తక్కువ మతిమరుపు లక్షణాలున్నాయట.సృజనాత్మకమైన హాబీలు ఉన్నవాళ్ళలో మతిమరుపు సమస్య లేదట.

చీరలే ఇష్టం

చీరలు అంటే నాకు మహా ఇష్టం అంటారు ఉషా ఉతుప్. పట్టుచీర నుదుట పెద్ద బట్టు చేతులకు గాజులతో కనిపించే ఈ పాప్ గాయని తన దగ్గర 600 పట్టు చీరలు ఉన్నాయంటున్నారు. బంగారు హంసల మోటిఫ్ లతో ఉండే కాంచీపురం చీరలు పేస్టల్ షేడ్స్ తెలుపు రంగుల్లో ఉండే అందమైన చీరల్లో వేదికపై పాడే ఉషా ఉతుప్ దక్షిణ భారతదేశపు సాంప్రదాయపు ప్రతీకలా అనిపిస్తారు.

రెడీ టు మిక్స్

మంగమ్మ ఫుడ్స్ పేరుతో కోట్ల వ్యాపారం చేస్తున్నారు ప్రతిమ విశ్వనాథ్ దోష పిండి, నెయ్యి, చిరు తిండ్లు భిన్న రకాల చపాతీ, పూరీలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు బెంగళూరు చెన్నై లోని వెయ్యి స్టోర్స్ ఈ కామర్స్ సంస్థల్లో దొరుకుతాయి. వందమంది ఉద్యోగులున్న ఈ సంస్థ ఎన్నో రెడీ టు మిక్స్ ఆహారాలకు ప్రసిద్ధి.

పక్షుల గ్రంథాలయం

డిజిటల్ ఫెదర్ లైబ్రరీ. కామ్ పేరుతో మన దేశానికి చెందిన 1300 రకాల పక్షి జాతుల వివరాలు అందించారు ఈషా మున్షీ. ఈమె ఆర్కిటెక్ట్  కూడా ఈ వెబ్ సైట్ శాస్త్రవేత్తలకు అటవీశాఖ అధికారులకు పక్షి ప్రేమికులకు ఎంతో ఉపయోగపడుతుంది. పక్షుల గురించి ఎలాంటి సమాచారం అయినా ఈ వెబ్ సైట్ లో దొరుకుతుంది. దేశంలోనే తొలి డిజిటల్ ఫెదర్ లైబ్రరీ ఇది.

అందంగా గోళ్ళు

నెయిల్ ఆర్ట్ డిజైన్స్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు అమ్మాయిలు. వేడుకల్లో, తగిన డ్రెస్ లు వేసుకున్నట్టుగా,నెయిల్స్  మ్యాచింగ్ పట్ల శ్రద్ధ చూపించినట్లుగా, నెయిల్స్ కూడా తీర్చిదిద్దు కుంటున్నారు. ఫ్రెండ్ షిప్ డే, ఇండిపెండెన్స్ డే, రక్షాబంధన్,కృష్ణాష్టమి ల వంటి వేడుకలకు నెయిల్ ఆర్ట్ డిజైన్లు చాలా ప్రత్యేకమైనవి సృష్టించారు.అందంగా ఉండాలి అనుకునే వాళ్ళు చేతులకు పెడిక్యూర్ చేయించుకునే సమయంలో గోళ్లు చక్కగా కట్ చేయించుకుని ప్రతిరోజు కొబ్బరి నూనె మర్దన చేసుకోవాలి. అవసరం అయితే ఆర్టిఫీషియల్ […]

వంట క్లాసులే ఉద్యోగం

ఉదయపూర్ కు చెందిన శశికళ విదేశీ యాత్రికులకు వంట నేర్పుతోంది. ఆర్థికంగా చితికిపోయిన దశలో చిన్నతనం నుంచి శ్రద్ధగా చేసే వంటనే వృత్తిగా చేసుకున్నది. శశి కుకింగ్ క్లాసెస్ లో వెయ్యి మందికి పైగా వంట నేర్చుకున్నారు. మాతృభాష తప్ప ఇంకేమీ రాని శశికళ విదేశీ భాషలు నేర్చుకున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు విదేశీయులకు తప్పనిసరిగా చెప్తూ ఉంటారామే.

లైఫ్ స్టయిల్ మార్చుకోన్న  

బెస్ట్ ఉమెన్ అచీవర్ అవార్డ్,మిసెస్ హైదరాబాద్ టైటిల్ ను అందుకున్నారు అరుణ రాజ్ వర్మ మూడేళ్ల క్రితం 125 కేజీల బరువు ఉన్న ఆమె వర్క్ వుట్స్ హెల్తీ డైట్ తో బరువు తగ్గిన విధానాన్ని యూట్యూబ్ లో లైవ్ ఇచ్చారు. ఆహారం విషయంలో శ్రద్ధ గా ఉండటం ప్రతిరోజు వర్క్ వుట్స్ చేయడం జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా నే బరువు తగ్గి పోయాను అంటుంది అరుణ రాజ్ వర్మ.

బొట్టు మచ్చ సమస్యా ?

బొట్టు పెట్టుకునే ప్రదేశంలో ఒక్కసారి దురద, వాపు, మచ్చలు వస్తాయి. అక్కడ చర్మం పొడిబారడం వల్ల ఇలాంటి సమస్య వస్తుంది. ఆ ప్రదేశంలో మాయిశ్చరైజర్ రాసి మర్దన చేయాలి. ప్రతిరోజు రాత్రివేళ కొబ్బరి లేదా నువ్వుల నూనె రాసుకోవాలి. అలోవెరా జెల్ రాసి మర్దన చేసిన నలుపు, మచ్చలు పోతాయి. బొట్టు బిళ్ళలు గ్లూ గమ్ తక్కువగా ఉండేలా ఎంచుకోవాలి. రాత్రి పడుకునే ముందర వాటిని తీసేసి మాయిశ్చరైజర్ రాసుకుంటే దురదలు వాపులు రాకుండా ఉంటాయి.

అంతర్జాతీయ గుర్తింపు

2007లో అన్వర్ చిత్రంలో బాలీవుడ్ లో నటించిన రసికా దుగల్ ఓటీటీ సీరియల్స్ లో టాప్ యాక్టర్ మిర్జాపూర్, ఢిల్లీ క్రైమ్ వంటి వెబ్ సిరీస్ లో హమీద్ మాంటో వంటి చిత్రాలతో రసిక అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. ఢిల్లీలో బ్యాచిలర్ సైన్స్  చదువుకొన్న రసిక పోషించిన పాత్రలు బలమైనవీ, బలహీనమైనవీ, గొప్పవీ మనసుని బాధపెట్టేవి అంటారు విమర్శకులు. 15 సంవత్సరాలుగా బాలీవుడ్ లో నటిస్తున్న రసిక ఓటీటీ సిరీస్ లో మొదటి వరుసలో నిలబడింది.